మహబూబ్‌నగర్

జల దిగ్బంధంలో పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 10: పాలమూరు పట్టణం ఒక్కసారిగా జలదిగ్భందానికి గురైంది. వరుణుడు ముంచెత్తాడు. అప్పుడప్పుడే నిద్రలో నుండి మేల్కొంటున్న సమయంలో ఆకాశంలో భారీ శబ్ద్ధాలు, మెరుపులు, భారీ గాలి ఇంతలోనే వడగళ్ల వర్షం ప్రారంభమయింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వర్షం ప్రారంభమై ఉదయం 9 గంటల వరకు కుండపోతగా కురిసిన భారీ వర్షం పట్టణ ప్రజలను అతలాకుతలం చేసింది. ఏకధాటిగా ఐదు గంటల పాటు ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమైయ్యాయి. డ్రైనేజీలన్ని పొంగి పొర్లాయి. పట్టణంలో ఎటు చూసినా వర్షం నీరు వరదలా పారుతుంది. మహబూబ్‌నగర్ పట్టణంలో ఏకంగా 12సెం.మీకు పైగా కుండపోత వర్షం కురిసింది. పాలమూరు పెద్ద చెరువుకు వెళ్లే పాటుకాలువలు, డ్రైనేజిలు నిండిపోయి పొంగిపొర్లాయి. రోడ్లపై దాదాపు ఐదారు ఫీట్ల ఎత్తులో వరద ఉధృతి నెలకొంది. వరద నీటితో ఒక్కసారిగా పాలమూరు పెద్ద చెరువు నిండిపోయింది. ఉధృత్తంగా అలుగుపారింది. గత 38ఏళ్ల క్రితం పొంగి పొర్లి వరద భీభత్సం అప్పట్లో చూశామని పలువురు వృద్ధ్దులు చర్చించుకున్నారు. 38ఏళ్ల తర్వాత తాము మరోసారి పెద్ద చెరువు ఇంత పెద్ద ఎత్తున అలుగు పారడం చూస్తున్నామని పట్టణానికి చెందిన పలువురు వృద్దులు పారుతున్న అలుగుని చూస్తూ చెప్పారు. అయితే అలుగు నీరు రామయ్యబౌలి కాలనీకి వచ్చి చేరింది. ప్రస్తుతం పాలమూరు పెద్ద చెరువు పొంగి పొర్లడంతో రామయ్యబౌలి జల దిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల పైకప్పులపై, ఇంటిలోపల సజలపై తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. పెద్ద చెరువుకు వచ్చే కాలువలన్ని పొంగి పొర్లడంమే కాకుండా సమీపంలోని వేపురు గేరి, పాతతోట, న్యూటౌన్, రాజేంద్రనగర్, మార్కెట్ యార్డు, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, బయ్యమ్మతోట కాలనీలోకి నీరు వచ్చి ఇళ్లల్లోకి చేరింది. ఎటు చూసినా విదులన్ని జలపాతాన్ని తలపించాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. అదేవిధంగా పట్టణంలోని ఎర్రకుంట చెరువుకు కూడా వరద రావడంతో కుంటకు సంబంధించిన పాటు కాలువకు గండిపడింది. దీంతో బ్రహ్మణవాడి, కురువశెట్టికాలనీ, పాత పాలమూరు, బండ్లగేరి, వీరన్నపేట, బికెరెడ్డికాలనీ, ప్రాంతాలలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏ వీధి చూసినా వర్షం నీరు మోకాళ్ల లోతు ఇళ్లల్లోకి వచ్చి చేరింది. చిన్న పిల్లలు ఎక్కడ నీటిలో మునిగిపోతారనే భయంతో తల్లిదండ్రులు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. భారీ గాలులు వీయడంతో ప్రధాన రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడడ్డంతో మహబూబ్‌నగర్ పట్టణంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై పడ్డ చెట్లను తొలగించేందుకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సైతం భారీ వర్షంలోనే మున్సిపల్ కమీషన్ దేవ్‌సింగ్‌నాయక్, ట్రాఫిక్ సిఐ రామకృష్ణతో కలిసి చెట్లను తొలగించారు. అదేవిధంగా రోడ్లపై నిలిచిన నీటిని మళ్లించేందుకు జెసిబితో పలు డ్రేనేజీలకు సంబంధించిన రాళ్లను తొలగించారు. వర్షం నీరు వచ్చి చేరిన కాలనీలు కుర్వశెట్టి, రామయ్యబౌలి, వేపూర్‌గేరి, న్యూటౌన్ ప్రాంతాలలో ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి సహయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ - మహబూబ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైనేజిలు పొంగి పొర్లడంతో గిండ్రిగడ్డ, వన్‌టౌన్ చౌరస్తా, రాంమందిర్ చౌరస్తా, కలెక్టరేట్ చౌరస్తా, న్యూటౌన్, శ్రీనివాసకాలనీ, పద్మావతి కాలనీలలో రోడ్లలన్ని చెరువల్లా కనిపించాయి. కలెక్టరేట్ ఆవరణం వర్షపు నీటితో జళకళగా మారింది. వర్షం నీటి వరదకు కలెక్టరేట్ కార్యాలయం ప్రహరిగోడ కూలిపోయింది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో వస్తువులు తడిసి ముద్దాయ్యాయి. ఇళ్ల ముందు ఉన్నటువంటి బైకులు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. పెద్ద చెరువు ప్రాంతంలోని భగీరథకాలనీ, అయోద్యనగర్, బాలజీనగర్ కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పెద్ద చెరువుకు వెళ్లే ప్రధాన కాలువలు పొంగిపోర్లడం వాటి నీటి ప్రవాహన్ని చూసిన జనం భయానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారడం జరిగింది. పలు కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ కమీషనర్ దేవ్‌సింగ్‌నాయక్ సూచించారు. అయితే పట్టణంలో మాత్రం డ్రేనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వరదతాకిడి గురికాని కాలనీలలోకి సైతం నీరు వచ్చి చేరడంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకున్నారు. జిల్లా మైదానం చెరువులా మారింది. జడ్పి మైదానం నిండిపోయి అలుగును తలపించే విధంగా పారింది. న్యూటౌన్‌లోని లోతట్టు ప్రాంతమంతా జలదిగ్బందంలో చిక్కుక్కుపోవడంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని షాషాబ్‌గుట్ట వైపు వచ్చి సురక్షితంగా తలదాచుకున్నారు.