మహబూబ్‌నగర్

చంద్రబాబుకు మోదీ భయం పట్టుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మోదీ భయం పట్టుకుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్, టీడీపీల కలయిక అపవిత్ర కూటమి అని ఏద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడుకు ఓటమి తప్పదన్నారు. సొంత రాష్ట్రంలోనే గెలువలేని చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఏమి చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో శాసించాడానికి చేతగాని బాబు దేశ రాజకీయాల్లో ఏలా శాసిస్తారని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఓ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే గెలుస్తుందని మరోసారి దేశ ప్రధాన మంత్రిగా నరేంద్రమోదియే కావడం తధ్యమన్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఓంటరిగా చేతగాకనే చంద్రబాబునాయుడు లాంటి ఓటమి చెందే నాయకులతో కాంగ్రెస్ జత కడుతుందంటే ఆ పార్టీ పరిస్థితి ఏస్థాయికి దిగ్గజారిపోయిందో అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబునాయుడు ఏపీలో ఓటమి చెందుతానని భయపడి తెలంగాణలోనైనా ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచి తాము కూడా తెలంగాణలో ఉన్నామనిపించుకోవడానికి ఓ ప్రయత్నమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీల అపవిత్ర కూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల నిధులు ఇచ్చిందని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేది కాదని నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయించిన ఘనత బీజేపీదేనని అన్నారు. గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఇవ్వలేదని ఈ విషయం తాను చెప్పడం అబ్బదం కాదని ఏ గ్రామానికైన వెళ్లి అక్కడి సర్పంచును అడిగితే తేలిపోతుందని అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇవ్వడం తథ్యమని అన్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతుందని అవినీతి పోవాలంటే బీజేపీ పాలన అవసరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అయూస్మాన్‌భవ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం కేసీఆర్‌కు పేద ప్రజల జీవితాలంటే ఆయనకు లెక్కలేదని ద్వజమెత్తారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో 90 శాతం వరకు హైకోర్టు తప్పుపట్టిందని ధర్నా చౌక్ విషయంలో కూడా అదే జరిగిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలనతో ప్రజలు విసుగెత్తారని కుటుంబ పాలనలు ప్రమాద కరంగా మారాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలను సాధించబోతున్నామని తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యమైన విజయాన్ని సాధించబోతున్నామని తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన ఉంటుందని డిసెంబర్ మొదట్లో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఉంటుందని దత్తాత్రేయ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతున్నామని అన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు బాల్‌రాజ్, అంజయ్య, రాజేందర్‌రెడ్డి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.