మహబూబ్‌నగర్

అభివృద్ధికి అవకాశవాదులకు మధ్య పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 16: గద్వాలలో జరిగే ఎన్నికలు అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్య జరిగే పోటీ అని, అధికారం, పదవుల మీద మోజు తప్ప గద్వాల అభివృద్ధి ఏమాత్రం చేయని నాయకులను తరమికొట్టి, గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులోని సిఎన్‌జి ఫంక్షన్ హాలులో గద్వాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలను దత్తత తీసుకొని వలసలకు, ఆత్మహత్యలకు కారణమైనా తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ జతకట్టిందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆయన పలకులు వేస్తే, మరో ఆయన మొక్కలు నాటితే, ఒకాయన దత్తత తీసుకుని, గద్వాల చెల్లెమ్మా అంటూ మరో ఆయన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు బొక్క పెట్టిండ్రని, ఆర్డీయస్ తూములపై బాంబులు వేసి మన పాలమూరు జిల్లాకు రావలసిన సాగు నీరు దోచుకెళ్లి కాంగ్రెస్ నాయకులు పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చారని ఆరోపించారు. నాలుగేళ్ల తెరాస ప్రభుత్వ హయాంలో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి, వలస వెళ్లివారు తిరిగి వచ్చేలా చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. 2004లో కొబ్బరికాయ కొట్టి 2014 వరకు నెట్టెంపాడు ప్రాజెక్టును పూర్తి చేయలేక పోయారని, కాలం కాక పోయినా , వాన చినుకు రాలలేక పోయినా నెట్టెంపాడును పూర్తి చేసి, కాలువల ద్వారా సాగునీరు, చెరువులను నీళ్లు నింపిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణలో ప్రాజెక్టులను ఆపడానికి కుట్రలు పన్నుతున్న మహాకూటమిని తరిమికొట్టాలన్నారు. మనకు రావలసిన నీళ్లకై 19 ప్రశ్నలతో బచావత్ కమిటీకి లేఖ రాస్తే పాలమూరు జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి లెటరు ఎందుకు రాసిండ్రని నన్ను అడిగారని పేర్కొన్నారు. బచావత్ కమిటీ ప్రకారం పాలమూరు జిల్లాకు రావలసిన 45టీయంసిలు నీరు వస్తుందని, మనకు రావలసిన వాటా కోసం లేఖ రాశానని సభా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు. నాడు తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మనం హైదరాబాద్‌కు వీసా తీసుకెళ్లి పోవల్సివస్తుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇదే జిల్లాకు చెందిన మంత్రిగా ఉన్న డీకే అరుణ ఏనాడైనా ఖండించారా అని నిలదీశారు. మహాకూటమి పేరుతో మరోసారి తెలంగాణకు అన్యాయం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, తెలంగాణ తెచ్చుకుంది నీళ్ల కోసమే, ఇదే మహాకూటమిని మట్టికరిపించే బాధ్యత మీదేనని, నీళ్లలో మన వాట దక్కాలంటే, పాలమూరు పచ్చబడాలంటే తెరాస పార్టీనే గెలిపించాలన్నారు. ఆనాడు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో ఇదే జిల్లాకు చెందిన డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించలేక పోయారని విమర్శించారు. రూ.52 లక్షలతో, 3వేల ఎకరాలకు స్థిరీకరణ చేస్తామని ఎలాంటి డీపిఆర్ లేకుండానే తెల్లకాగితాలు చూపించి ఓట్ల కోసం గట్టు ప్రజలను మోసం చేశారని, ఇనే్నళ్లు మంత్రిగా ఉండి గట్టులో తట్టెడు మట్టి తవ్వని చరిత్ర మీదని విమర్శించారు. ఇదే తెలంగాణలోని టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రూ.552 కోట్లతో 33 వేల ఎకరాలకు సాగు నీరందించడానిక గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, గట్టు మండల ప్రజల చిరకాలవాంఛ నెరవేర్చిన ఘనత కృష్ణమోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. గద్వాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ఈప్రాంత ప్రజలదేనని పిలుపునిచ్చారు. గద్వాలలో దివికి బ్రిడ్జి నిర్మాణం, 300 పడకల ఆసుపత్రి, బస్టాండు నిర్మాణం, ఎస్సీ, బీసీ స్టడి సర్కిల్, కేటిదొడ్డి మండలం, ఎస్టీ రెసిడెన్సియల్, టెక్స్‌టైల్స్ పార్కును తెచ్చిన ఘనత కూడా టీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. గద్వాలలో కాంగ్రెస్ 10 ఏళ్లలో పాలన , నాలుగేళ్ల తెరాస పాలన చూసి ఓట్లు వేయండి అని సూచించారు. ఊర్లలోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను