మహబూబ్‌నగర్

పోలీసుల త్యాగాలు అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 21: దేశ భద్రత కోసం సంఘ విద్రోహశక్తులను అణిచివేయడంలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలను మరువలేనివని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసు కార్యాయలం నుండి వన్ చౌరస్తా వరకు పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. వన్‌టౌన్ చౌరస్తాలోని దివంగత ఎస్పీ పరదేశినాయుడి కాంస్య విగ్రహానికి ఎస్పీతో పాటు పోలీసు అమరుల కుంటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమరుల సంస్మరణ సభలో ఎస్పీ రేమారాజేశ్వరి మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది పోలీసులు సమాజంలో శాంతి స్థాపన కోసం తమ అమూల్యమైన ప్రాణాలను ధారబోశారని, వారి త్యాగాలు వృధా కావని కొనియాడారు. జిల్లాలో సైతం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో ఎదురొడ్డి పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని అన్నారు వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తుందని వెల్లడించారు. వారి స్ఫూర్తితో ప్రతి పోలీస్ శాంతి భద్రతలను కాపాడాల్సిందేనని అన్నారు. సమాజంలో సంఘ విద్రోహ శక్తులకు స్థానం ఇవ్వకూడదనే లక్ష్యంతో ఎంతోమంది పోలీసులు ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో త్యాగాలు చేశారని కొనియాడారు. పోలీసులే సమాజంలో శాంతి కల్పించడంలో కీలక భూమిక పోషిస్తారు కాబట్టి అన్నింటి ఎదుర్కొని విచ్చిన్నకర శక్తులను రూపుమడంలో కొన్ని సంఘటనలు ఎదుర్కొక తప్పదని అన్నారు. పోలీసులకు దేశభక్తి ఎంతో అవసరమని శిక్షణ సమయంలోనే ఎన్నో నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, వచ్చిన స్వాతంత్య్రాన్ని పోలీసులతో పాటు ప్రజలు కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులు అంటే ప్రజల్లో గతంలో ఓ భావన ఉండేదని కానీ ప్రస్తుతం పోలీసులు అంటే తమ కుటుంబ సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారని అందుకే సంఘ విద్రోహ శక్తులకు ఈ నేలపై స్థానం లేకుండాపోతోందని అన్నారు. పోలీసు అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ఘటనల్లో దాదాపు 39 మంది పోలీసులు అమరులయ్యారని వారి త్యాగాల స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సంఘ విద్రోహుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని వారి త్యాగాల ఫలితంగానే నేడు సమాజంలో శాంతి నెలకొందని అన్నారు. కాగా జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఎస్పీ రేమా రాజేశ్వరి అమరుల పోలీసు కుంటుంబల సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ కష్టాలను ఎస్పీ ముందు విన్నవించుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ హబీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, మురళీధర్, గిరిబాబు, హిమ్యానియాల్, పీపీ బాలగంగాధర్‌రెడ్డి, సీఐలు రాజు, కిషన్, రాజేశ్, అమరేందర్‌రెడ్డి, పోలీస్ పీఆర్‌ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.