మహబూబ్‌నగర్

విమోచనాన్ని విస్మరించిన టీఅర్‌ఎస్‌కు పుట్టగతులుండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఅర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, భవిష్యత్తు తరం క్షమించదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యెన్నం శేఖరె డ్డి అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యోన్నం శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్టన్రికి సెప్టెంబర్ 17నే నిజమైన స్వాతంత్రం వచ్చిదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడకం ముందు తెలంగాణ విమోచన దినోత్సవంపై ఉద్యమాలు చేసిన టీఅర్‌ఎస్ శ్రేణులు నేడు నోరుమెదపడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీఅర్‌ఎస్ ప్రభుత్వం ఓక్క నాడు కూడ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించక పోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ వాదం గద్దె నెక్కిన టీఅర్‌ఎస్‌కు భవిష్యత్తులో పుట్టగతులుండవని ఆయన అన్నారు. ముందుస్తు ఏన్నికలకు టీఅర్‌ఎస్ ప్రభుత్వం పోవడం పోయే కాలం దాపురించినట్లుగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హమీలను తుంగలో తొక్కిన టీఅర్‌ఎస్ ప్రభుత్వానికి గతగిన బుద్ది చెప్పాలని శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బీజేపీ ఏంపీటీసీ సభ్యుడు జంగయ్యయాదవ్, మండల అధ్యక్షుడు బాలస్వామి, నాయకులు పరమేష్‌గౌడ్, శక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.

* మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 17: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలో నిషేద ఉత్తర్వులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి జారీ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఉత్తర్వుల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 15వ తేది సాయంత్రం 6గంటల నుండి అక్టోబర్ 14వ తేది సాయంత్రం 6గంటల వరకు అంక్షలు విధించడం జరిగిందన్నారు. ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలలో రాళ్లు, కర్రలు, కత్తులు, తుపాకులు, పేలుడు పదార్థాలు ఏ రకమైన ఇతర ఆయుధాలు వద్ద ఉంచుకోవద్దని తెలిపారు. ఒకవేళ ఆయుధాలు తమ వెంట ఉంచుకున్నట్లు అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. ప్రజలు ఒకే ప్రాంతంలో గుంపులుగా రోడ్లపై ఉండరాదని తెలిపారు. ప్రజలు సంచరించే ప్రాంతాలలో పెద్ద స్పికర్లు, డిజే పెట్టరాదని అన్నారు. పాటలు పాడరాదని, వాహనాల హరన్‌లు మోగించరాదని అన్నారు. సెక్షన్ 30పోలీసు చట్టం కింద 1861 ప్రకారం నిషేద ఉత్తర్వులు ఆమలులోకి వచ్చాయని అన్నారు. సెక్షన్ 30కి సంబంధం లేకుండా పోలీసు ఆఫీసర్లు, మిలీటరి, హోంగార్డులు వారి విధులను యధావిధిగా నిర్వహిస్తారని, అంతిమ ఊరేగింపుకు ఎటువంటి అంక్షాలు లేవని ఒక ప్రకటనలో తెలిపారు.