మహబూబ్‌నగర్

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ కెపి లక్ష్మీనాయక్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా సాయుధ దళ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణం చేసిన 414 మందిని గుర్తు చేస్తూ వారికి జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి స్మృత్యర్థ రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ కేపి లక్ష్మీనాయక్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఎంతో మంది పోలీసులు అమరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారని అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం వారోత్సవాలు అనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 35వేలకు పైగా వివిధ హోదాల్లోని సెంట్రల్ ఫోర్స్, స్టేట్ ఫోర్‌స పోలీసులు దేశవ్యాప్తంగా అమరులయ్యారన్నారు. ఏ పండగకు పిల్లల శక్తులు పుట్టిన రోజు, పెళ్లి రోజున కూడా వారి కుటుంబ సభ్యులతో హాయిగా గడుపకోకుండా ప్రజల రక్షనగా రోడ్డుపై విధులు నిర్వహిస్తూ నీ సంతోషాన్ని తన సంతోషంగా భావించి విధులు నిర్వహిస్తారని, వారికి అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు ముఖ్యంగా పోలీస్ కుటుంబాలకు సెల్యూట్ అని అన్నారు. గద్వాల డీఎస్పీ షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి విచ్చినకర శక్తులు నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అరికట్టి ప్రజల భద్రతకు భరోసా కల్పించడానికి అమరుల త్యాగాలు స్ఫూర్తిగా ప్రజా సేవకు పునరంకితం కావాలన్నారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా అర్పించి వీరమరణం పొందిన త్యాగమూర్తులకు అక్టోబర్ 21న శ్రద్ధాంజలి ఘటించడం హృదయపూర్వకంగా నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. అనంతరం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉపన్యాస,వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన సుమారు 50 మంది విజేతలకు బహుమతులను జిల్లా ఎస్పీ అందజేశారు. పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది, మరియు ఎస్‌పిసి విద్యార్థుల ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. సాయుధ దళ కార్యాలయం నుండి బయలుదేరిన పోలీస్‌ల ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్‌మార్గ్, పాతబస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి ప్రారంభస్థానానికి చేరుకున్నది. ఈకార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ భరత్‌కుమార్, గద్వాల సీఐ హనుమంతు, సీఓఎస్‌సీఐ జ్ఞానేందర్‌రెడ్డి, ఎస్‌బిసీఐ మారుతి ప్రసాద్, ఆర్‌ఐ నాగేష్, రమేష్ నాయుడు, ఎస్‌ఐలు సత్యనారాయణ, రాముడు, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, చంద్రమోహన్‌రావు, ఓబుల్‌రెడ్డి, ఖాజా ఖాన్, ఎస్పీసి విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధే గెలిపిస్తాయ
* మంత్రి జూపల్లి
వీపనగండ్ల, అక్టోబర్ 21: గత నాలుగున్నర సంవత్సరాల తెరాస పాలనలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలే తన గెలుపుకు దోహదం చేస్తాయని మంత్రి, కొల్లాపూర్ నియోజక వర్గ తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కల్వరాల లో తెరాస ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన విషయాన్ని, గ్రామంలో జరిగిన అభివృద్ధిని కార్యకర్తల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అంతేకాకుండా ప్రస్తుతం లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని గుర్తు చేశారు. పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని తెలిపారు. త్వరలోనే కల్వరాలలో తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధిపై కళాకారుల ద్వారా ధూంధాం కార్యక్రమం నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభిస్తానని కార్యకర్తలకు వివరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అద్యక్షుడు నారాయణరెడ్డి, తెరాస సీనియర్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, గంగిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.