మహబూబ్‌నగర్

అక్షరాస్యతతోనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మే 12: బడిఈడు పిల్లలను బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రతి ఒక్కరు లక్ష్య సాధనతో పనిచేసినప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని కలెక్టర్ శ్రీదేవి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాలలో జరిగిన డివిజన్ స్థాయి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపధ్యాయులు, ఎంఇఓల సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశించిన బంగారు తెలంగాణ సాకారం కావాలంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు బడిఈడు పిల్లలను బడి బయటి పిల్లలను బడిలో చేర్పించే భాధ్య తీసుకోవాలన్నారు. నేటికి డివిజన్ 1187మంది బడి ఈడు పిల్లలు బడి బయట ఉన్నారన్నారు. వారందరినీ ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరు సామాజిక భాధ్యతగా బడిలో చేర్పించాలని కోరారు. అందుకు అన్నీ ప్రభుత్వ శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అందరి సమిష్టి కృషి అని వచ్చే సంవత్సరం ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎందరో విద్యార్థులు పది ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారని, అందులో నారాయణపేట మండలం నుండే ఇద్దరు విద్యార్థులు 10/10జిపిఎ సాధించారని ఉపాధ్యాయులను అభినందించారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన పాలమూరు జిల్లాను వచ్చే విద్యాసంవత్సరంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. గతంలో బట్టీ విధానం వల్లే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. చదువు ఉద్యోగాల కోసం కాదని విజ్ఞానం పెంపొందించుకునేందుకే అని అందుకు గానూ చిన్నారులందరినీ చదివించాలన్నారు. బడి ఈడు పిల్లలు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించేందుకు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది పది ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలోనిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పది ఫలితాల్లో 10/10గ్రేడ్ సాధించిన కోటకొండ, జాజాపూర్ విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులు, ఎస్‌ఎస్‌ఎ పిఓ గోవిందరాజులు, డిప్యూటీ డిఇఓ వహీద్ నిస్సార్, కో-ఆర్డినేటర్ వీరభధ్రరావు, ఎంపిడిఓ వెంకటయ్య, తహసిల్దారు రామేశ్వర్‌రెడ్డి డివిజన్‌లోని ఎంఇఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపధ్యాయులు పాల్గొన్నారు.