మహబూబ్‌నగర్

అస్వస్థతతో ఇంటర్ విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల రూరల్, సెప్టెంబర్ 19: పట్టణంలోని వీఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వినీల (20) అనే విద్యార్థిని మంగళవారం అర్థరాత్రి అస్వస్థతకు గురై ప్రభుత్వ బీసీ కళశాల బాలికల వసతి గృహంలో మృతిచెందింది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాగనూలు గ్రామానికి చెందిన ఆంజనేయులు,రత్నమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు కాగా జడ్చర్లలోని వసతి గృహాల్లో ఉంటూ పట్టణంలోని కళశాలో విధ్యాబ్యాసం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు తొటి విద్యార్థినులతో కలిసిమెలిసి ఉన్న వినీల అర్థరాత్రి అకస్మాత్తుగా వాంతులు చేసుకొని అస్వస్తతకు గురి కాగా వసతిగృహం సిబ్బంది, తోటి విధ్యార్థినులు ఆమెను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. వసతి గృహం సిబ్బంది ఒకరు విధ్యార్థిని తల్లిదండ్రులకు బుధవారం ఉదయం ఫోన్ చేసి మీ అమ్మాయి అస్వస్తతకు గురైందని, వచ్చి తీసుకెళ్లాలని తెలుపగా హుటాహుటిన గ్రామం నుండి బయలుదేరి వచ్చిన తల్లిదండ్రులు అప్పటికే మృతిచెందిన వినీల మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.వినీల మృతి వెనుక ఎదో బలమైన కారణం ఉందని వారు ఆరోపించారు. వసతిగృహం వార్డెన్ స్వప్నారాణి నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని, ఆమెపై ఎస్సీఎస్టి అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కాగా విధ్యార్థిని ఆకస్మిక మృతి గురించి తెలుసుకున్న పలు విధ్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు హుటాహుటిన ఆసప్రతికి చేరుకొని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ వచ్చి విధ్యార్థిని కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయనివ్వమని వారు హెచ్చరించారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ వెల్‌ఫేర్ డిప్యూటి డైరక్టర్ విధ్యాసాగర్,వార్డెన్ల అసోసియేషన్ ఆదినారయణరెడ్డి సిఐ బాల్‌రాజ్‌లు పలు దఫాలుగా విధ్యార్థిని బందువులు,ప్రజా, విధ్యార్థి సంఘాల నాయకులతో చర్చించి విధ్యార్థిని కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకున్నారు. కాగా విధ్యార్థిని మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విధ్యార్థిని మృతి చెందినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డెన్ స్వప్నారాణి స్థానికంగా ఉండకపోగా హాస్టల్ చుట్టూ ఎలాంటి రక్షణ లేకపోవడం వల్లే విధ్యార్థిని మృతి చెందినట్లుగా అభిప్రాయపడుతున్నారు.

మంత్రి ఆర్థిక సహాయం
జడ్చర్లలోని విఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతూ మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా మృతి చెందిన విద్యార్థిని వినీల కుటుంబ సభ్యులకు మంత్రి లక్ష్మారెడ్డి రూ.25వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా,ఆమొత్తాన్ని టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, వ్యవసాయ మర్కెట్ కమిటి చైర్మన్ మురళి,నాయకులు శంకర్‌నాయక్,ఇమ్మూ, శ్రీకాంత్,సత్యం, బాలు తదితరులు మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేసి వారిని పరామర్శించారు.