మహబూబ్‌నగర్

ఈవిఎంలో దాగిన అభ్యర్థుల భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: శాసనసభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంలో దాగి ఉంది. ఈవిఎంలో ఓట్లు దాగి ఉన్నప్పటికిని ఓటరు సరళీపై నేతలు అంచనాల్లో మునిగి తెలుతున్నారు. గ్రామాల వారిగా ఎవరెవరికి ఎనె్నన్ని ఓట్లు వస్తాయోననే అంచనాలు వేసుకుంటూ కాకి లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2012850మంది ఓటర్లు ఉండగా అందులో 157164మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దింతో హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాలతో పాటు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో వార్డులవారిగా నేతలు పోల్ అయిన ఓటర్లను బెరిజు వేసుకుంటూ ఆయా పార్టీల అభ్యర్థులు కాకి లెక్కల్లో మునిగి తెలుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 203808మంది ఓటర్లు ఉండగా 176806మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 202436మంది ఓటర్లకు గాను 166849మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇలా ఈవిఎంలో ఓటర్లు నాయకుల జాతకాలను ఉంచడం దింతో వార్డుల వారిగా ఎవరిలెక్కలు వాళ్లు వేసుకుంటూ నేతలు ఉన్నారు. అనుచర ఘనం కూడా నియోజకవర్గంలో మొత్తం ఎలా ఉన్నా మా వార్డులో మాత్రం మాకే మేజారిటీ చూపించుకుని నేతలతో శబాష్ అనిపించుకునే పనిలో పడ్డారు. ఇంకా ఈవిఎంలు తెరవకముందే ఎవరి ధీమా వారికి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో 201439మంది ఓటర్లు ఉండగా అందులో 160114మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో 211358మంది ఓటర్లు ఉండగా 164112మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 208941మంది ఓటర్లకు గాను 172846మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 204794మంది ఓటర్లు ఉండగా 173049మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో 202937మంది ఓటర్లు ఉండగా అందులో 161026మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో 226613మంది ఓటర్లు ఉండగా 189013మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 2117325మంది ఓటర్లకు గాను 178884మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో 194768మంది ఓటర్లు ఉండగా అందులో 159924మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని ఈవిఎంలో ఉంచగా వీరు మాత్రం అంచనాల్లో మాత్రం మునిగి తెలుతున్నారు. శనివారం ఆయా అభ్యర్థుల దగ్గరికి గ్రామస్థాయి నాయకులు క్యూ కట్టారు. గ్రామాల వారిగా తమకు ఇన్ని ఓట్లు వస్తాయంటూ కాకిలెక్కలు చెబుతున్నారు. కొందరు నాయకులు గెలిచిపోయామని స్వీట్లు పంచుకుంటున్నారు. ఏది ఎమైనప్పటికిని నాయకుల భవితవ్యం మాత్రం ఈవిఎంలో దాగి ఉంది

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
* పరిశీలించిన కలెక్టర్

మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: ఈ నెల 11వ తేదిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండడంతో అందుకుగాను శనివారం ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఏర్పాట్లపై అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మహబూబ్‌నగర్ సమీపంలో గల జెపిఎన్‌సిఇ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గాల వారిగా ఈవి ఎంలను ఆయా గోదాములలో భద్రపర్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ద్వారా ఆ గదులను సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జెపిఎన్‌సిఇ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇక్కడ జరగనుంది. ఇకపోతే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఎర్రవల్లి