మహబూబ్‌నగర్

తడిసిముద్దైన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 10: మహబూబ్‌నగర్ పట్టణంలో మంగళవారం కురిసిన వర్షం బిభత్సాన్ని సృష్టించింది. అయితే పట్టణంలో ప్రజలు అదైర్యపడకుండా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ భారీ వర్షాన్ని లెక్కచేయకుండా ఉదయం 6 గంటలకే రోడ్డుపైకి వచ్చారు. అప్పటికీ కురుస్తున్న వర్షంతో పట్టణంలోని రోడ్లన్ని జలమయంగా మారాయి. భారీ వర్షానికి నెలకూలిన చెట్టును న్యూటౌన్ ప్రాంతంలో ట్రాపిక్ సిఐ రామకృష్ణతో పాటు వారి సిబ్బంది రోడ్డుపై పడ్డ చెట్టును వర్షంలోనే తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఇంతలోపే ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఈ విషయాన్ని చూసి కారులో నుండి కిందకు దిగారు. భారీ వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ రోడ్డుపైన పడ్డ చెట్టును తొలగించేదుకు శ్రీకారం చుట్టారు. పోలీసులు, మున్సిపల్ అధికారులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని చూసిన పట్టణ ప్రజలు సైతం ఎమ్మెల్యేనే వర్షంలో సహయక చర్యలు చేస్తుంటే మనమెందుకు చేయకూడదని ప్రజలు కూడా ముందుకు వచ్చి రోడ్డుపై పడ్డ చెట్లను తొలగించేందుకు చేయి కలిపారు. అదేవిధంగా న్యూటౌన్‌లో నిలిచిపోయిన వర్షంనీటిని మళ్లించేందుకు పెద్దవాగుకు సంబంధించిన రాళ్లను ఎమ్మెల్యే స్వయంగా తొలగించారు. దాంతో రోడ్డుపై ఉన్న నీరు కొంత మళ్లింపు అయింది. అంతేకాకుండా కురివిశెట్టి కాలనీలోకి ఎర్రకుంట నీరు వచ్చి చేరడంతో ఎమ్మెల్యే కుంటకు గడ్డపార చేతపట్టి కట్టకు గడ్డికొట్టాడు. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు భయపడోద్దని దేర్యంగా ప్రకృతిని ఎదుర్కొవాలని సురక్షిత ప్రాంతాలకు అవకాశం ఉన్నట్లు వెళ్లాలని సూచించారు. అయితే ఎమ్మెల్యే రంగంలోకి దిగానే మున్సిపల్ అధికారులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమీషనర్ దేవ్‌సింగ్‌నాయక్ సైతం సహయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాత్రం దాదాపు రెండు గంటల పాటు వర్షంలో తడుస్తూ వివిధ కాలనీలను పరిశీలిస్తూనే సహయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే వర్షంలో చేసిన పనిని చూసిన కొందరు ఆయనను ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలంటూ అధికారుల కన్నా ముందుగా వచ్చి రోడ్లపై ఉన్న చెట్లను తొలగిస్తుడం అభినందించదగ్గ విషయమని పట్టణ ప్రజలు చర్చించుకున్నారు.