మహబూబ్‌నగర్

సోమశిల-సిద్దేశ్వరం వంతెన కోసం కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, డిసెంబర్ 14: నియోజకవర్గంలోని సోమశిల-సిద్దేశ్వరం కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంజీకేఎల్‌ఐ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతోకాలంగా కొల్లాపూర్ ప్రజలు సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ప్రజల ఆకాంక్ష మేరకు వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు. వీపనగండ్ల మండలంలోని పలు మినీ ఎత్తిపోతల పథకాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తానని అన్నారు. శ్రీశైలం నిర్వాసితుల కోసం 98జీవోపై అమలుకోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని అన్నారు. ప్రజల ఆకాంక్షమేరకు ప్రతి పక్ష సభ్యునిగా నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తానని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాటం జంబులయ్య, రత్నం ప్రభాకర్‌రెడ్డి, కిషన్‌నాయక్, సురేందర్‌సింగ్, చంద్రశేఖరాచారి, ఖాదర్‌పాషా తదితరులు ఉన్నారు.
20 నుంచి చిన్నరాజమూర్‌లో
ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
* ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
దేవరకద్ర, డిసెంబర్ 14: మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని ప్రసిద్ధి గాంచిన చిన్నరాజమూరిలో శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 20 తేదీ గురవారం నుంచి ప్రారంభం కానున్నట్లు దేవలయ ఇఓ ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం వారు భక్తుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆంధ్ర, కర్నటక, మహరాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోడానికి తరలివస్తారు. దేవరకద్ర మండలానికి కేవలం 12కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సమీపంలో ఈ దేవాలయం ఉంది. ఈ బ్రహోత్సవాలు 20న ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతి రోజు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకపూజ కార్యక్రమాలు 20న మొదటి రోజు గురువారం ఉదయం శ్రీ ఆంజనేయస్వామి వారికి నిత్యార్చన విఘ్నేశ్వర పూజ, పూన్యహవచనం, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజరోహణం, అలంకారణ, హనుమద్వ్రతం, శ్రీనివాస కల్యాణం, రాత్రికి హంస సేవ, తదితర కార్యకమాలు నిర్వహిస్తారు. 21న శుక్రవారం పంచామృతాభిషేకం. అలంకరణ. పవమాన హోమం. సాయంత్రం 5,30 గంటలకు శ్రీనివాసకల్యాణం, రాత్రికి అశ్వవాహనసేవ, ప్రభోత్సవం నిర్వహిస్తారు. 22న శనివారం పూర్ణమి రోజున పంచామృతాభిషేకం, మహాలంకరణ, రాత్రికి గజవాహనము, రథోత్సవం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణసంచా కార్యక్రమాన్ని వీక్షించాడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. 23న, తేది అదివారం అవభృతస్నానం, పంచామృతాభిషేకం, అలంకరణ, రాత్రికి పల్లకీసేవ కార్యక్రమాలు నిర్వహీస్తారు. 24న సోమవారం పంచామృతాబిషేకం, పల్లకీసేవతో ఉత్సవాలు ముగిస్తారు.
రగ్‌కట్టెసాబ్ ఉర్సు ఉత్సవాలు
మద్దూర్, డిసెంబర్ 14: మండలంలోని రేణివట్ల గ్రామంలో వెలసిన రగ్‌కట్టెసాబ్ ఉర్సు ఉత్సవాలు శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు గంధోత్సవంతో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి రేటపట్ల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు శంషోద్దిన్, సలీం, కుతుబోద్దిన్‌లు తెలిపారు. రాత్రి దర్గాలో ఉర్సే షరీఫ్ దీపారాదన, సయ్యద్ కుతుబోద్దిన్ ఉర్సే షరిఫ్ ప్రసంగం, కవల్లి, శనివారం ప్రసాదవితరణతో గంధోత్సవం ముగుస్తుందని వారు తెలిపారు.
17 నుంచి ప్రజావాణి కార్యక్రమం
* కలెక్టర్ శ్రీ్ధర్
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 14: స్థానిక కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌తోపాటు జిల్లాలోని అన్నీ మండల కేంద్రాలలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ్ధర్ నేడొక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలానికి జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించడం జరిగిందని, ఆయన ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడిందని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై దృష్టిని కేంద్రీకరించి వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా మండలాలలో నెలకొన్న సమస్యలతోపాటు, వాయిదా పడిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరతగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వాలని ఆయా మండలాల ప్రత్యేకాధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబందించి సంబంధిత జిల్లా అధికారులు విధిగా హాజరై ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఆర్వో మధుసూధన్‌నాయక్ మరో ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే ఆల గెలుపుపై మొక్కు తీర్చుకున్న ఎంపీపీ
కొత్తకోట, డిసెంబర్ 14: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రెండవ సారి గెలుపొందడంతో ఎంపీపీ గుంతవౌనిక కొత్తకోట అంబ భవాని ఆలయం నుండి కురుమూర్తి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి తన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుంత వౌనిక మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టాలని రెండవ సారి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గెలుపొందాలని తాను కోరుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని , ఆసరా ఫించన్లు, మత్స్యకారులు, యాదవులకు తెలంగాణ సీఎం కేసీ ఆర్‌కు బాసటగా నిలిచారన్నారు. పాదయాత్రలో నాయకులు వామన్‌గౌడ్, లతీఫ్, ప్రశాంత్, మహదేవన్‌గౌడ్, గుంతమల్లేష్ పాల్గొన్నారు.