మహబూబ్‌నగర్

వెల్దండలో పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, డిసెంబర్ 7: మండలంలో చిన్న చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. పూర్వపు ఉమ్మడి జిల్లాలోనే సమస్యాత్మక మండలంగా పేరొందిన వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 35 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ఉదయానే్న ఓటర్లు బారులు తీరారు. కాని సంబంధిత అధికారుల తప్పిదం మూలంగా ఓటింగ్ పక్రియ చాలచోట్లా అరగంట అలస్యంగా ప్రారంభమైంది. వెల్దండ మండల కేంద్రంలో 147 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మద్యాహ్నం తర్వాత రెండు గంటలకు పైగా మొరాయించడంతో ఓటర్లు త్రీవ ఇబ్బందులు పడ్డారు. ఓటర్లతో పాటు దివ్వాంగులకు పోలీంగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ సంబందిత అధికారులు ముందుస్తు చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో ఎస్సై పెండెం వీరబాబు అధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్వపు మండలంలోని శేరిఅప్పరెడ్డిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తాజా, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తన భార్య అశ్లీషారెడ్డి, తండ్రి రాంరెడ్డితో కలిసి ఓటు హక్కును వినియోగించుకోగా అంతిరెడ్డిపల్లిలో శివసేన అభ్యర్థి అంతిరెడ్డి అరవిందరెడ్డి, చంద్రాయనిపల్లిలో స్వతంత్ర అభ్యర్థి దండుగుల శేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉల్లాసంగా ఓటేసిన వృద్ధులు, కొత్త ఓటర్లు
మక్తల్, డిసెంబర్ 7: మక్తల్ నియోజకవర్గంలోని వృద్ధు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుటకై ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా రావడం జరిగింది.జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచనలతో సంబంధిత ఎన్నికల ఆర్‌ఓలు తీసుకున్న శ్రద్ధ కారణంగా వికలాంగ ఓటర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కొత్త ఓటర్లలో సంతోషం...
18 సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు వచ్చిన యవత తమ ఓటుహక్కును వినియోగించుకొని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జమునారాణి, సుమలతలు మాట్లాడుతూ ఓ మంచి నీతివంతమైన, నిజాయతీగల నాయకుడిని ఎన్నుకునేందుక తమకు ఓటుహక్కురావడం సంతోషంగా ఉందన్నారు. మొత్తంపై మొదటిసారీ ఓటును వేసినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.