మహబూబ్‌నగర్

పాలమూరుకు మరో పుష్కరిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 17: పాలమూరు జిల్లాలో మరో పుష్కరిణీకి సమయం ఆసన్నమైంది. గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో అట్టహాసంగా వైభోవపేత్తంగా జరిగిన కృష్ణా పుష్కరాలను తరించిన భక్తులు మరో సారి పాలమూరు వైపు దృష్టి పెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం క్రిష్ట మండలంలోని కుసుమూర్తి, సూకూర్ లింగపల్లి, తంగిడిగి గ్రామాల సమీపంలో గన భీమా నది ప్రవాహిస్తుంది. భీమా నది తంగిడిగి దగ్గర కృష్ణానదిలో చేరుతుంది. కృష్ణా, భీమాల సంగమంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే అక్టోబర్ 12 నుండి 23 వరకు భీమా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను ప్రభుత్వం పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా అధికారులకు పలు సూచనలు ఇచ్చింది. అందుకుగాను ప్రభుత్వానికి సంబందిత అధికారులు పలు పనుల నిమిత్తం కోసం నివేదికలు పంపారు. అందులో భాగంగా ఇటీవల ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికిగాను రూ.5.45 కోట్లు నిధులు మంజూరి చేస్తూ జీఓను విడుదల చేసింది. కాగా సూకూర్‌లింగపల్లి, కుసుమూర్తి, తంగిడిగి దగ్గర గల భీమా నది పుష్కరఘాట్ల ఏర్పాట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టారు. సంబందిత పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందుగా తమ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రస్తుతానికి రూ,5.45 కోట్ల నిధులను కేటాయించింది. పుష్కరాల్లో భాగంగా కృష్ణా, భీమా నదుల సంగమం దగ్గరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న అధికారులు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ వీఐపీ ఘాట్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేవలం మూడు ఘాట్లుమాత్రమే ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇటీవల అధికారులతో నిర్వహించిన సమావేశంలో సూచించారు. మక్తల్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో గల భీమానది ఉంది. అయితే నారాయణపేట, మహబూబ్‌నగర్, డిపోల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. మక్తల్ బస్టాండ్ నుండి ప్రతి పది నింషాలకు ఒక ఆర్టీసి బస్సును నడింపించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. అయితే కృష్ణా పుష్కరాల తరహాలో కాకా పోయిన్నప్పటికిని ఈ పుష్కరాలకు మాత్రం కర్ణాటక నుండి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. భీమా నది ప్రారంభం కర్ణాటక రాష్ట్రంలో కాబట్టి కన్నడీలు ఎక్కువగా రావచ్చనే అంచనాలు మాత్రం ఉన్నాయి. అయితే భీమానది పుష్కరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత పనె్నండేళ్ల క్రితం మొదటి సారి నిర్వహించారు. దత్తపీఠాధిపతి విఠల్‌బాబా ఎంతో ఆలోచన చేసి మొదట ఆయనే భీమా నది పుష్కరాలను ఇక్కడ ఆయన హయంలోనే గతంలో కొనసాగాయి. నది తీరాన కొన్ని దేవాలయాలను నిర్మించి వాటికి విశిష్టతను తీసుకురావడంతో దివంగత విఠల్‌బాబా చేసిన కృషి అమోఘం అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొదటి సారి జరుగుతున్నప్పటికిని భీమానదికి మాత్రం ఇక్కడ రెండవ పుష్కరాలు అని చెప్పవచ్చు. విఠల్‌బాబా గత పనె్నండేళ్ల క్రితం ప్రారంభించిన పుష్కరాలు ఇక ప్రతి ఏటా 12 సంవత్సరాలకోసారి కొనసాగనున్నాయి.

అభివృద్ధిలో అగ్రగామి జడ్చర్ల
జడ్చర్ల, సెప్టెంబర్ 17: జడ్చర్ల నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందువరకు ఏనాడు కూడా జరగనంత అబివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల పట్టణంలో ఆయన పలు కార్యక్రమాలల్లో పాల్గొన్నారు. పట్టణంలో రంగారావుతోటలో గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని కల్వకుర్తి రోడ్డులో గల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు గానూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ సహకారంతో జడ్చర్లలో అనేక అబివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలోనే జడ్చర్లను అబివృద్ధిలో అగ్రగామిగా నిలిపామని ఆయన అన్నారు. అబివృద్ధిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొలేక ప్రతిపక్షాలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఎన్ని కూటములు ఎర్పడినా టిఆర్‌ఎస్ పార్టీ గెలుపును అడ్డుకోలేవని ఈ ఎన్నికల్లో మళ్లీ టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చేప్పారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య,నాయకులు ఉమాశంకర్, ప్రణీల్, రాంధేవారెడ్డి గుబ్బా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.