మహబూబ్‌నగర్

మక్తల్‌లో 5వరోజు 4 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, నవంబర్ 16: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మక్తల్ అసెంబ్లీ స్థానానికి 5వ రోజయిన శుక్రవారం 4 నామినేషన్లు దాకలైనాయి. సమాజ్‌వాది పార్టీ తరపున రమేష్ బండారీ తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికుమార్‌కు అందజేశారు. అలాగే టిఆర్‌ఎస్ అసమ్మతి వర్గం, స్వతంత్ర అభ్యర్థి అయిన జలెందర్‌రెడ్డి, ఆయన సతీమణి అయిన పద్మజరెడ్డిలు ఇరువులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేవారు. అలాగే మరో స్వతంత్ర అభ్యర్థి అయిన మక్తల్ వాసి జుట్ల శ్రీనివాసులు సైతం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇది వరకు 5రోజులలో మొత్తం 8మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి రోజు అయిన 12వ తేదీన భూమిపుత్రుల సంఘం అధ్యక్షులు, స్వతంత్ర అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్ తన నామినేషన్‌ను దాఖలు చేయగా, 14వ తేదీన టిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలతో దాఖలు చేశారు. అలాగే కూటమి అభ్యర్థిగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా బిఎస్‌పి అభ్యర్థిగా మక్తల్‌కు చెందిన కోరి మారెప్ప తన నామినేషన్‌ను దాఖలు చేశారు. 16వ తేది అయిన శుక్రవారం సమాజ్‌వాది తనపున రమేష్‌బండారీ తన నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలానికి చెందిన భార్య భర్తలైన పద్మజరెడ్డి, జలేందర్‌రెడ్డిలు నామినేషన్ వేశారు. మరో అభ్యర్థి జుట్ల శ్రీనివాసులు సైతం స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలుతో ఇప్పటి వరకు మక్తల్ అసెంబ్లీ స్థానానికి 8మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికుమార్ తెలిపారు.

మరికల్ బైపాస్ రోడ్డు వద్దంటూ ,,,
మండల తహశీల్దార్‌తో రైతుల వాగ్వివాదం
* బైపాస్ రోడ్డుపనులు చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటాం: రైతుల హెచ్చరిక

ధన్వాడ, నవంబర్ 16: మరికల్ బైసాస్ రోడ్డు పనులు చేపట్టుతున్న సర్వే అధికారులను శుక్రవారం మరికల్ పట్టణ రైతులు అడ్డుకున్నారు. అనంతరం మండల తహశీల్దార్ నాగలక్ష్మితో రైతులు బైపాస్ రోడ్డు వద్దంటూ వాగ్వివాదం పెట్టుకున్నారు. గతంలో మా పంట పొలల్లో రైల్వేలైన్‌కు, కోయిల్‌సాగర్ కాల్వలకు ఇవ్వాడం జరిగిందని రైతులు అధికారులతో తెలిపారు. ప్రస్తుతం ఉన్న మా భూములను బైపాస్ రోడ్డులకు ఇస్తే మా జీవనం ఎలా కొనసాగించాలని అధికారులను రైతులు ప్రశ్నించారు. మాకు ఎలాంటి డబ్బులు అక్కరాలేదన్నారు. మా భూములు మాకు ఉంటేచాలు అన్నారు. మా పంట పొలాల్లో ఎలాంటి పనులు చేసుకోండా సర్వే పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు అధికారులను నిలదీశారు. మాకు తెలియకుండా మా భూములలో బైపాస్ రోడ్డు పనులు సర్వేచేస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అధికారులను హెచ్చరించారు. ఈవిషయం తెలుసుకున్న మరికల్ సీఐ ఇఫ్తార్ మహ్మాద్, మరికల్ ఎస్సై జానకీరాంరెడ్డి అక్కడికి చేరుకున్నారు. రైతులకు నచ్చజేప్పే ప్రయాత్నం చేసిన వినలేదు. మా పంట పొలల నుండి బైపాస్ రోడ్డు అవసరంలేదన్నారు. ప్రస్తుతం ఉన్న రాయిచూర్-హైదరాబాద్ రోడ్డును 50 అడుగుల వరకు వెడల్పు చేస్తేచాలు అని రైతులు అధికారులకు సూచించారు. గత నెల కిందటా నారాయణపేట నియోజకవర్గం కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు చేయడం జరిగిందన్నారు. మరికల్ పట్టణంలో కూడా రోడ్డు వెడల్పు పనులు చేసి బైపాస్ రోడ్డు పనులు చేపట్టాలని మరికల్ పట్టణ రైతులు సూచించారు. అనంతరం మండల తహశీల్దార్ నాగలక్ష్మీకి వినతిపత్రంను మరికల్ పట్టణ రైతుల అధ్వర్యంలో అందజేశారు.

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం
* కూటమి మాటలు నమ్మకండి * మంత్రి జూపల్లి
వీపనగండ్ల, నవంబర్ 16: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయమని, ఎన్నికల కోసం తాత్కాలికంగా మహాకూటమిగా ఏర్పడిన మాయకూటమి మాటలు ఓటర్లు నమ్మవద్దని ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి మండలంలోని బెక్కెంలోని శుక్రవారం నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డక దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో 24గంటల కరెంటు, రైతుబందు, రైతుబీమా, వృద్ధులకు, వికలాంగులకు ఫించన్లు, కళ్యాణిలక్ష్మి, కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఆంధ్ర పార్టీ చేతుల్లో పెట్టేందుకు మాయకూటమితో జతకట్టాయని విమర్శించారు. అభివృద్ధిని చూసి ఎన్నికల్లో మరోసారి ఆశీర్వాదించాలని అన్నారు. అలాగే మండలంలోని సంగినేనిపల్లి గ్రామంలో రాత్రి ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావణ్య, ప్రచార కార్యదర్శి వెంకట్రాములు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ రాంచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి, చిన్నారెడ్డి, మాజీ జడ్పిటిసి కృష్ణాప్రసాద్, రామస్వామి, నర్సింహ్మ, మదు తదితరులు పాల్గోన్నారు.