మహబూబ్‌నగర్

‘సిఎం కెసిఆర్ మనసున్న మహరాజే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 16: ముఖ్యమంత్రి కెసిఆర్ మనస్సున్న మహరాజే అని ఇందులో ఎలాంటి సందేహం లేదని 60 ఏళ్ల పాలనలో తెలంగాణలోని ముస్లీంలను పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడరని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లీంల కళ్లలో సంతోషం చూడాలన్న తపన గల ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ కొనియాడారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని షాలీమార్ గార్డెన్ ఫంక్షన్ హల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. జిల్లాలోని 448 మజీదులలో నమాజ్ చేయించే ఇమామ్‌లకు, ముజామాన్లకు పది నెలలకు సంబందించిన గౌరవ వేతనాన్ని రూ.10 వేల చెక్కులను డిప్యూటి సిఎం మహముద్ అలీ అందజేశారు. మహబూబ్‌నగర్ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం మహముద్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మనస్సున్న మహరాజేనని ముస్లీంలా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ది చెందాలని చదువులో రాణించాలని సమాజంలో గౌరవంగా బతకాలని ఆలోచన చేస్తున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముస్లీంలా పిల్లలందరు చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలనే తపనతో ఎనిమిది రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాదే ఏర్పాటు చేస్తున్నారని ఇది గొప్ప విషయమన్నారు. దేశంలోనే సెక్యులర్ రాష్ట్రం ఎక్కడైన ఉందంటే అది తెలంగాణనేనని తెలిపారు. దసరా, దిపావళీ, రంజాన్, క్రిస్మస్ పండుగలన్నింటిని ప్రజలందరు కలిసి మెలసి జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రభుత్వపరంగా పండుగలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. షాదిముబారక్ పథకంతో ఆడపిల్లలున్న ముస్లీంలా కుటుంబాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ఇచ్చారని దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకం తెలంగాణలో ఆమలు అవుతుందని యావత్తు దేశంలోని ముస్లీంలు అంతా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనను కొనియాడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయిన మజిదులకు, రిజిస్ట్రేషన్ కాకుండా నమాజ్‌లు జరుగుతున్న మజీదులకు తప్పకుండా ప్రభుత్వపరంగా అందించే ఇమామ్‌లకు, ముజామాన్లకు ప్రతి నెల రూ.1000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో వచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఓ పక్క ఖురాన్‌ను పటిస్తునే మరోపక్క చదువుకోవాలని అప్పుడే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని ప్రతి ముస్లీం ముందుగా ఆలోచించేది పిల్లల చదువుపై ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీ 12శాతం రిజర్వేషన్‌పై సిరియస్‌గా ఉందని సుదీర్ కమిటీ నివేదిక తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాటను నేరవేరుస్తారని ఇందులో అనుమానాలే వద్దని ఆయన తెల్చిచెప్పారు. గత 60 ఏళ్లు తెలంగాణలోని ముస్లీంలు రాజకీయ పార్టీల నాయకులకు ఓటు బ్యాంకుగానే ఉపయోగపడ్డారని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముస్లీంలు గౌరవంగా బ్రతికేందుకు ముఖ్యమంత్రి కెసి ఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఆడపిల్లల చదువుల పట్ల కూడా ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందున 12శాతం రిజర్వేషన్ కొంత ఆలస్యం అవుతుందని అయినప్పటికిని రిజర్వేషన్లు తప్పక లభిస్తాయని ఆయన తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముస్లీంలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లిం యువకులు ఆలోచించుకోవాలని, దుబాయ్ వెళ్లి బతకడం కన్నా మంచిగా చదువుకుని బారతదేశంలో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. దుబాయ్‌లో అక్కడి పెట్రోల్ బావుల యజమానులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అక్కడ చాలా మంది భారతీయ ముస్లీంలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉమర్ జలీల్, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టిఆర్‌ఎస్ నాయకులు ఇంతియాజ్, మక్సుద్, ఇక్బల్ తదితరులు పాల్గొన్నారు. కాగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ ఉమర్ జలీల్ తమ ప్రసంగంలో కెసి ఆర్‌ను పొగుడుతూ ఇలాంటి కలకాలం ఉంటే దారిద్య్రంలో బతుకుతున్న ముస్లీంలు బాగుపడుతారని కన్నీరు కార్చారు.