చౌరస్తాసమీపంలో గల కొట్టం ఫార్మాసీ కళాశాలలో జరగనుంది. ఇందుకుగాను అక్కడ అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల ఈవిఎంలను అక్కడ నిర్ణయించిన గదుల్లో భద్రపర్చి సీజ్ చేశారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చిట్యాల వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ భారీ పోలీసుబందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ సమక్షంలో ఈవిఎం గోదాంలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సీజ్ చేశారు. కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు సంబంధించి నాగర్‌కర్నూల్‌లోని న్యూమార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు జరగనుంది. మరో 48గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. మహబూబ్‌నగర్ జెపిఎన్‌సిఇ కళాశాల ఆవరణలో ఏకంగా ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండడంతో అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు నియోజకవర్గాల లెక్కింపు ఒకే దగ్గర ఉండడంతో భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈవిఎంలు భద్రపర్చిన గదుల దగ్గర పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

రోడ్లపై వరి కుప్పలతో
పొంచి ఉన్న ప్రమాదం
అమరచింత, డిసెంబర్ 8: మండలంలోని వివిధ గ్రామల రైతులు ఖారీఫ్ పంటలు చేతి వచ్చే సమయంలో కంది, ఆముదం, వరి కుప్పలైన తమ పంటలను ఆరబేట్టి నూర్పిడి చేసుకునేందుకు ఆమా గ్రామల రైతులు గ్రామ శివారులోని తారు రోడ్ల పై కుప్పలు, కుప్పలుగా ఆరబోసుకోవడంతో ఆ రోడ్ల పై ప్రయాణికులతో వేళ్ళే ప్రభుత్వ, ప్రవేట్ వాహానాలు ఏ మాత్రం అదుపుతప్పిన ప్రమాదలు చోటు చేసుకుంటాయని వివిధ గ్రామల ప్రజలు, ప్రయాణికులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కోంకనోనిపల్లి, పాంరెడ్డిపల్లి, చిన్నకడ్మూర్, ధర్మాపూర్ గ్రామలకు చెందిన పలువురు ఈ మద్య కాలంలో వరి, కంది, ఆముదాం పంటలను కుప్పలను రోడ్ల పై పోసి నూర్పిడి చేసుకుంటుండడంతో గత 4, 5 రోజుల నుంచి రోడ్ల పై ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. దింతో పాటు రోడ్ల పై వేళ్ళే వాహానాలు ఏ మాత్రం ఆ జగ్రతగా వేళ్ళిన ప్రమాదాలు చోటు చేసుకోవచ్చునని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆయా గ్రామల రైతులకు నచ్చచేప్పి తమ పంట కుప్పలను ఇళ్ళ దగ్గర ఉన్న అరుబయట నూర్పిడి చేసుకునేలా అవగాహన కల్పించాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నరు.

ఓటింగ్ సరళిని
తెలుసుకుంటున్న అభ్యర్థులు
ఊట్కూర్, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగించడంతో అయా పార్టీల అభ్యర్థులు తమ తమ పార్టీ నాయకులతో, కర్యకర్తలతో, అనుచరుతో ఓటర్ల సరళిపై అడిగి తెలుసుకుంటున్నారు. ఊట్కూర్ పట్టణంలో 11 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 9069 మంది ఓటర్లకు గాను 6133 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 37439 మంది ఓటర్లు ఉండగా 29104 ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మండలంలో 75శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలుపారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెంరాంమోహనెడ్డి శుక్రవారం ఊట్కూర్ మండలాని చేరుకుని ఓటింగ్ సరళిపై ముఖ్య నాయకలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా కూటమి అభ్యర్థి దయకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండయ్య, స్వతంత్ర అభ్యర్థి జలేంధర్‌రెడ్డిలు తమ తమ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల సరళిపై గెలుపు ధీమాపై ఉన్నారు.

