మహబూబ్‌నగర్

మహిళలపై జరిగే అన్యాయాలపై అప్రమత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జోత్స్న అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆదివారం సురక్షరథయాత్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, బాలికలు సెల్‌ఫోన్లకు, టీవీలకు అలవాటుపడి కొత్తవ్యక్తులు మాట్లాడినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ్వాల ఏకోక్లబ్‌వారి సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలపై వేదింపులు, అన్యాయాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. సమాజంలో ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఒక బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై చెప్పినతీరు అక్కడికి వచ్చిన మహిళలకు కంటతడి పెట్టించింది. మహిళలు పురుషుల మాయమాటలు నమ్మి ప్రేమలోపడితే మోసపోతారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏకో సంస్థ ప్రతినిధులు చంద్రశేఖర్, డిసిపిఓ నర్మద, గద్వాల ఎఓ పురుషోత్తం, మానవపాడు, అలంపూర్, వడ్డేపల్లి, గద్వాల, అయిజ తహశీల్దార్లు రాజు, మంజుళ, శాంతకుమారి, చింతామణిపటేల్, సుబ్రమణ్యం, మానవపాడు ఎంపిడిఓ ముసాయిదాబేగం, ఎంఇఓ దేవన్న, నాలుగు మండలాల ఎంపిడిఓలు, ఐకెపి ఎపిఎంలు, సిసిఎస్‌లు, సమాఖ్య లీడర్లు, మానవపాడు సిడిపిఓ అనురాధ, గద్వాల సిడిపిఓ ఉషారాణి, అంగన్‌వాడి వర్కర్లు హెల్పర్లు, కిషోర బాలికలు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
* కొత్తపాలెంలో విషాదఛాయలు
ధరూరు, ఫిబ్రవరి 7: రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన రంగస్వామి(40), ఉసేనప్ప(50)లు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి 8గంటలకు చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రంగస్వామి, ఉసేనప్పలు ద్విచక్ర వాహనంపై గద్వాల నుంచి స్వగ్రామమైన కొత్తపాలెంకు వెళ్తుండగా మార్గమద్యలో జాంపల్లి గ్రామం దాటాక తాయమ్మమిట్ట దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలియడంతో గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బిసిలను చైతన్యం చేసేందుకు
బస్సు యాత్రలు
బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7: బిసిలను చైతన్యవంతం చేయడానికే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహిస్తున్నట్లు బిసి సబ్‌ప్లాన్ సాధనకమిటి జిల్లా ప్రధానకార్యదర్శి దేవేందర్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వలేఖరుల సమావేశంలో దేవేందర్ మాట్లాడుతూ బిసిల సమస్యల సాధన కొరకు బయలుదేరిన బిసి జన చైతన్య బస్సు యాత్ర ఈ నెల 8వ తేదీన జిల్లాలోని కొడంగల్‌కు రానుందరి అక్కడి నుండి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రలో బిసి మేదావులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు, బిసి కులసంఘాలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. బిసిలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బడ్జెట్‌లో 52వాతం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ చట్టం వెంటనే చేయాలని అన్నారు. బిసిలోని ఎన్నో కులాలు అభివృద్ధికి పూర్తిగా దూరమయ్యావని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి కులాల్లో కుల వృత్తులు చాలా ఉన్నాయని కుల వృత్తులు నాశనమయ్యావని వాటిని కాపాడటంలో ప్రభుత్వాలు విస్మరించాయని ఆరోపించారు. వ్యవసాయంపై ఆదారపడిన రైతుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అందులో బిసి కులాలకు చెందిన రైతులే ఎక్కువగా ఉన్నారని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశంలోనే బిసి సబ్‌ప్లాన్‌పై చర్చించి చట్టం చేయాలని అదేవిధంగా జనాబా ప్రాతిపాదికన బిసిలకు బడ్జెట్ కేటాయించాలని అన్నారు. అత్యంత వెనుకబడినవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వృత్తిదారులకు ఉపాధి కల్పించి రాష్ట్రంలో బిసి కమీషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిలను బలపర్చే ప్రజాస్వామ్యవాదులను ఏకతాటిపైకి తీసుకురావడానికే ఈ యాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగిందని దేవేందర్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో నాయకులు సత్యయ్య, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపిలో అంతర్మథనం.. నేతల్లో నిరాశ
