మహబూబ్‌నగర్

ధివ్యాంగులు ఓటు వేసేలా సౌకర్యాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, అక్టోబర్ 21: ప్రతి దివ్యాంగ ఓటర్ ఓటు వేసేలా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శే్వతామహంతి అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను పోలింగ్ కేంద్రాల వారిగా దివ్యాంగ ఓటర్‌ల జాబితాను సిద్దం చేయాలని ఆమె ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని దివ్యాంగ ఓటర్లు , ఎన్నికల సందర్బంగా పోలీంగ్ కేంద్రాలలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ముందుగా డిఆర్‌డివో వద్ద నమోదు అయిన దివ్యాంగ వివరాలను తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా దివ్యాంగ ఓటర్లను గుర్తించి డేటాబేస్ రూపోందించాలని ఈ సందర్బంగా ఏలాంటి వికలాత్వం ఉందో గుర్తించాలని, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా గుర్తించాలని చెప్పారు. ఈ విషయంపై ఈనెల 22న పంచాయితీ కార్యదర్శులు, బూత్ లేవల్ అధికారులతో సమావేశం నిర్వహించాలని డిఆర్‌డివోను ఆదేశించారు. దివ్యాంగులు పోలీంగ్‌లో పాల్గోనేందుకు అవసరమైన రవాణ సదుపాయాన్ని కల్పించాలని మూడు చక్రాల బండ్లు వారి కోసం ప్రత్యేక ర్యాంపులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, నడవటానికి వీలు పడని దివ్యాంగ ఓటర్లకు వీల్‌చైర్‌పై పోలింగ్ కంపార్ట్‌మెంట్ వరకు తీసుకేళ్లేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కల్పించే సౌకర్యాలను సూచించే విధంగా పెయింటింగ్ వేయించాలని చెప్పారు. వనపర్తి నియోజక వర్గంలో అవయవలోపం ఉన్న వారు 4994 మంది, దృష్టి లోపం ఉన్న వారు 1090 మంది, వినికిడి లోపం ఉన్నవారు 456 మంది, మానసిక వికలాత్వం ఉన్న వారు 814 మంది ఉన్నట్లు డిఆర్‌డివో వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివో గణేష్, ఆర్డీవో చంద్రారెడ్డి, డిపిఆర్వో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శాంతిలాల్, సి సెక్షన్ తహశీల్దార్ రాజేంద్రగౌడ్, సునిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుకండి
* ఎస్పీ ఆపూర్వారావు
కొత్తకోట, అక్టోబర్ 21: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు అన్నారు. ఆదివారం పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తకోట పోలీస్ సిఐ కార్యాలయంలో రక్తదాన శిభిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె స్వయంగా రక్తాన్ని ధానం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగి చాలా మందికి రక్తస్రావం కావడం వల్ల మృతిచెందుతారని, ఇలా రక్తాన్ని దానం చేయడం వల్లే వారి ప్రాణాలు కాపాడగల్గుతారన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెంట్లను ధరించి వారి ప్రాణాలు కాపాడుకోవాలని, సీటు బెల్టు పెట్టుకొవాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కల్గి ఉండాలని, చిన్న పిల్లలు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు జారిమాన విధిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆమె అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, పాత నేరస్థులను బైండోవర్ చేయాలన్నారు. సుమారుగా 120 మంది యవకులు రక్తాన్ని ధానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సోమ్‌నారాయణ సింగ్, ఎస్‌ఐ రవికాంత్‌రావు, జడ్పిటిసి పిజెబాబు, డాక్టర్ మోహన, నాయకులు వామన్‌గౌడ్, ప్రశాంత్, సాయిలుయాదవ్, మోహన్‌కుమార్, సిబ్బంది రోశన్న, వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

భీమా పుష్కరాలకు భారీగా తరలి వచ్చిన భక్తులు
మాగనూర్, అక్టోబర్ 21: భీమా పుష్కరాలలో భాగంగా భక్తులు అదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భీమా పుష్కరాల పుణ్యస్నానాలు చేసి దత్తేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుసుమూర్తి, తంగిడి, సూకుర్‌లింగపల్లిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల తాకిడి అధికం కావడంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. భక్తులు కొంత మంది తమ తమ పితృదేవతలకు పిండప్రధానం చేశారు.