ఉద్యమనేతల మధ్య ఉధృత పోరు
* నువ్వా, నేనా అన్నట్లుగా పోలింగ్ సరళి * గెలుపుపై ఎవరి ధీమా వారిది
వనపర్తి, డిసెంబర్ 8: వనపర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో ఇద్దరు ఉద్యమ నేతల మధ్య హోరా హోరిగా పోరు సాగింది. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ టీఆర్‌సీసీ కన్వీనర్, వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి, మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మధ్య వనపర్తి నియోజక వర్గంలో పోటీ రసవత్తరంగా సాగింది. ప్రజా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తలపడ్డారు. మరో 9 మంది ఈ నియోజక వర్గం నుంచి పోటిపడినప్పటికి వీరిరువురి మధ్యే నువ్వా, నేనా అన్న చందంగా పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాజీ ఎంపి మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన టీఆర్‌సీసీలో చిన్నారెడ్డి ముఖ్య భూమిక పోషించారు. 2001లోనే 42 మంది ఎమ్మెల్యేలతో గర్జన పేరుతో వనపర్తిలో బహిరంగ సభను ఏర్పాటు చేసి 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణను ఏర్పాటు చేయాలని సోనియాగాంధికి లేఖ అందించి తెలంగాణ మలి ఉద్యమానికి తెర తీశారు. అప్పటి నుండి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్త్తుండడంతో సైమన్ గోబ్యాక్ అనే నినాదంతో వెఎస్‌ఆర్‌ను వ్యతిరేకిరించారు. దీంతో మొదటి విడతలోనే మంత్రి పదవి రావాల్సి ఉండగా మంత్రి పదవిని కూడా లేక్క చేయకుండా తెలంగాణ కోసం పాటుపడ్డ ఘనత చిన్నారెడ్డిది. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలోనే కాక నినాదాన్ని కేంద్రం వరకు తీసుకెళ్లి తెలంగాణ ఆకాంక్షను దేశ వ్యాప్తంగా చాటారు. అదే విధంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి గులాబి జెండాను చేతబట్టి కార్యకర్తలు కూడా లేని సందర్భంలో ఉద్యమబాటను పట్టి నిరంజన్‌రెడ్డి కేసీఆర్‌కు ఉద్యమంలో కుడిభుజంగా నిలిచారు. గ్రామాలలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవశ్యకతను తెలిపి ప్రజలను, నేతలను చైతన్యం చేసి అందరిని గులాబి జెండా కిందికి చేర్చడంలో నిరంజన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎప్పటికప్పుడు వ్యుహాలు రచిస్తూ మేదస్సునంతా ఉపయోగించి దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలను ఐక్యం చేయడంలో నిరంజన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మె, విద్యార్థుల బలిదానాలు, కేసీఆర్ అమరణ నిరహర దీక్ష తదితర ఉద్యమాలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయడంలో టీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర పోషించిన వారిలో నిరంజన్‌రెడ్డి ఒకరు. అనంతరం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వనపర్తి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిరంజన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీఆర్‌ఎస్ వల్లే సాధ్యమయ్యిందని నిరంజన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసింది కాంగ్రెసేనని చిన్నారెడ్డి ప్రజలోకి వెళ్ళగా నియోజక వర్గ ప్రజలు కొద్ది తేడాతో చిన్నారెడ్డికే గత ఎన్నికల్లో పట్టం కట్టారు. అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఉద్యమ నేత అయిన నిరంజన్‌రెడ్డిని గుర్తించిన కేసీఆర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా నియమించడంతో పాటు క్యాబినేట్ హోదాను కల్పించారు. విశేష రాజకీయ అనుభవం కలిగిన చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా తన నిధుల నుండి అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తనదైన శైలిలో ప్రజలకు దగ్గర అయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 11 మంది వనపర్తి నియోజక వర్గం నుంచి పోటి పడినప్పటికి ఉద్యమ నేతలైన చిన్నారెడ్డి, నిరంజన్‌రెడ్డి మద్యనే ప్రదాన పోటి జరిగింది. అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరంజన్‌రెడ్డికి అనుకూలం కాగా, ప్రజాకూటమితో టీడీపీ కలిసి రావడం, ఆకర్షణీయంగా మేనిఫెస్టో ఉండటంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చిన్నారెడ్డికి మేలు జరిగినట్లు చెబుతున్నారు. ఈసారి జరిగిన ఎన్నికలు నువ్వా, నేనా అన్న చందంగా జరిగాయని అభిప్రాయపడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 82శాతం ఓటింగ్
* అత్యధికంగా 96.40, అత్యల్పంగా 45.66 * గద్వాలలో 83.41శాతం, అలంపూర్‌లో 82.81శాతం

గద్వాల, డిసెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా డిసెంబర్ 7న జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో 82.87 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,43,938 ఓటర్లకుగాను 3,67,897 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా గద్వాల మండలం తెలుగోనిపల్లి పోలింగ్ స్టేషన్‌లో 96.40శాతం నమోదు కాగ, అత్యల్పంగా జడ్పిహెచ్‌ఎస్ అయిజలో 45.66 శాతం నమోదైంది. గద్వాల నియోజకవర్గంలో 2,26,613 ఓటర్లకుగాను 1,89,013 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగ, అలంపూర్ నియోజకవర్గంలో 2,17,325 ఓటర్లకుగాను 1,78,884 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో 1,12,458 పురుషులకుగాను 94,948 మంది, 1,14,134 మహిళలకు గాను 94,065 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 1,086,74 పురుషులకుగాను 90,977 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగ, 1,08,617 మహిళలకుగాను 87,907 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలంలో 35,041 ఓట్లు ఉండగా 30,232 మంది ఓటు హక్కును వినియోగించుకని 86.28 శాతం పోలింగ్ నమోదైంది.