గద్వాలకు ఏమి చేశారని నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. తెరాస ప్రభుత్వంలో 24గంటల విద్యుత్, రైతుబంధు పథకం, రైతుబీమా పథకాలతో పాటు రైతులకు సాగు నీరు అందించడానికి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని, వయోవృద్ధులకు, వితంతవులుకు రూ.1000 పింఛను, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, గురుకులాలు, కేసీఆర్ కిట్, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, డయాలసిస్ కేంద్రాలు, కులవృత్తులకు ఆదుకోవడానికి గొర్రెలు, చేపలు పంపిణి, అనేక సంక్షేమ, అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను అగ్రగామిగా నిలిపామన్నారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే, గద్వాల అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి, గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్ ఎంపి జితేంద్రరెడ్డి మాట్లాడుతూ సీయం కేసీఆర్ సారథ్యంలో పాలమూరు పచ్చబడి సస్యశ్యామలం చేశారన్నారు. మంత్రి హరీష్‌రావు ఎక్కడ అడుగుపెడితే అక్కడ పచ్చదనం అయిందని, పాలమూరు పచ్చబడి సస్యశ్యామలం చేశారన్నారు. రెండు నదులు పారుతున్న కూడా ఈ ప్రాంతానికి సాగు నీరందించని గత పాలకులు నేడు ఓట్ల కోసం వస్తున్నారని తరిమి కొట్టే బాధ్యత మీదేనన్నారు. సీయం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి హరీష్‌రావు నడిగడ్డను సస్యశ్యామలం చేయడానికి ఆర్డీయస్ ద్వార తుమ్మిళ్ల ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన పూర్తి చేసి త్వరలో ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుందన్నారు. ఎడారి ప్రాంతం అయిన గట్టులో రూ.550 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేశామని, త్వరలో నిర్మాణ పనులు కూడా చేపట్టి, గట్టు ప్రజల చిరకాలవాంఛను నెరవేస్తామన్నారు. వినియోగదారుల చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ గద్వాలలో అనేక ఏళ్లుగా కుటుంబపాలన సాగుతోందని, కుటుంబపాలన అంతం చేయాలంటే తెరాసను గెలిపించాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాల్మీకులు తెరాసకే ఓటు వేయాలన్నారు. వాల్మికులను ఎస్టీ జాబితాలో మార్చి బిల్లు కేంద్రానికి పంపితే అక్కడ వాల్మికులతో పాటు, ముస్లిం 12శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం తిరస్కరించిందని, రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సీఎం అయితే కేంద్రం మెడలు వంచి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తారన్నారు. తెరాస అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నా వెంటా ప్రతి నాయకుడు, కార్యకర్తలు అండగా ఉన్నారని, ఈ 19 రోజులు కూడా అండగా ఉండి నా గెలుపుకు కృషి చేయాలన్నారు. ఇనే్నళ్లు నాకు చేదోడు వాదోడుగా ఉన్న ప్రతి కార్యకర్తను గుండెలో పెట్టుకుని చూసుకుంటానన్నారు. ఒక్క సారి గద్వాల కోటపై గులాబీ జెండా ఎగురవేసి, గద్వాల అభివృద్దికి కృషి చేద్దామన్నారు. ఈకార్యక్రమంలో ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం, ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ట్ర నాయకులు రాకేష్‌కుమార్, నరేంద్రనాథ్, ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షులు బాద్మి శివకుమార్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, తెరాస నాయకులు బీఎస్ కేశవ్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, తిరుమల్‌రెడ్డి, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సుభాన్, వివిధ మండలా జడ్పీటీసీలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

వనపర్తి, నవంబర్ 16: శాసన సభ నియోజక వర్గ ఎన్నికలను పురస్కరించుకొని వనపర్తి జిల్లాకేంద్రంలో నిర్వహించిన వికలాంగుల అవగాహన ర్యాలీని శుక్రవారం జిల్లా కలెక్టర్ శే్వతామహంతి జెండా ఉపి ప్రారంభించారు. ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత, స్వేచ్ఛగా ఓటేద్దాం, గర్వంగా ఓటేద్దాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఓటు హక్కు గురించి దాని అవశ్యకత గురించి వికలాంగులు సంతకాలు చేశారు. పట్టణంలోని ప్రదాన విధుల గుండ ర్యాలీ జరిగింది.