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7: జిల్లాలో బిజెపి నేతల్లో రోజురోజుకు నిరాశ నిస్పుృహాలు నెలకొంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికిని తాము ఆశించిన స్థాయిలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని జిల్లాలోని బిజెపి నాయకులు అంతర్మథనంలో పడ్డారు. కేంద్రానికి సంబంధించిన పథకాలపై అవగాహన లేకపోవడంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత బిజెపి నేతలు ఎవరికి వారు ఎమునాతీరే అన్నచందంగా మారారు. దాంతో కిందిస్థాయి నాయకుల్లో నిరాశ నెలకొంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో కొదోగొప్పో క్యాడర్ ఉన్నప్పటికిని ఆ క్యాడర్ గురించి పట్టించుకున నాయకుడే కరువయ్యారనే విమర్శలు సొంత పార్టీ శ్రేణుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు బడానాయకులు మాత్రం బిజెపిని రాజకీయ పావుగా వాడుకుని పదవులు అనుభవించి తీరా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారనే బాధను కూడా జిల్లాలో పార్టీ శ్రేణులు బహిరంగగానే అంటున్నారు. గతంలో కొందరు నాయకులు ఎంపి, ఎమ్మెల్యేల పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీని విడిచిపెట్టడం వంటి సంఘటనలు చోకుచేసుకోవడం దురదృష్టకరమని నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. దాంతో కింది స్థాయి నాయకుల్లో రోజు రోజుకు నిరాశ నిస్పుృహలు నెలకొంటున్నాయి. కొందరు నాయకులు బహిరంగంగానే వచ్చిపోయే వారు సీజన్ పక్షులుగా కొందరు నాయకులు అభివర్ణిస్తున్నారు. ఆ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికిని ప్రస్తుతం మాత్రం నియోజకవర్గాలలో కింది స్థాయి నాయకులు తమ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో తమకు భాగస్వామ్యం లమించడంలేదనే భావన బిజెపి శ్రేణుల్లో బహిరంగంగానే చర్చ జరుగుతుంది. జిల్లాలో ఒకరు ఇద్దరు నాయకులు మాత్రమే తమ నియోజకవర్గాలలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. మరి కొందరు నాయకులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ పదువుల్లో ఉండి కూడా పార్టీ నిర్మాణంపే పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఇందుకు ప్రధాన కారణం కొందరు నాయకులు మాత్రం బహిరంగంగానే చెబుతున్నారు. నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసిన సందర్భాలు ఉన్నాయని తీరా ఎన్నికలు వచ్చే సరికి పొత్తుల పేరిట బలమైన నియోజకవర్గాలను వదులుకునే పరిస్థితులు రావడంతో ఎన్నికలప్పుడే ఎంచేయాలో అదే చేస్తే సరిపోతుందని అప్పుడప్పుడు పార్టీ ఆదేశాలకు సంబందించిన కార్యక్రమాలు నిర్వహిస్తే సిరపోతుందనే భావనను కూడా కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో బిజెపికి నాలుగుగైదు నియోజకవర్గాలలో మంచిపట్టు ఉన్నప్పటికిని ప్రతి సారి ఎన్నికల్లో పొత్తులు తమ కొంపముంచుతున్నాయని దాంతో తమ శ్రమఅంతా వృద్దా అవుతుందని కూడా బిజెపి నాయకుల్లో నెలకొని ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి దాదాపు 19నెలలు గడుస్తున్నపటికిని నామినేటేడ్ పోస్టుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా పార్టీ సినియర్ నాయకుల్లో కొంత నిరాశ నెలకొంది. తమకు పదవులు వస్తే గ్రామాలలో కింది స్థాయి కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా వస్తున్న కొన్ని పథకాలనైనా లబ్ధిచేకూర్చవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరునాటికి గానీ వచ్చే నెలలో జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవి ముళ్లకిరిటమేనని పలువురు నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మరోలా ఉన్నాయని, కేంద్రంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాయనే భావన జిల్లా బిజెపి శ్రేణుల్లో నెలకొని ఉంది. ఏదిఏమైనప్పటికిని జిల్లాలో కొద్దోగొప్పో క్యాడర్ ఉన్నప్పటికిని ఆ క్యాడర్‌ను ఉత్సహపరిచే నాయకులు జిల్లాలో కరువయ్యారనే విమర్శలు మాత్రం వెలువడుతున్నాయి.

