మహబూబ్‌నగర్

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 16: ప్రజాకూటమిని అని రోజుకో మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని జములమ్మనగర్, కిద్వాయిపేట్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహాకూటమిలో ప్రజలు లేరని కేవలం పైరవికారులు మాత్రమే ఉన్నారని ఆయన ఎద్ద్దేవా చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల అభ్యున్నతికి ఏం చేశారో చెప్పే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదని అన్నారు. కూటమికి ఓటువేస్తే రాష్ట్రం అధోగతేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మహాకూటమి మట్టి కలువడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు టీఆర్‌ఎస్‌కి అండగా నిలుస్తున్నారని ఎవరితో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ బిడ్డగా భావించి ఆశీర్వదిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు గ్రామాల్లో పర్యటిస్తే వారు గతంలో ఏం చేశారని వారిని అడిగి పారేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్టుకాడి శ్రీనివాస్, నర్సమ్మ, స్వాతి, బీసి మహిళా అధ్యక్షుడు అలివేలు, అనురాధ, పట్టణ మహిళ అధ్యక్షుడు సౌజన్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉత్కంఠతకు తెర
* మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా పద్మజారెడ్డికే ఛాన్స్
* అలంపూర్ రజినీరెడ్డి, కొడంగల్ నాగురావునామాజీ పేర్లు ఖరారు
* జడ్చర్ల మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

మహబూబ్‌నగర్, నవంబర్ 16: బీజేపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంపై పార్టీలో నేతల పోటీ ఉండడంతో చివరకు బీజేపీ అధిష్టానం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డికే ఛాన్స్ ఇచ్చింది. ఎట్టకేలకు మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పద్మజారెడ్డి పేరును తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి నడ్డా ప్రకటించారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు నాగురావునామాజీ పేరును ప్రకటించారు. అలంపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బీజేపీ ఎస్సీమోర్చ జాతీయ నాయకురాలు రజినీరెడ్డి పేరును ప్రకటించారు. ఇకపోతే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం జడ్చర్ల నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆప్రక్రియ కూడా పూర్తి అయిన్నట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న పద్మజారెడ్డి అధినాయకత్వం పేరును ప్రకటించకముందే నామినేషన్‌ను దాఖలు చేశారు. మంచి మహుర్తం ఉన్నందున ఆమె మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి 1994 ఎన్నికల్లో పద్మజారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అదేవిధంగా జడ్పీటీసీగా కూడా పోటీ చేశారు. 1991లో బీజేపీలోకి రాజకీయ అరగ్రేటం చేసిన పద్మజారెడ్డి పార్టీలో జాతీయ స్థాయి పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. బీజేపీ అంటేనే నాగూరావు అనే పేరు పడ్డ నాగురావు నామాజీ ఈ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి బరిలో దిగనున్నారు. బీజేపీలో జాతీయ, రాష్ట్ర స్థాయి పదువుల్లో కొనసాగిన ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2004 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి కేవలం 1200 ఓట్లకు పైచిలు తేడాతో ఓటమి చెందారు. రెండుమూడు మార్లు ఆయన మక్తల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నారాయణపేటకు చెందిన నాగురావునామాజీ ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆయనను బరిలో దింపనున్నారు. 2009కి ముందు ఈ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గంలో ఉండేవి. అలంపూర్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన రజినీరెడ్డి చిన్నచింతకుంట మండలానికి చెందిన వారు. ప్రస్తుతం రజినీరెడ్డిని అలంపూర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు.