మహబూబ్‌నగర్

రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, అక్టోబర్ 21: స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అత్యధికంగా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందో చూపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఇంతకాలం అధికారంలో ఉండి రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఏదో ఒక విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పట్టిన శని అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్స్‌లో నిర్వహించిన కార్మిక సంఘాల ప్రగతి సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. కూలీలు, హమాలీల సమస్యలను పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటి సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. 14సంవత్సరాల ఉద్యమంలో కార్మికులు తమ పాత్రను పోషించారని అన్నారు. గతంలో గ్రామాలల్లోకి వెళ్తే ప్రజలు సమస్యలతో స్వాగతం పలికేవారని ఆయన గుర్తు చేశారు. వృద్ధులకు టీడీపీ హయాంలో రూ.70 పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ దానిని రూ.200కు పెంచిందని అన్నారు. కాని టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వృద్ధులకు, వితంతువులకు రూ.1000కి పెంచడం జరిగిందని వివరించారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలతో లక్ష పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం అహర్నిశలు పాటుపడే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సాగు నీటి ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. కర్వెన రిజర్వాయర్ జూరాల రిజర్వాయర్ కంటే మూడంతలు పెద్దదని ఆయన వివరించారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జరుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్ని కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. జడ్చర్లలో ఇళ్లు లేని నిరుపేదల కోసం 2వేల ఇండ్లు నిర్మిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీ అన్ని అబద్దాలే మాట్లాడారని ఆయన అన్నారు. రైతులకు ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్న కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు రెండు లక్షల రుణం లేదన్న కనీస పరిఙ్ఞనం లేని సన్నాసులని ఆయన దుయ్యబట్టారు. మాయ మాటలతో ప్రజల ముందుకు వస్తున్న మహాకూటమికి ప్రజలే గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌కెవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర సాహిత్య, నాటక మండలి చైర్మన్ శివకుమార్, ఎంపిపి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టల మురళి, నాయకులు చాంద్‌ఖాన్, యాదయ్య, సీతారాం, రాములు, బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పుష్కర స్నానం పూర్వజన్మ సుకృతం
* హైకోర్టు జడ్జి సీవీ నాగార్జున రెడ్డి * లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయంలో విశేష పూజలు
మక్తల్, అక్టోబర్ 21: పనె్నండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు ఎంతో పవిత్రమైనవని, పుష్కర స్నానం పూర్వజన్మ సుకృతమని హైకోర్టు జడ్జి సివి నాగార్జునరెడ్డి అన్నారు. భీమా పుష్కరాల్లో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని క్రిష్ణ మండలం సుకూర్‌లింగంపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో రాష్ట్ర హైకోర్టు జడ్జి సివి నాగార్జునరెడ్డి ఆయన సతీమణి శోభలు పుష్కర స్నానాలు ఆచరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలతో మాతృదేవతలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం భీమానది ఒడిలో పిండాలను కలిపి స్నానాలు ఆచరించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ భీమా పుష్కరాలకు వస్తున్న భక్తులకు ఇక్కడి నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే క్రిష్ట మండలంలోని సుకూర్‌లింగంపల్లి మీదుగా పవిత్ర తంగిడి ప్రాంతంలోని నివృత్తి సంగమ క్షేత్రం వద్ద 7కిలో మీటర్ల వరకు భీమానది ప్రవహించి క్రిష్టనదిలో కలువడం ఎంతో విశేషమని తెలిపారు. కృష్ణా, భీమా నదుల కలయితో ఏర్పడ్డ నివృత్తి సంగమం ఎంతో పరమ పవిత్రమైనదిగా చెప్పుకుంటారని తెలిపారు. హైకోర్టు జడ్జి వెంట నారాయణపేట కోర్టు జడ్జి సాయికుమార్ తదితరులు ఉన్నారు. కాగా రాష్ట్ర హైకోర్టు జడ్జి సివి నాగార్జున్‌రెడ్డి భీమా పుష్కర స్నానం ఆచరించడానికి వస్తున్న నేపథ్యంలో భాగంగా మక్తల్ సిఐ వెంకట్ ఆధ్వర్యంలో మాగనూర్ ఎస్సై ప్రవీణ్‌కుమార్, కృష్ణ ఎస్సై నరేష్‌ల ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును నిర్వహించారు. ఈసందర్భంగా పుష్కరాలకు వెళ్తున్న జడ్జి వాహనానికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రతి కూడలిలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి జడ్జి పుష్కర స్నానాలు ఆచరించేంత వరకు వెంటనే ఉండి ఏర్పాట్లను చూశారు. సుకూర్ లింగంపల్లిలో పుష్కర స్నానం అనంతరం వారిని మక్తల్ మండల శివారు వరకు హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేలా చూశారు.