మహబూబ్‌నగర్

లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుందనే సంకేతాలు వెలువడడంతో అధికారులు అటు వైపు దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ రెండు పార్లమెంట్ నియోజకవవర్గంలో ఎన్నికల నిర్వహణకై ముందస్తుగా అధికారులు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల మార్చి మొదటి వారంలోగానీ రెండవ వారంలో గానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎన్నికలకు సంబంధించిన అధికారులకు వివిధ బాధ్యతలను వికేంద్రీకరణలో భాగంగా నోడల్ అధికారులను సైతం నియమించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 20 మంది నోడల్ అధికారులను నియమిస్తూ మహబూబ్‌నగర్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కూడా దాదాపు 20 మందికి పైగా నోడల్ అధికారులను నియమిస్తూ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ నెల 27వ తేదీన జిల్లా, నియోజకవర్గాల వారిగా ఏఈవో, ఏఈఆర్వోలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేయనున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్‌రూం, ఓట్ల లెక్కింపు కోసం భగీరథ కాలనీలోని మైనారిటీ బాలికల గురుకులాలు నిర్వహిస్తున్న జేపీఎన్‌ఈఎస్ భవనాన్ని జిల్లా అధికారులు ఇప్పటికే పలు ధపాలుగా పరిశీలించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని స్ట్రాంగ్‌రూంలతో పాటు ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలోని కొత్త మార్కెట్‌యార్డు, ఓ ప్రైవేట్ బీఈడి కళాశాల భవనాన్ని అధికారులు పరిశీలించారు. రెండు పార్లమెంట్ పరిధిలో ప్రత్యేకంగా మరో ఇద్దరు నోడల్ అధికారులను సైతం నియమించనున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో పూర్తి స్థాయి అధికారులను ఏర్పాటు చేసి దాంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సామాగ్రి తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఓటరు నమోదు ప్రక్రియ సైతం పూర్తి అయింది. ఈ నెల 4వ తేదీ వరకు నమోదు చేసుకున్న వారికి ఓటరు జాబితాలో పేరు రానుంది. గత రెండు రోజుల క్రితమే రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను కూడా అధికారులు సిద్ధం చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో 1877 పోలింగ్ బూత్‌ల్లో దాదాపు 15లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1700లకు పైగా పోలింగ్ బూతుల్లో దాదాపు 15లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గంలో దాదాపు 30 లక్షల ఓటర్లు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ఏ సమయంలోనైనా షెడ్యూల్ విడదల చేసిన జిల్లాలో మాత్రం ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం అన్ని ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా అధికారులు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం చేస్తుకుంటున్న ఏర్పాట్లపై గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు వారు సైతం రాజకీయ పావులు కదుపుకుంటున్నారు. రాజకీయ పార్టీల పరంగా చూస్తే తెరాస, కాంగ్రెస్, బీజేపీ శిబిరాలు ఇప్పటికే ఎన్నికల్లో అవలంబించే వ్యూహాలపై కసరత్తులు మొదలుపెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు మాత్రం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ఏర్లాట్లపై దృష్టి పెట్టి అందుకు కావల్సిన ప్రణాళికలను రచించుకుంటున్నారు.

తెరాస టార్గెట్ రెండు లోక్‌సభ స్థానాలు
* మార్చి 6వ తేదీన నాగర్‌కర్నూల్, 11న మహబూబ్‌నగర్ నియోజకవర్గం స్థాయి సన్నాహక సమావేశం
* సమావేశాలకు హాజరుకానున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* సన్నహక సమావేశంలోనే అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24: రాబోయే లోక్‌సభ ఎన్నికలపై తెరాస దృష్టి పెట్టింది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నదం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాయత్తం చేసేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై తెరాస టార్గెట్ పెట్టుకుంది. అందుకుగాను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సన్నహక సమావేశం ఏర్పాటుకు కేటీఆర్ సిద్ధమయ్యారు. వచ్చే నెల మార్చి 6వ తేదీన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నహక సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నహక సమావేశం మార్చి 11వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సంకేతాలు ఉండడంతో కేటీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయితే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ టికెట్‌ను మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం ఆశిస్తున్నారు. ఇద్దరు నేతలు టికెట్ ఆశిస్తుండడంతో ఈ సన్నహక సమావేశంలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ టికెట్ ఇద్దరు నేతల్లో ఎవరికి దక్కుతుందోననే స్పష్టత కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కేటీఆర్ హాజరుకానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. 11వ తేదీన జరిగే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థాయి తెరాస సన్నహక సమావేశం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. మళ్లీ మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి ఎంపీ జితేందర్‌రెడ్డికే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్లోర్ లీడర్‌గా కూడా కొనసాగుతున్నారు. అయితే కొందరు నియోజకవర్గ పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జితేందర్‌రెడ్డితో విభేదిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కేటీఆర్ వచ్చి అంతా చక్కదిద్దుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవడమే ముఖ్యం కాబట్టి తెరాస నాయకులు ఎవరికి టికెట్ వచ్చినా గెలుపే ధ్యేయంగా పని చేయాల్సి ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే టార్గెట్‌తో కేటీఆర్ నేరుగా సన్నహక సమావేశం నిర్వహించనున్నారు.

నోట్...సర్...కేటీఆర్ ఫోటో వాడుకోగలరు

ఉపాధి కల్పన ఫైలుపై తొలి సంతకం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన, టూరిజం, సాంసృతికశాఖల మంత్రిగా వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం పదవీ బాధ్యతలను చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం కేటాయించిన తన కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు హైదరాబాద్‌కు పెద్దఎత్తున తరలి వెళ్లారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌గౌడ్‌ను హోంమత్రి మహిమూద్ అలితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పెద్దఎత్తున తెరాస నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లి మంత్రిని ఘనంగా సన్మానించారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు మంత్రికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. మాజీ మంత్రి రాములు కూడా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌గౌడ్ తొలి సంతకం సారా తయారీకి స్వస్తి పలికిన వారికి ఉపాధి కల్పన కోసం అధికారులు రూపొందిన ఫైల్‌పై తొలి సంతకాన్ని చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన తొలి సంతకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు వందలాది మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలోనే సారా తయారీదారులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వందలాది మంది సారా తయారికి స్వస్తి పలకడం జరిగింది. అయితే వారికి ఉపాధి కల్పన కల్పించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన ఫలాలను అందించడానికిగాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తొలి ప్రాధాన్యత క్రమంలో సంతకం చేశారని తెరాస నాయకులు చెబుతున్నారు. కాగా జిల్లాకు చెందిన ఆబ్కారీశాఖ అధికారులు సైతం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టూరిజం, యువజన సర్వీసులశాఖ అధికారులు సైతం మంత్రిని కలిసి సన్మానించారు.