మహబూబ్‌నగర్

హేమసముద్రం రిజర్వాయర్‌తో పంట పొలాలకు కృషా ణజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 15: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా హేమ సముద్రం రిజర్వాయర్‌ను నిర్మించి రైతుల పంట పొలాల్లోకి కృష్ణాజలాలను పారిస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండలంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మీషన్‌కాకతీయ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షేక్‌పల్లి గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో మేడికుంట చెరువులో మీషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. అయోధ్యనగర్‌లో రూ.28లక్షల వ్యయంతో కాసుల చెరువు వేపూర్ గ్రామంలోని రూ.22.36లక్షలతో కొత్తకుంట చెరువు, ఇదే గ్రామంలో రూ.33.20లక్షలతో ఊరకుంట చెరువు పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా కొనగట్టుపల్లి గ్రామంలోని ఊరచెరువు మరమ్మత్తు పనులకు రూ.22.45లక్షలు కేటాయించగా ఈ పనులను సైతం ప్రారంభించి ఒండ్రుమట్టిని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాయినోనిపల్లి గ్రామంలో కొనన్నకుంట చెరువు,పబన్నకుంట చెరువుకు సంబందించిన రూ.33.90లక్షల వ్యయంతో కూడిన మీషన్‌కాకతీయ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. హన్వాడలోని రూ.19లక్షలు, సల్లోనిపల్లిలో రూ.13లక్షల వ్యయంతో నల్లచెరువు, గాలోనికుంటలో మీషన్‌కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హన్వాడ మండల రైతుల బాధలు తీరాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా హేమ సముద్రం రిజర్వాయర్‌ను నిర్మించి తీరాల్సిందేనని ఇందుకు సంబందించిన సర్వే ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. తాను ప్రత్యేకంగా దాదాపు రూ.25లక్షల వరకు వేచించి ఇంజనీయర్లతో ప్రత్యేకంగా సర్వే చేయించానని పెర్కోన్నారు. ఉదండపూర్ రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా హేమసముద్రంలోకి నీరు వచ్చే అవకాశం ఉందని తక్కువ ఖర్చుతో ఉదండపూర్ నుండి హేమసముద్రంలోకి కృష్ణాజలాలను తీసుకువస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూడేళ్ల వ్యవధిలో హేమసముద్రం రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి తీరుతామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండలానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని అంతేకాకుండా నారాయణపేట నియోజకవర్గంలోకి కూడా ఇక్కడి నుండే కృష్ణాజలాలు అందే అవకాశం ఉందన్నారు. హన్వాడ మండలంలో 90శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఉన్న రెండు మూడు ఎకరాల పోలాలకు ప్రస్తుతం సాగునీరు లేకపోవడంతో పొలాలు బీడు భూములుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు దారిద్య్రం వదలాలంటే కృష్ణాజలాలు హేమసముద్రంలోకి వచ్చి చేరితే ఆ నీటిని పంటపొలాల్లోకి పారించినప్పుడు రైతులు బాగుపడుతారని తాను ప్రత్యేకంగా హేమసముద్రం రిజర్వాయర్ నిర్మాణం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని సంబందిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తునన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసి ఆర్ నిండు అసెంబ్లీ సభలో, పాలమూరు ఎత్తిపోతల పథకం కర్వెన రిజర్వాయర్ శంకుస్థాపన బహిరంగ సభలో లక్షలాది మంది హర్షద్వనుల మధ్య హేమసముద్రం రిజర్వాయర్‌ను నిర్మిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ అండతో హన్వాడ మండల రైతాంగానికి కృష్ణాజలాలను తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ఇక్కడి చెరువులను బాగు చేసుకునేందుకు మీషన్‌కాకతీయ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్వంసానికి గురైన చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా జర్నలిస్టుల సహకారం చాలా అవసరమని అంతేకాకుండా ప్రజల సహకారంతో తాము మరింత ప్రొత్సహంతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు ముందుకు వెళ్తునన్నానని వెల్లడించారు. కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, వివిధ గ్రామాల సర్పంచులు వెంకటమ్మ, భారతమ్మ, అరుణ, శ్రీనివాసులు, కృష్ణయ్య, శివరాజు, టిఆర్‌ఎస్ నాయకులు కృష్ణయ్యగౌడ్, లక్ష్మయ్య, బాలయ్య, బాలరాజు, నాగయ్య, పెద్ద చెన్నయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.