మహబూబ్‌నగర్

మహాకూటమి.. దొంగల ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 16: మళ్లీ తెలంగాణ ప్రజలను వంచించడానికి కొందరు జతకట్టి మహాకూటమి అంటూ వస్తున్నారని అది మహాకూటమి కాదని, దొంగల మూఠా అని మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండల టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి నాలుగున్న ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసి చూపించిందని అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక రాజకీయంగా పతనమైతోతున్న కాంగ్రెస్, ఉనికిని కోల్పోతున్న టీడీపీలతో పాటు మరికొన్ని పార్టీల నాయకులు మహాకూటమి పేరిట మహాడ్రామాకు తెర లేపారని ఆరోపించారు. వెయ్యిమందికి పైగా తెలంగాణలోని విద్యార్థులు, యువకులు చనిపోవడానికి కారకులైన వారంతా ఏకమవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. అందులో ప్రధానంగా చంద్రబాబునాయుడుతో కలవడం దుర్మర్గమేనని అన్నారు. చంద్రబాబునాయుడు తెలంగాణను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు. ఇలాంటి తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ నాయకులు జతకట్టి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోడానికి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఇమాన్‌దారితో ఉన్న తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు, కాంగ్రెస్ నాయకులకు కర్రుకాల్చి వాతపెడుతారని హెచ్చరించారు. మహాకూటమిని కారు చక్రాలతో తొక్కిపడేస్తామని ఇంకా చంద్రబాబునాయుడు ఆటలు ఇక్కడ ఎందుకు సాగుతాయని సైకిల్ ఎప్పుడో పంచర్ అయ్యిందని సైకిల్ గుర్తు అంటేనే తెలంగాణ ప్రజలకు ఆగ్రహం అని తెలిపారు. మహాకూటమి పేరిట వచ్చే నాయకులు కులాలు, మతాల పేరిట వస్తున్నారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులను గ్రామ పొలిమేరల్లోకి వచ్చినవెంటనే ప్రజలు ఈ కేసులపై నిలదీయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని దొంగల మూఠాలు గ్రామాల్లోకి వస్తుంటాయని ఆ దొంగల అడుగులను జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మరో రెండేళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామన్నారు. ఎన్నడు లేనివిధంగా రూ.400కోట్లతో హన్వాడ మండలాన్ని అభివృద్ధి చేశామని కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా అయితే భవిష్యత్తు తరాలు బాగుపడుతాయన్నారు. ఆంధ్రా నాయకుల పాలన నుండి విముక్తి కలిగిందని సంతోషంగా నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకుంటుంటే కాంగ్రెస్ దుర్మార్గులు రాజకీయంగా చేతకాక మరోసారి ఆంధ్రబాబుతో జతకట్టి తెలంగాణలో మళ్లీ దోపిడీకి అవకాశం ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రాబాబుతో దోస్తి కట్టిన కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించివేయాలని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే ఇక తెలంగాణకు పట్టిన శని వదిలిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్యగౌడ్, బాలయ్య, బాల్‌రాజ్, నాగయ్య, అనంతరెడ్డి, బాలగౌడ్, జంబులయ్య, దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మల్లు స్వీయ ప్రకటనలో ఆంతర్యమేమిటి?
* రాజకీయ వర్గాల్లో చర్చ
జడ్చర్ల, అక్టోబర్ 16: జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి స్వయంగా ప్రకటించుకోవడం పట్ల రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది. రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది టీపీసీసీలో ముఖ్య స్థానంలో ఉన్న మల్లురవి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే తనంతట తానుగా అభ్యర్థిగా ప్రకటించుకోవడం వెనుక అసలు రహస్యం ఏమిటనేది అంతుపట్టడం లేదు. గతంలో జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించిన పలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలల్లో పాల్గొన్న ముఖ్య నాయకులంతా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి జడ్చర్లలో పోటీ చేస్తారని ప్రకటించారు. అంతేకాక ఆయన గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఇటీవల జరుగతున్న పరిణామాలు గందగోళంగా మారడంతో మల్లురవి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న అపోహలను తొలగించడం కోసం తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే మల్లురవి చెప్పిన కారణం ఎంత వరకు వాస్తవం అనేది రాజకీయ విశే్లషకులు చర్చిస్తున్నారు. నలుగురు నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ నలుగురు నాయకుల అభ్యర్థిత్వాలను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు మల్లురవి, అనిరుధ్‌రెడ్డిల అభ్యర్థిత్వాల ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రందింపులు జరుపుతున్నట్లు వినికిడి. అధిష్టానం పార్టీ అభ్యర్థి ఖరారు విషయంలో ఏ నిర్ణయానికి రాక ముందే మల్లు రవి తనంతట తానుగా పార్టీ అభ్యర్థినని ప్రకటించుకోవడం వెనుక ఆయన లో ఉన్న అతి విశ్వాసం, అభద్రతా భావంలో ఎదో ఒకటి అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏదిఎమైనా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో అందరి కంటే ముందుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు పార్టీ సీనియర్ నేతగా తాను నియోజకవర్గానికి చేసిన సేవలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న మల్లురవి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో ఆయన చూపుతున్న కారణాలు సమంజసమైనవే అయినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్క స్థానానికి కూడా కాంగ్రెస్ పార్టీ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీజేఎస్, సీపీఐ, టీడీపీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేసుకొని పోటీ చేస్తున్నందున అభ్యర్థిత్వాల ఖరారు విషయంలో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేదు. అంతేకాక కూటమిలోని పార్టీల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే మహా కూటమి విచ్ఛిన్నమయే ప్రమాదం ఉన్నందున చర్చలు ఫల ప్రదమైన తరువాతనే మహా కూటమి అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. పార్టీ అధిష్టానం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటుండగా మల్లురవి స్వీయ ప్రకటన చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతుంది. 2008వ సంవత్సరంలో మల్లురవి ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుండి ఆయననే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొనసాగుతూ వస్తున్నాడు. ఇటివల కాంగ్రెస్ పార్టీలో చేరిన అనిరుధ్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి తన భార్య కోసం ప్రయత్నిస్తుండగా గతంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ను ఆశించి భంగపడి పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ముమ్మరంగా తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ పరిణామాలే మల్లు రవి స్వయం ప్రకటనకు కారణం అయి ఉండవచ్చునని ప్రజలు చర్చించుకుంటున్నారు.