క్రైమ్/లీగల్

ఫ్లెక్సి చింపేసిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ.. రోడ్డుపై బైఠాయించిన చిన్నారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 18: వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ వారు ఏర్పాటు చేసిన ప్లెక్సిని చింపి వేయడంతో అతన్ని అరెస్టు చేయాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ముందుగా ధర్నాను విరమించాలని సిఐ కోరినా అతన్ని అరెస్టు చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీష్మించుకొని కూర్చోవడంతో పోలీసులు తమ వాహనాలతో వచ్చి మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా ఎత్తి పోలీసు జీపులో కూర్చోబెట్టారు. పెద్ద ఎత్తున్న అక్కడికి చెరుకున్న కాంగ్రెస్ నాయకులు పోలీసు జీపును చుట్టుముట్టి అడ్డగించారు. పోలీసు జులూం నాశించాలని, టీఆర్‌ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను తప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేయగా పోలీసులు, కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. ఈ సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గమనించిన మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పోలీసు జీపు దిగి కార్యకర్తలను వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్ళారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు కూర్చిలు తెప్పించి కూర్చోవాలని కోరినప్పటికి వారు స్టేషన్ ఆవరణలోనే బైఠాయించారు. ప్లెక్సి చింపిన వ్యక్తిని అరెస్టు చేసేంత వరకు తాము ఇక్కడే బైఠాయిస్తామని తెల్చిచెప్పారు. మధ్యాహ్న సమయం దాటుతుండడంతో మాజీ ఎమ్మెల్యేను భోజనం చేయాల్సిందిగా కొరినప్పటికి ససేమిరా అన్నారు. చివరికి సీఐ ఎస్పీ అపూర్వారావు, డిఎస్పీ సృజనలతో మాట్లాడి ప్లెక్సి చింపిన వ్యక్తిని అరెస్టు చేసి బుధవారం కొర్టులో హజరుపరుస్తామని హామిచ్చారు. ఈ ధర్నాలో డీసీసీ అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.