మహబూబ్‌నగర్

తుర్కోనిపల్లి చెరువులో మరో మొసలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలరూరల్, సెప్టెంబర్ 25: మండల పరిధిలోని తుర్కోనిపల్లి గ్రామ చెరువులో గ్రామ యువకులు వలలతో మొసలిని పట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మంగళవారం ఉదయం వలలో మరో ముసలి చిక్కడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గత నెల నుంచి చెరువులో మొసలి ఉందని తెలియడంతో గ్రామస్థులు ఆ పక్కకు వెళ్లడానికి జంకుతున్నారు. వరుసగా రెండు రోజులో రెండు మొసలులు చిక్కడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కృష్ణానది తీరాన ఉన్న ఈ చెరువులోకి మొసళ్లు వచ్చి చేరుతుండటంతో ఈ చెరువులో ఇంకా ఎన్ని మొసళ్లు ఉన్నాయోనని ఆందోళన వ్యక్తంచేశారు. ఫారెస్టు అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
అభివృద్ధిపై చర్చ జరగాలి

* గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి
* మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 25: మహూబ్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సారథ్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లో చర్చ జరగాలని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో టీఆర్‌ఎస్ బూత్‌కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ బలోపేతం గురించి చర్చించారు. గత నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలిచి ప్రజాసేవకై తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.