మహబూబ్‌నగర్

దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18: దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందుకే దేశంలోనే తెలంగాణ అగ్రగామీగా నిలిచిందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి లక్ష్మారెడ్డిత కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి నివేదన సభ ద్వారానే తెలంగాణ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్ నాయకులు ఈ సభను చూసి ఓర్వలేక తప్పుడు విమర్శలు చేశారని అది ప్రజలకు అర్థం చేసుకున్నారని అన్నారు. లక్షలాది మందితో సభ నిర్వహించడం ఓ చరిత్రనేనని అన్నారు. తెలంగాణ బిడ్డలు ఇంకా పారాయి పాలనను కోరుకోవడంలేదని తెలంగాణాలో పారాయిలకు స్థానం ఉండకూడదనే ఉద్యమం చేశారని తెలిపారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆంధ్ర పార్టీలతో జతకట్టి మళ్లీ ఆంధ్ర నాయకుల పెత్తనం చేయించాలని చూస్తున్నారని అందులో భాగంగానే మహాకూటమి అంటూ కొత్త డ్రామాలకు దిగారని ఆరోపించారు. వారి కూటములు కూలిపోవడం ఖాయమని అంతా టీఆర్‌ఎస్ వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఇలా ఉండాలని తెలంగాణ ప్రజానికానికి చూపించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ముందు కాంగ్రెస్ నాయకుల ఎత్తులు చిత్తుకావడం గ్యారంటీ అని అన్నారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి రాష్ట్రానికి సైతం అధిక నిధులు తీసుకువస్తున్నామని మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ఎన్నో పరిశ్రమలు తెచ్చామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేక టీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు తమరాష్ట్రాల్లో సైతం అమలు చేయాలనే ఆలోచన చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మాత్రం పచ్చకామెర్లు వచ్చాయని ఎద్ధేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తలకాయ తలకిందులు చేసి తప్పస్సు చేసిన అధికారంలోకి రారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవదని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఉద్యోగుల విషయంలో కూడా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే పీఆర్‌సి గానీ, ఐఆర్ గానీ కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పాలించే రాష్ట్రాల్లో సైతం కొత్త పెన్షన్ విదానానే్న అమలు చేస్తున్నారని అలాంటి పార్టీల నాయకులు ఇక్కడ ఓ మాట మాట్లాడటం విచారకరమని అన్నారు. జోనల్ వ్యవస్థ సమస్య పరిష్కారం అయిందని ఇక మీదట స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లబించనున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రంను పెడితే కుక్కలు చింపిన విస్తర్లు అవుతాయనే ప్రజలు 2014లోనే కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్ చేతుల్లో పెట్టారని తెలిపారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో తెరాస నాయకులు బెక్కం జనార్దన్, కోట్ల కిషోర్‌రెడ్డి, వెంకటయ్య, రహిం, శివరాజ్, బాలయ్య, లక్ష్మయ్య, సుదీప్‌రెడ్డి, నానీ తదితరులు పాల్గొన్నారు.

మోసపూరిత పార్టీల మాటలు నమ్మవద్దు
* అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి * కాంగ్రెస్ పాలనలోనే ఆత్మబలిదానాలు
* సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.40వేల కోట్లు ఖర్చు * వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
నర్వ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో ఎన్నికల సమయంలో మోపపూరిత పార్టిని ఓట్ల కోసం ఎన్నొ అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, మహాకూటమి పార్టీల మాటలు నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నర్వ మండ కేంద్రంలో టీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి, ఎంపి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నాల్గున్నర సంవత్సరాలలో అభివృద్ది పరంగా ముందుకు వెళ్ళిందని ఇంకా అభివృద్ది కావాలంటే మళ్ళి ముఖ్యమంత్రి కేసి ఆరే ఉండాలన్నారు. దేశంలో ఎక్కడ జరగని అభివృ ద్ది తెలంగాణ ప్రభుత్వం సాధించిందన్నారు. అభివృద్ది, సంక్షేమం , విద్యా, వైద్యం, అన్ని కార్యక్రమాలుముందుకు తీసుకేళ్తుందన్నారు. ప్రతి సంవత్సరానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల మాటలు నమ్మవద్దంటూ ప్రజలకు సూచించారు. గతంలో చేయని వారు ఎప్పుడు ఏలా అభివృద్ది చేస్తారని ఆపదమొక్కుల పార్టీల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ఎంతో మంది ఆత్మబలిదానాలు జరిగాయన్నారు. 14 ఏళ్ళ పాటు తెలంగాణ రాష్టస్రాదన కోసం కేసి ఆర్ పోరాడి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామన్నారు. గత ప్రభుత్వాల హయంలోనే అనేక రంగంలో వెనుకబడి పోయమన్నారు. మహకూటమిగా ఏర్పడినా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చేతగాకానే ఇతర పార్టీలతో పోత్తులు పెట్టుకుంటుందన్నారు. ప్రజలు ఓట్లు వేసేది మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి మాయ మాటల నమ్మవద్దండని, అభివృద్ది చేసే పార్టీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 460 సంక్షేమ పథకాలు అమలుచేసి పుట్టే బిడ్డ నుండి చనిపోయే వరకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత 67 సంవత్సరాలుగా చేయని అభివృద్ది నాల్గున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో జరిగిందన్నారు. దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. నియోజకవర్గంలో పార్టీలో చిన్న చిన్న అసమతి ఏర్పడినా వాటిని సత్వరమేర పరిష్కరించి అందరం కలిసికట్టుగా టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో భూత్కూర్, సంగంబండ, కాల్వల ద్వారా చెరువులు నింపి త్రాగునీరు అందిస్తున్నామన్నారు. నర్వ మండలంలో రెండు గ్రామాలు తప్పా ప్రతి గ్రామానికి సాగునీరు అందుతుందన్నారు. బీమ పేస్ -1 98 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రజలే నాకు దేవుళ్ళు, నా కష్టసుఖాలను పాలు పంచుకుంటానన్నారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తానని మళ్ళి ఇసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరిమల్లప్ప, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు సుచరిత, స్ర్తిశిశు సంక్షేమ శాఖ అధికారి లలితాముదిరాజ్, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, సంయుక్త, లక్ష్మన్‌గౌడ్, రాజవర్దన్‌రెడ్డి, ఆశిరెడ్డి, దండు అయ్యప్ప, లక్ష్మణ్, చిన్నయ్య, రాములుగౌడ్, విజయ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.