మహబూబ్‌నగర్

కమలం తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికలకు బీజేపీ నాయకత్వం సిద్దమైంది. అందులో భాగంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎన్నికల కమిటీ రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులోభాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి టి.ఆచారి పేరును ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఆచారి కేవలం 76 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. మరోసారి ఆయన ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ సంపర్క్ అభియాన్ రాష్ట్ర చైర్మన్ బి.కొండయ్య పేరును ఖారారు చేశారు. ఈయన గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించిన్నప్పటికీ అప్పట్లో టీడీపీ పొత్తులో భాగంగా ఆ సీటు వదులుకోవల్సి వచ్చింది. అయిన్నప్పటికీ అప్పట్లో బీజేపీ కార్యకర్తలు కొండయ్యను పోటీలో ఉంచాలని ఆందోళనలు చేశారు. కానీ బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి ఆయనను అప్పట్లో పోటీ చేయకుండా నివారించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్ష పదివీ విషయంలో కూడా అన్యాయం జరిగిందటూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అధిష్టానం కొండయ్యను మక్తల్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి పేరును ఖరారు చేసింది. ఈయన కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో నారాయణపేట టికెట్‌ను ఆశించారు. కానీ బీజేపీ నాయకత్వం రతంగ్‌పాండురెడ్డికి టికెట్ ఇవ్వలేదు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల ఒత్తిడితో రతంగ్‌పాండురెడ్డి నారాయణపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దాంతో ఆయనకు దాదాపు 25వేల ఓట్లకుపైగా వచ్చాయి. ప్రస్తుతం నారాయణపేటకు బీజేపీ అభ్యర్థిగా రతంగ్‌పాండురెడ్డిని బరిలో నిలిపింది. అదేవిధంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఎం.మలేశ్వర్‌ను పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఆయన గత మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని గత రెండేళ్ల నుండి కొనసాగుతున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన నాయకుడిగా కొనసాగారు. ఆర్‌ఎస్‌ఎస్ అభిమానికిగా ఏళ్ల తరబడి నుండి ఉన్నారు. బల్మూర్ మండల కేంద్రానికి చెందిన మలేశ్వర్‌ను అచ్చంపేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అంతేకాకుండా గద్వాల ప్రాంతంలోని పూడూరు సంస్థానాల్లో ఒకటైనా రాజుల వంశీయుల కుంటుంబానికి చెందిన వెంకటాద్రిరెడ్డిని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన గద్వాలలో న్యాయవాదిగా కొనసాగుతూ బీజేపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గద్వాల నుండి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఇకపోతే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ అధి నాయకత్వం పేర్లను ఖరారు చేయగా వీటిలో మూడు స్థానాలపై కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. కల్వకుర్తి, మక్తల్, నారాయణపేట స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో అన్ని హంగులతో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు దృష్టి పెట్టారని తెలుస్తుంది. అచ్చంపేట, గద్వాల నియోజకవర్గంలో సైతం త్రిముఖ పోటీకి తీసుకువచ్చి తమ సత్తా ఏమిటో చూపించాలని కూడా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పరివార్‌కు సంబంధించిన అన్ని శక్తులను రంగంలోకి దిగి తొలి జాబితాలో ప్రకటించిన వాటిలో కమలం జెండాను ఎగురవేయాలని అప్పుడే బీబీపీ నాయకత్వం రగంలోకి దిగి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.