మహబూబ్‌నగర్

మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, మే 8: తెలంగాణ ప్రభుత్వం చెరువులు పూడికతీతతో చెరువులకు జలకళ ఏర్పడుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్లికట్ట గ్రామంలో మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత వల్ల అటు భూగర్భ జలమట్టం పెరిగి తాగునీటి ఇబ్బంది రాకుండా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల పూడిక తీత పనులను వేసవి లోపల పూర్తి అయితే కురుస్తున్నా వర్షాలకు చెరువులు నిండి గ్రామాలు అభివృద్ది చెందుతాయని దాని వల్ల రైతులకు నీటి కష్టాలు తప్పుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అదేవిధంగా వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామి కూలీలలో ఉపాధి హామి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సుద్దకల్ గ్రామంలో నూతన బోరు మోటర్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ,కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఖాజా, కొండల్, నర్సింహ్మరెడ్డి, బాలయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.