మహబూబ్‌నగర్

* తెరాస అభివృద్ధిని చూసే ప్రజలు పట్టం కట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, డిసెంబర్ 14: ట్యాంపరింగ్ అనడం అవాస్తవమని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు పట్టం కట్టారని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.అబ్రహం అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు 57 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోవడంతో తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాల్లోనే చేసి చూయించిందన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తెరాస కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూయించారన్నారు. అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలో నిల్చినా తెరాస పార్టీకి ప్రజలు భారీ మెజార్టీతో పట్టం కట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేసీఆర్ ఏకగ్రీవంగా సీఎల్‌పీనేతగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మహాకూటమి నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక ట్యాంపరింగ్ డ్రామాను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవస్తవాన్ని వాస్తవాలుగా చిత్రీకరించడం సరికాదని హెచ్చరించారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లో మీరు ట్యాంపరింగ్ చేసి గెల్చారా అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని చూసే తెలంగాణ రాష్ట్రంలో 88 మంది ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. సమర్థుడైన, విద్యావంతుడైన కేటీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. గత ఎన్నికల్లో కీలక భూమిక పోషించారన్నారు. అలాగే డెప్యూటి ముఖ్యమంత్రి అయిన మహమూద్‌అలీకి హోంశాఖ మంత్రిగా నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. నాలుగు శతాబ్దాలుగా మైనార్టీలకు వరించని హోంశాఖను మైనార్టీ సోదరుడికి ఇవ్వడంతో రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. అలంపూర్ తాలుకాలో ప్రజలు భారీ మెజార్టీతోగెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని ఆయన సూచించారు.
ఎమ్మెల్యేకు సన్మానం
స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన తెరాస ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.అబ్రహంను పార్టీ కార్యాలయంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి, జంగీర్, మల్దకల్, వెంకటన్న తదితరులు పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తాలుకాలోని ఆయా మండలాల, గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

రబీలో నీరు ఇవ్వకుంటే అధికారుల భరతం పడతా
* మక్తల్ ఎమ్మెల్యే హెచ్చరిక
ఆత్మకూర్, డిసెంబర్ 14: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు రైతాంగానికి సంబంధించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించని పక్షంలో అధికారుల భరతం పడతానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు.
శుక్రవారం ఆత్మకూర్ ఎంపిపి శ్రీ్ధర్‌గౌడ్ అద్యక్షతన ఎంపిపి కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగిసినప్పటికీ జూరాల ప్రాజెక్టు నుండి సమాంతర కాల్వకు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా క్రింది ప్రాంతానికి నీటి విడుదల కొనసాగిస్తుండడం ఎంత వరకు సమంజసమని , నీటి విడుదలను తక్షణమే నిలిపి వేయాలని ప్రాజెక్టు ఏఈ రవీందర్‌ను ఆదేశించారు. ఏఈ బదులిస్తూ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నీటి విడుదల కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో తమకు ప్రమేయం ఏమి లేదని చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో అధికారులపై మండిపడ్డారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు రబీలో నీటి విడుదల విషయానికి సంబంధించి వారబందీ విధించడం సబబు కాదని , ప్రస్తుతం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మక్తల్ నియోజక వర్గాన్ని దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తించి నీటి విడుదల కొనసాగించాలని లేని పక్షంలో అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్నటువంటి రామన్‌పాడు ప్రాజెక్టు ఇంటెక్ వెల్ నిర్మాణాలను వారం రోజుల్లో పూర్తి చేయాలని లేని పక్షంలో అధికారులను ఇంటికి పంపించడం ఖాయమన్నారు. ఈ ప్రాంత రైతులకు సంబంధించి గడిచిన రెండు సంవత్సరాలుగా సహనంతో ఇబ్బందులు భరించామని ఇకమీదట అలాంటి పరిస్థితి కల్పించిన పక్షంలో అధికారుల బట్టలు ఊడదిస్తామని తీవ్ర స్థాయిలో మందలించారు. మక్తల్ నియోజక వర్గంలో విద్యుత్ నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని , విద్యాభివృద్ధి విషయంలో సైతం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. సమావేశం కొనసాగుతుండగానే పలవురు రైతులు కార్యాలయంలోకి వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నీటి విడుదలను తక్షణమే నిలిపి వేయాలంటూ అధికారుల తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేను పలు ప్రజా సంఘాల నాయకులు, ఎంపీపీ కార్యాలయ సిబ్బంది టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బాలకిష్టన్న, ఆత్మకూర్ ఎంపిడివో శ్రీపాదు, తహశీల్దార్ జికే మెహన్ పాల్గొన్నారు.