మహబూబ్‌నగర్

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఉద్యమనేత దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ 6వ వర్థంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోవ డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్‌తో పాటు పార్టీ నాయకులు లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతిని పురష్కరించుకుని పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ జిల్లా ఇన్‌చార్జి నివాళులు అర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘం నాయకులు ప్రవిణ్, వెంకటరమణతో పాటు సంఘం నేతలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా ఇన్‌చార్జి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ ప్రజానీకానికి ఆదర్శ ప్రాయుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలంటూ ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప రాజకీయ నేత అన్నారు. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో కూడా ఆయన ప్రాత అమోఘమని తెలిపారు. తన తుదిశ్వాస వరకు తెలంగాణ కోసం పోరాటం చేశారని తెలిపారు. ఇలాంటి మహానీయుల ఆశయ సాధన కోసం ప్రతి తెలంగాణ బిడ్డ కృషి చేయాలని తెలిపారు.
నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ తానే ఉద్యమకారుడిని అని చెప్పుకుంటున్నారని లక్ష్మణ్ బాపూజీ లాంటి ఎందరో మహానుభావులు కృషి వారి స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకోగలిగామని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకుడు మంత్రి పదవులను లెక్కచేయకుండా ఉద్యమం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బాల్‌కిషన్, లక్ష్మణ్‌యాదవ్, మంత్రి నర్సిహ్మాయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు ఛేరిన ఈవీఎంలు
గద్వాల, సెప్టెంబర్ 21: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించే ఈవీయంల, వివి ప్యాట్‌లు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరాయని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనాల ద్వార గద్వాల పట్టణంలోని బీరెల్లి రోడ్డులో గల ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు ఈవియంలు రాగా వాటిని గోదాలంలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. వివిధ పార్టీల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఈవీఎంల వాహనాల సీల్ తనిఖీ చేసి, సీల్ ఓపెన్ చేసి, ఈవీయంలు, వీవీ ప్యాట్‌లను పరిశీలించారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకుగాను 680 వివి ప్యాట్‌లు, 810 బ్యాలెట్ యూనిట్లు, 610 కంట్రోల్ యూనిట్లు మొత్త 2210 వచ్చినట్లు, వాటిని భద్రపరిచినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఈవీయంల తనిఖీలు, వాటి పని చేసే విధానం వివరించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్, సంయుక్త కలెక్టర్ జె.నిరంజన్, ఆర్డీఓ రామునాయక్, డీఎస్పీ షాకీర్‌హుస్సేన్, తహశీల్దార్లు రాజు, వీరభద్రప్ప, సుబ్రమణ్యం, ఆర్‌ఐ వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జనానికి ఏర్పాట్లు పరిశీలించిన చైర్మన్, డీఎస్పీ
కల్వకుర్తి, సెప్టెంబర్ 21: వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని వాడవాడల కొలువుదీరిన గణనాధుల నిమజ్జనానికి గల ఏర్పాట్లను కల్వకుర్తి పుర పాలక సంఘం చైర్మన్ శ్రీశైలం, డీఎస్పీ పుష్పారెడ్డి, పుర పాలక సంఘం కమీషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్ ఎఇ అమర్‌సింగ్, ఎస్సై నర్సింహ్మ, కౌన్సిలర్ యాదగిరిచారి లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుర పాలక సంఘం చైర్మన్ శ్రీశైలం మాట్లాడుతూ పట్టణ సమీపంలో గల బాపన్‌కుంటలో గణేషుణి నిమజ్జనానికి పూర్తి చేర్పాట్లు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా డీఎస్పీ పుష్పారెడ్డి మాట్లాడుతూ విఘ్నేశుడి నిమజ్జనానికి పోలీసుల బలగాలతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని అమె తెలిపారు.
పక్షం రోజుల్లో మిషన్ కాకతీయ పనులు పూర్తి
* మెగా కంపెనీ ఇంజనీర్ల వెల్లడి
అమరచింత, సెప్టెంబర్ 21: ఆత్మకూర్, అమరచింత ఉమ్మడి మండలాల్లో ఇప్పటి వరకూ మిషన్ కాకతీయ పనులు 60 శాతం చేశామని మిగిలిన 40 శాతం పనులు పక్షం రోజుల్లో పూర్తి చేసి వాటర్ గ్రీడ్ అధికారులకు అప్పగిస్తామని మిషన్ కాకతీయ పనులు చేపడుతున్న మెగా కంపెనీ సీనియర్ ఇంజనీర్లు బాల్‌కుమార్, రాఘవారెడ్డి వెల్లడించారు. శుక్రవారం వారు పట్టణంలోని బీసీ కాలనీలో మిషన్ కాకతీయ పైపులైన్ల పనులను పర్యావేక్షించి విలేఖరులతో మాట్లాడుతూ నిర్మాణం చేపట్టిన ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే బాధ్యత తమపై ఉందని అందులో సందేహం వద్దని నల్లా కనెక్షన్ ఇచ్చే చోట విద్యుత్ అంతరాయం వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయని కాలనీ వాసులకు సూచించారు. మరో పక్షం రోజుల్లో రెండు మండలల్లో పనులు పూర్తి చేస్తామని వారు వెల్లడించారు సిబ్బంది బాలు శ్రీను ఉన్నారు.