మహబూబ్‌నగర్

బూస్వాములకు వ్యతిరేకంగా నక్సలైట్ల ఉద్యమంలో కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 16: భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్న నక్సలైట్ల ఉద్యమ సమయంలో 1995లో రామాకాంత్ మావోయిస్టు దళంలో చేరిన వెల్దండ మండలం హజిలాపూర్ గ్రామానికి చెందిన శ్రీను అలియాస్ రమాకాంత్ ఆత్మహత్య చర్చనీయాంశమైంది. మావోయిస్టు ఉద్యమంలో ఓ వెలుగు వెలిగిన గూండూరు శ్రీను అలియాస్ రమాకాంత్(44) ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటిదగ్గర సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందిన్నట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రమాకాంత్ మావోయిస్టు ఉద్యమంలో అప్పటి అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. రామాకంత్ పేరు వింటేనే ఇటు పోలీసులు అటు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులుపుట్టేది. మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి దాదాపు ఆరేడేళ్లు జిల్లా యాక్షన్ కమిటీ సభ్యుడిగా క్రీయాశీల భూమిక పోషించారు. ఈ సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో ఎన్‌కౌంటర్లలో రమాకాంత్ పాత్ర ఉంది. అజిలాపూర్‌లో ఇద్దరు ముగ్గురు భూస్వాములను ఎన్‌కౌంటర్ చేసిన దాంట్లో ఈయనే పాల్గొన్నారు. ఇర్వీన్‌లో బ్యాంకు దోపిడి, అమనగల్లులో ఎస్సై హన్మంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పంతులునాయక్ హత్య కేసుల్లో, వటవర్లపల్లిలో జరిగిన సంఘటనలో కూడా రమాకాంత్ పాత్ర ఉందని పోలీసులు అప్పట్లో కేసులు పెట్టి ఆయనపై రివార్డును కూడా ప్రకటించారు. 2005లో మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డిని హతమార్చిన దాంట్లో కూడా రమాకాంత్ పాత్ర ఉంది. దళ సభ్యుడిగా మావోయిస్టు పార్టీలో చేరిన రమాకాంత్ ఏకంగా మావోయిస్టు పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా దాదాపు రెండేళ్ల పాటు కొనసాగారు. ఈ సమయంలోనే జిల్లాలో రమాకాంత్ సారథ్యంలో జిల్లాలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2007లో అప్పటి జిల్లా ఎస్పీ చారుసిన్హా సమక్షంలో లొంగిపోయారు. కాగా రమాకాంత్ మావోయిస్టు పార్టీలో ఉన్న సమయంలోలోనే దళ సభ్యురాలు అలివేలు అలియాస్ పద్మను పెళ్లి చేసుకున్నారు. అయితే 2003లో కొల్లాపూర్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఆయన భార్య అలివేలు మృతి చెందారు. ఈ సంఘటనతో జిల్లాలో మరిన్ని ఎన్‌కౌంటర్లకు రమాకాంత్ దిగి జిల్లాలో పోలీసులకు, రాజకీయ నాయకులకు సింహస్వప్నంగా మారారు. పోలీసులకు లొంగిపోయిన తర్వాత 2008 సెప్టెంబర్‌లో మాజీ మావోయిస్టు నాయకురాలు దేవేంద్రమ్మ అలియాస్ రజితను ఊమామహేశ్వరంలో పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం రమాకాంత్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మంగళవారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం తరువాత స్వగ్రామం అజిలాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మాజీ మావోస్టులు చాలా మందే పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంత్యక్రియల సందర్భంగా అజిలాపూర్‌లో అడుగడుగునా పోలీస్ నిఘాను ఉంచారు. ఈ ఆత్మహత్య కుటుంబ కలహాలా లేక మరేదైనా ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దొరల పాలన అంతానికి కాంగ్రెస్ రావాలి
* పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం
*డీకే అరుణ సమక్షంలో తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిక
గద్వాల, అక్టోబర్ 16: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా జరుగుతున్న దొరలపాలన అంతం కావాలని, ప్రజాపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. మంగళవారం నియోజకవర్గంలోని తాటికుంట, మదనపల్లి, ఉమిత్యాల, కేటీ దొడ్డి, కొండాపురం, ఉప్పేరు, పూడూరు గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేటీదొడ్డి ఎంపీటీసీ మనెమ్మతో పాటు తెరాస కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో తెరాస నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, తెరాస ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్తహామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని వాపోయారు. మిషన్‌భగీరథ, ఇసుక, సాగునీటి ప్రాజెక్టుల పేరిట అధిక వ్యయాలకు అంచనాలు వేయించి కోట్లాది రూపాయల పర్సెంటేజీలతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయపావులు కదుపుతోందని వాపోయారు. ప్రజలందరు గమనించి దొరల పాలనకు అంతం చేయకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత వెనక్కి వెళ్లే అవకాశముందన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు అప్పులు తెలంగాణ ప్రజలపై ఉన్నాయని ఇది గమనించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవాన్ని గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చిందని, ఈ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఇంటికో ఉద్యోగం అమలుకాలేదని, కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మహిళలపట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న చిన్నారుల హత్యలు, అఘాయితాలపై ఏనాడు నోరుమెదపలేదని, నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించిన పాపాన పోలేదని, రైలు, బస్సు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోక పోవడం నియంతపాలనకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా కేటీదొడ్డి ఎంపీటీసీ మనెమ్మ, కర్ణ, ఎర్రన్న, నర్సింహులుస్వామి, రాఘవేంద్ర, అనిల్, మహేంద్ర, తాటికుంట వివేకానందయూత్ రవిప్రకాష్‌రెడ్డి, తిమ్మప్ప, మల్దకల్, పరుశరాజు, మదనపల్లి నుంచి నాగిరెడ్డి, బెల్లం వెంకట్రాముడు, సంజీవులు, నర్సింహులు, జమ్మన్న, ఎల్లప్ప, రాజు, సురేష్ తదితరులు ఉన్నారు.