మహబూబ్‌నగర్

కోస్గిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, డిసెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ నియోజకవర్గంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు గురువారం అర్థరాత్రి చోటుచేసుకున్నాయి. పోలీసుల, పట్టణ వాసులు తెలిపిన వివరాల ప్రకారం. నియోజకవర్గం రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న కోస్గి పట్టణంలో గురువారం అర్ధరాత్రి టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇరుపార్టీల కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో వాగ్వివాదం చోటుచేసుకోగా సమాచారం అందుకున్న ఎస్పీ రెమారాజేశ్వరి హుటాహుటిన పట్టణానికి చేరుకుని దాదాపు రెండు గంటలపాటు శ్రమించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తను
పరామర్శించిన మల్లు రవి
మిడ్జిల్: మండల పరిధిలోని మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాస్‌రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేశారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇట్టి విషయంపై పూర్తి విచారణ చేపట్టి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తానని ఎస్సై విజయభాస్కర్‌యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రబ్బాని, గౌస్, సంపత్, అశోక్, రాముగౌడ్, జహీర్ తదితరులు ఉన్నారు.