మెదక్

టీఆర్‌ఎస్ విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: జిల్లాలో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. శాసనసభా ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెరాస అభ్యర్థులు భారీ విజయాన్ని అందుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ నుండి మొదలుకుని చివరి రౌండ్ వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. జిల్లాలో 11స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకార్యకర్తలు నాయకులు సంబురాల్లో మునిగితెలుతున్నారు. గ్రామగ్రామాన విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థులు బయటకు రాగానే గులాబీ రంగులు చల్లుకుని పూలమాలలు వేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలను భుజాలపై మోసుకెళ్తూ ఊరేగించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండగా అందులో జూపల్లి కృష్ణారావు ఓటమి పాలు అయ్యారు. జడ్చర్ల నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేసిన చర్లకొల్ల లక్ష్మారెడ్డి 45,104మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 94,300ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి 49,196 ఓట్లు వచ్చాయి. జడ్చర్లలో లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ 57,326 ఓట్ల మేజారిటీ సాధించారు. ఆయనకు 85,373 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ 28,047 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలై శ్రీనివాస్‌గౌడ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. నారాయణపేట నియోజకవర్గంలో మరోసారి ఎస్. రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 15,326 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 68,633 ఓట్లురాగా బిఎల్‌ఎఫ్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి 53,307 ఓట్లు వచ్చాయి. చివరగా రాజేందర్‌రెడ్డి భారీ మేజారిటీతో గెలుపొందారు. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరోసారి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి 34,817 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 94,023 ఓట్లురాగా ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి పవన్‌కుమార్‌రెడ్డికి 59,206 ఓట్లు వచ్చాయి. దేవరకద్ర ఓటర్లు తెరాస అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి భారీ మెజారిటీని అందించారు. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి చిట్టెం రాంమోహన్‌రెడ్డికి ఎవరూ ఊహించని మెజారిటీని నియోజకవర్గ ఓటర్లు అందించారు. చిట్టెం రాంమోహన్‌రెడ్డి 48,267 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గువ్వల బాలరాజు 9,556 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 85,674 ఓట్లురాగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు 76,556 ఓట్లు వచ్చాయి. మరోసారి నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజుకు అక్కడి ఓటర్లు అవకాశం ఇచ్చారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి జనార్థన్‌రెడ్డి ఏకంగా 54,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 1,02493 ఓట్లు రాగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నాగం జనార్థన్‌రెడ్డికి 48,139 ఓట్లు మాత్రమే వచ్చాయి. మర్రిజనార్థన్‌రెడ్డికి వచ్చిన మెజారిటీ ఓట్లన్ని కూడా నాగంకు అక్కడి ఓటర్లు మొగ్గు చూపలేదు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జి.జైపాల్‌యాదవ్ 3723 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 63,409 ఓట్లురాగా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తల్లోజి ఆచారికి 59,486 ఓట్లు వచ్చాయి. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 28,445 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 1,00404 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి డికె అరుణకు 72,115 ఓట్లు పోల్ అయ్యాయి. అలంపూర్ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ అబ్రహం 46,534 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 102105 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్‌కుమార్‌కు 57,426 ఓట్లు రావడంతో ఆయన ఓటమి పాలైయ్యారు. 11అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ విజయకేతనం మోగించింది. 12స్థానాలపై గురిపెట్టినప్పటికిని ఒక్క స్థానం గులాబీ గూటికి రాకపోవడంతో కొల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే జిల్లాలో మాత్రం వార్ వన్‌సైడ్‌గా ఓటర్లు తెరాసకు ఫలితాలను అందించారు.