గద్వాల మండలం 35,507 ఓట్లకుగాను 31,889 ఓట్లు పోల్‌కాగ 88.90శాతం పోలింగ్ నమోదైంది, గద్వాల మున్సిపాలిటి 49,979 ఓట్లకుగాను 35,547 ఓట్లు పోల్‌కాగ 71.12శాతం పోలింగ్ నమోదైంది. గట్టు మండలం 41,872 ఓట్లకుగాను 34,962 ఓట్లు పోల్‌కాగ 83.50 శాతం, కె.టి.దొడ్డి మండలం 25,632 ఓట్లకుగాను 22,406 ఓట్లు నమోదుతో 87.41 శాతం, మల్దకల్ మండలం 38,582 ఓటర్లకుగాను 33,977 ఓట్లు పోలుకాగ 88.06 శాతం పోలింగ్ నమోదైంది. అదే విధంగా అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్ 24,913 ఓట్లకు గాను 20,267 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 81.35 శాతం నమోదైంది. అయిజ మండలం 40,322 ఓటర్లకుగాను 33,850 ఓట్లు పోల్‌కాగ 83.95శాతం, అయిజ పట్టణం 20,075 ఓట్లకుగాను 14,890 ఓట్లు పోలుకాగ 74.17శాతం నమోదు, ఇటిక్యాల మండలం 38,105 ఓటర్లకుగాను 31,875 ఓట్లు పోలుకాగ 83.65శాతం నమోదు, మానవపాడు మండలం 21,954 ఓటర్లకుగాను 19,182 ఓట్లు పోలుకాగ 87.37శాతం నమోదు, రాజోలి 25,791 ఓటర్లకుగాను 20,241 ఓట్లు పోలుకాగ 78.48శాతం నమోదు, ఉండవెల్లి మండలం 21,671 ఓట్లకుగాను 18,446 ఓట్లు పోల్‌కాగ 85.12 శాతం నమోదు, వడ్డెపల్లి మండలంలో 24,494 ఓటర్లకుగాను 20,133 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 82.20 శాతం పోలింగ్ నమోదైంది. గద్వాల నియోజకవర్గంలో అత్యధికంగా ధరూర్ మండలంలో 86.28శాతం నమోదు కాగ, అత్యల్పంగా గద్వాల అర్బన్ 71.12శాతం నమోదైంది. అలంపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా మానవపాడు మండలం 87.37శాతం, అత్యల్పంగా అయిజ అర్బన్ 74.17శాతం నమోదైంది.

