మహబూబ్‌నగర్

రెండేళ్లలో 98వేల ఎకరాలకు సాగునీరు అందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 21: నారాయణపేట నియోజకవర్గాన్ని, నియోజవర్గ ప్రజలను గద్వాల బంగ్లాకు బానిసలుగా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతోందని, బంగ్లాకు మనం బానిసలుగా బతుకుదామా లేక స్వతంత్రంగా పాలించుకుని ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ది చేసుకుందామా అని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రజలను ప్రశ్నించారు. శుక్రవారం నారాయణపేట మండలంలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సింగారం చౌరస్తా నుండి మండలంలోని కోటకొండ గ్రామం వరకు పార్టీ శ్రేణులు చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో టిఆర్‌ఎస్ మండల శాశ్వత కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వేపూరు రాములు అధ్యక్షత వహించగా పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమవేశంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నారాయణపేట నియోజకవర్గంపై పెత్తనం కోసం గద్వాల గడీలు ప్రయత్నాలు సాగిస్తున్నారని అందులో భాగంగానే పార్టీలు మారే నేతలను ప్రోత్సహిస్తూ తమ అక్రమ వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ది చేసి రాబోయే రెండు సంవత్సరాల్లో 98వేల ఎకరాలకు సాగునీరందించి ఈ ప్రాంత రుణం తీర్చుకుంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో రూపంగా అందుతున్నాయని సీఎం కేసీఆర్‌ను మళ్లీ సిఎంగా చూడాలంటే ప్రతి తెలంగాణవాది తనను గెలిపించాలన్నారు.
ద్రోహితో పొత్తు డీల్ 250 కోట్లా?
తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణను అడుగడుగునా తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు 250కోట్ల డీల్ కుదుర్చుకుందా అంటే అవుననే సమాధానమే వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఈ విషయం పత్రికల్లో సైతం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, విద్యార్థులు కోట్లాడి, ఆత్మబలిదానాలు చేసుకుని కేంద్రం మెడలు వంచితే అప్పుడు అమరుల ఆత్మబలిదానాలకు తలొగ్గిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందంటే ఎవరూ నమ్మవద్దన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని, అలాంటి పార్టీని నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజ్ సరాఫ్, వైస్ చైర్మన్ ఎబి చెన్నారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ వెంకట్రాములుగౌడ్, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు స్వప్న వెంకట్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.నర్సింహారెడ్డి, నాయకులు రమేశ్‌గౌడ్, మనోహర్ ప్రసాద్ గౌడ్, సుధాకర్‌బాబు, తిరుపతి, బాల్‌రాజ్‌గౌడ్, బోయిన్‌పల్లి రాజు, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.