మహబూబ్‌నగర్

జోరందుకున్న ప్రచారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19: తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లే కనబడుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించిన కేసీఆర్ ఏకంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించి ఇక ప్రజల్లోకి వెళ్లాలంటూ అదేశించారు. గత వారం రోజుల నుండి అంత దూకుడుగా వ్యవహరించని తెరాస అభ్యర్థులు బుధవారం ఒక్కసారిగా అన్ని నియోజకవర్గాల్లో తమ దూకుడును పెంచారు. మంత్రులతో సహ, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి జైపాల్‌యాదవ్ పేరును ప్రకటించడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మార్చాల గ్రామంలో ప్రచారం ప్రారంభించారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను తెరాసలో చేర్చుకున్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి లక్ష్మారెడ్డి సైతం జడ్చర్లలో ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెరాస అభ్యర్థిగా మరోసారి రంగంలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రచారరథాన్ని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి జెండా ఊపి పూజ చేసి ప్రారంభించారు. పలు విధుల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రచారరథంపై నిలిచి ప్రజలకు అభివాదం చేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇకపోతే దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరోసారి రంగంలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దేవరకద్ర మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో భారీ మోటర్‌సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా తన ప్రచార పర్వాన్ని ఉదృతం చేశారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెరాస అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్థన్‌రెడ్డి గ్రామాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టి రైతులతో ముఖాముఖిగా బేటి అయ్యి నియోజకవర్గానికి వచ్చిన కృష్ణాజలాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలో దిగుతున్న మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డిలు తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తూ ప్రచారంలో బీజీగా కొనసాగుతున్నారు. అయితే మక్తల్‌లో రాంమోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు తెరాస నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికిని వారిని పట్టించుకోకుండా రాంమోహన్‌రెడ్డి తనదైన రాజకీయ పంతాలో ప్రజల్లోకి వెళ్తున్నారు. తెరాస అభ్యర్థులు గ్రామాల్లోకి వస్తూ ప్రచారపర్వం చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు డైలామాలో పడుతున్నారు. త్వరగా మహాకూటమి వ్యవహారం తెలిస్తే ఆసలు ఆట మొదలవుతుందని ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మహాకూటమి వ్యవహారం ఇంకా ఏటు తెల్చుకోకపోవడంతో ప్రతిపక్ష పార్టీలలో మహాకూటమిగా ఏర్పాటుకు సన్నద్దం అవుతున్న పార్టీల జిల్లా నేతల్లో, టికెట్లను ఆశీస్తున్న ఆశావాహులు సైతం త్వరితగతిన కూటమి వ్యవహారం తెలిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో జిల్లాలో ఆరెడు నియోజకవర్గాల్లో ఓటుబ్యాంకు ఉన్నటువంటి ప్రాంతాల్లో సైతం బీజేపీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మహాకూటమిలోని బాగస్వామ్యం అవుతామనుకుంటున్న నేతలు ఇటు బీజేపీ శ్రేణుల్లో అభ్యర్థుల వ్యవహారం ఎటు తెలకపోవడంతో తెరాస ప్రచారాన్ని చూసి మాత్రం పలు రకాలుగా చర్చించుకోవడం గమనార్హం.