కల్వకుర్తిలో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
* జోరుగా బెట్టింగ్‌లు
వెల్దండ, డిసెంబర్ 8: విలక్షణ తీర్పులకు నిలయమైన కల్వకుర్తి అసెంబ్లీ స్థానం ఎవ్వరికో దక్కునుందోనని సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఈ దఫా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి 15మంది బరిలో ఉన్నా ప్రధానంగా టీఅర్‌ఎస్ అభ్యర్థి గూర్క జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజి ఆచారిల మధ్యే పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఎన్నికల పోలింగ్ సమరంలో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి ఘటన మినహ ప్రశాంతవారణంలో ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 83.87శాతం ఓటర్లు ఓటు హక్కును వినియెగించుకోగా, ఈదఫా ఎన్నికల్లో ఓక్క అడుగు ముందుకేసి 86.71శాతం ఓటు హక్కును వినియెగించుకున్నారు. శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలీంగ్ సరళిపై అభ్యర్థుల గెలపు ఓటమిలపై ఎక్కడ చూసిన లెక్కలు వేస్తు కన్పిస్తున్నారు. అంతటితో అగకుండ గెలుపుపై ధీమాతో ఆయా పార్టీలకు చెందిన చోటా మోటా నాయకులు బెట్టింగ్, సవాల్, ప్రతిసవాల్‌కు దిగుతున్నారు. ముఖ్యంగా జైపాల్‌యాదవ్, ఆచారి, వంశీచంద్‌రెడ్డిల మధ్య ముక్కోణపు పోటీ జరిగిందని పార్టీ విశే్లషకులు భావిస్తున్నారు. వారి అనుచర గణం ఎవ్వరికి వారే తామే గెలుస్తామంటే తామే గెలుస్తామంటూ అంచనాలు వేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఎన్నికల పోలింగ్ సరిళితో పాటు గెలుపు ఓటమిలపై జోరుగా చర్చోపచర్చలుగా కొనసాగుతున్నాయ. గ్రామాల్లోని పోలింగ్ సరళిని తీసుకుంటూ ఎంతమేర ఓట్లు తమకు లాభిస్తాయనే అంచనాలు వేయడంతో ఆయా పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు టీఅర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను గట్టిక్కెస్తాయని, నాలుగు సార్లు ఓటమి పాలైనందున సానుభూతి పవనాలు పనిచేసి బీజేపీ అభ్యర్థి ఆచారికి ప్రజలు పట్టాం కడుతారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తాయని ఆయా పార్టీల నాయకులు చర్చించుకుంటు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కుంపునకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో ఓట్ల పర్సంటేజీలపై అంచనాలు వేయడం మొదలు పెట్టారు. ఈ బెట్టింగులకు, ఉత్కంఠకు మరో రెండు రోజులు వేచి ఉంటే ఓటరు సర్వే బయల్వడుతుంది. ఈ నియోజకవర్గ ఓటర్లు ఎవ్వరికి కట్టనున్నారో తెలిసిపోతుంది.
తిరిగి అసుపత్రిలో చేరిన వంశీచంద్ రెడ్డి
వెల్దండ, డిసెంబర్ 8: బీజేపీ నాయకుల చేతిలో త్రీవంగా గాయపడిన కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి తాజా, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తిరిగి అసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ సందర్బంగా శుక్రవారం ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల పోలీంగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన వంశీచంద్‌రెడ్డిని అక్కడి బీజేపీ కార్యకర్తల దాడి ఘటనలో త్రీవంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ అసుపత్రిలో చేరి చికిత్స చేయించుకొని తన ఓటు హక్కును వినియెగించుకునేందుకు అక్కడి నుంచి నేరుగా అంబులెన్సులో వచ్చి సొంత గ్రామం వెల్దండ పూర్వపు మండంలోని శేరిఅప్పరెడ్డిపల్లి గ్రామంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు చేరుకోని ఓటు హక్కును వినియెగించుకొని వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు తిరిగి నిమ్స్ అసుపత్రిలో చేరి వైద్యం చేయించుకున్నారు. అక్కడ శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ తదితర ప్రముఖుల పరామర్శించి అరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకోని మురుగైన వైద్యం అఅందించాలని సూచించినట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. చల్లా వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ నాయకులు చేసిన దాడిని వారు త్రీవంగా ఖడించినట్లు తెలిపారు.