మహబూబ్‌నగర్

బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న బీజేపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపడానికి వ్యూహాలను రచిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడంతో అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావం మహబూబ్‌నగర్ నుండే చేయడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పలు రకాలుగా కసరత్తులు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ ఎన్నికలను మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్‌గానే పరిగణిస్తుండడంతో అభ్యర్థుల ఎంపిక మాత్రం అంత సులువుగా ఉండదనే అభిప్రాయం బీజేపీ కార్యకర్తలు వ్యక్తంచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో ఏడెనిమిది స్థానాలలో బలమైన పోటీ ఇస్తూనే, నాలుగు స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామస్థాయిలో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ఎవరైతే బాగుంటుందని అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర నాయకత్వం ముందుగా మండల అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయంతో పాటు సీనియర్ నాయకులు, సంఘ్ పరివార్ నేతలను సైతం సంప్రదించి అభ్యర్థుల ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రజల్లో ఏ నాయకుడికి ఆదరణ ఉందని పార్టీ నాయకులే కాకుండా పార్టీ సానుభూతిపరుల అభిప్రాయాన్ని సైతం పరిగణంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుని కార్యకర్తలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు నేతలు మహబూబ్‌నగర్ జిల్లాలో రహస్యంగా పర్యటిస్తూ అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే మక్తల్ నియోజకవర్గం నుండి బీజేపీ సంపర్క్ అభియాన్ రాష్ట్ర చైర్మన్ కొండయ్య పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంతగ్‌పాండురెడ్డి పేరును కూడా పరిశీలిస్తుడంగా దేవరకద్రలో ప్రధానంగా బీజేపీ ఓబీసి మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎగ్గని నర్సిములుతో పాటు మరో ఇద్దరు పేర్లను సైతం పరిగణంలోకి తీసుకుని వారి పేర్లపై అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి పేరు పరిశీలనలో ఉండగా మరో ఇద్దరు నేతలు తమకు సైతం టికెట్ ఇవ్వాలంటూ రాష్ట్ర నేతలకు విన్నవించుకున్నట్లు తెలుస్తుంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారికి దాదాపుగా టికెట్ ఖరారు అయిందనే సంకేతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆచారి గత 2014 ఎన్నికల్లో కేవలం 70 ఓట్లకు పైచీలుకుతో ఓటమి చెందారు. మళ్లీ ఆయన మరోసారి అగ్ని పరీక్షకు దిగబోతున్నారు. గద్వాల, వనపర్తి నియోజకవర్గాలపై కూడా బీజేపీ ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఓ గిరిజన నేతను సైతం రంగంలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ లంబాడ గిరిజనుల ఓట్లు అధికంగా ఉండడంతో వారికి ఓ టికెట్‌ను కూడా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఓ వ్యాపార వేత్త టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తెరాస అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించడంతో వారి గెలుపోటములపై కూడా బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టింది. అదేవిధంగా కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటు కాబోతున్న మహాకూటమి అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలకపోవడంతో ఆ విషయాన్ని సైతం దృష్టిలో ఉంచుకుని తమ అభ్యర్థుల ఎంపిక కూడా ఆషామాషీగా నిర్ణయం తీసుకోవద్దని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తాము ఒంటరి పోరాటం చేస్తున్నామని బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతామని తేల్చి చెప్పారు. ఎన్నికల షెడ్యూల్డ్ వచ్చాకే తమ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పడంలో అంతర్యం ఏముందనే విషయం కూడా బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నాయకులు సైతం పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కాగా పార్టీ పరంగా బీజేపీ గత నాలుగైదు నెలల్లో గ్రామ స్థాయిలో శక్తి కేంద్రాలు అంటూ, బూత్ కమిటీలు అంటూ నిరంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలతోనే ఇటీవల నిర్వహించిన అమిత్‌షా ఎన్నికల శంఖారావం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే అభ్యర్థుల విషయం మాత్రం ఈ దఫా అంతా సులువుగా ఎంపిక చేయరనే విషయాన్ని బీజేపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.