మహబూబ్‌నగర్

కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తే జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, డిసెంబర్ 7: గద్వాల నియోజకవర్గంలో గత నాలుగు నెలలుగా పోలీసులు కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురిచేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, డీకే భరతసింహారెడ్డి హెచ్చరించారు. గద్వాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిర్జాపురం రాంచంద్రారెడ్డిని అకారణంగా దూషిస్తూ సిఐ హనుమంతు కెటిదొడ్డి పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన వాహనంలో కె.టి.దొడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తనిఖీల్లో ఎలాంటి డబ్బు, మెటీరియల్ దొరకనప్పటికీ సిఐ హనుమంతు నానా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో ఓటర్లకు ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఇతరత్ర పంపిణీలను సీఐ హనుమంతు కనుసన్నల్లో జరిగాయని ఆరోపించారు. నియోజకవర్గంలో గులాబీ ఏజెంట్‌గా సిఐ పనిచేస్తున్నాడని కె.టి.దొడ్డి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు డిఐజి, ఐజిల దృష్టికి తీసుకుపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, డీకే భరతసింహారెడ్డిలు కె.టి.దొడ్డి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిఎస్పీ షాకీర్‌హుసేన్ కె.టి.దొడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, డీకే భరతసింహారెడ్డితో చర్చించారు. సిఐ తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని , ఈ సంఘటన మినహా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన విరమించారు.