జూరాల ఆయకట్టుకు
సాగునీటిని అందించి ఆదుకోవాలి
* గద్వాల జిల్లా సాధన కోసం నిరవధిక దీక్షలు
* గద్వాల ఎమ్మెల్యే అరుణ

గద్వాల, ఫిబ్రవరి 7: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు సాగునీరు అందక పోవడంతో వరి, వేరుశనగ పంటలు ఎండిపోయే పరిస్థితులు దాపురించాయని, రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ కోరారు. ఆదివారం డికె సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జూరాల ఆయకట్టుకింద రైతులు వేసుకున్న పంటలు కల్లెదుటే ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారని వారి వేదనను తెలుసుకొని జిల్లా ప్రాజెక్టుల ఛీఫ్ ఇంజనీర్, ఎస్‌ఇకి పలుసార్లు సాగునీటి విషయంపై సంప్రదించినట్లు ఆమె తెలిపారు. గతంలో జిల్లా మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయడంతో జూరాల అధికారులకు జిల్లా కలెక్టర్ మెమోలు జారీ చేసినట్లు వారు తెలిపారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి రెండు తడుల కోసం జూరాల సాగునీటిని విడుదల చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు కర్ణాటక ప్రభుత్వంతో సాగునీటిని విడుదల చేయించడంలో శ్రద్దచూపాలని కోరారు. గతంలో వదిలిన నీళ్లు వృధాగా పోయాయని రైతుకు పంట చేతికందే సమయంలో నీటిని ఇచ్చి ఆదుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా గద్వాల జిల్లా సాధన కోసం త్వరలోనే నిరవదిక దీక్షలు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సంప్రదించి జిల్లా ఉద్యమాన్ని అంచలంచెలుగా ఉదృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజీనామాల విషయంపై విలేకర్లు ప్రశ్నించగా అవగాహన లేని నేతల మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని తిరస్కరించారు.

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం!
అధికారులకు మంత్రి, కలెక్టర్ పలుమార్లు హెచ్చరికలు
ఆంద్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7: వలసల నివారణకు, సొంత గ్రామాల్లోనే చేతినిండా పని కల్పించాలని పదేళ్ల క్రితం జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం లక్షలాది మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాల్సిన అధికారులు పథకాన్ని నీరుగారుస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించిన, హెచ్చరించిన ఆశించిన స్థాయిలో పనులు కొనసాగడం లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరం మరో 52 రోజులు మాత్రమే ఉంది. ఇంతలో దాదాపు రూ.270 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత డబ్బు 52 రోజుల వ్యవధిలో ఖర్చు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ వ్యవధిలో పనులు చేపట్టకపోయిన నిధులు ఖర్చు చేయకపోయినా జిల్లా తీవ్ర నష్టం జరగనుంది. వచ్చిన నిధులను ఖర్చు చేయకుంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపుకు అడ్డంకులు రానున్నాయి. గత నాలుగు నెలల క్రితమే మంత్రి జూపల్లికృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ఉపాధి హామీ పథకం పనుల ఆమలును వేగవంతం చేయాలని జిల్లాలోని ఫిల్డ్ అసిస్టెంట్లకు, ఏపిఓలు, ఎంపిడిఓలు సంబంధిత జిల్లా శాఖ అధికారులతో రోజంతా సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి మాసంలో కూడా జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకం ఆమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని మంజూరు అయిన పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అయినప్పటికిని అడుగు ముందుకు పడకపోవడంతో మరోసారి ఈ నెల 5వ తేదిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశంలో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని కూడా ఎంపిడి ఓలను ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంపై ప్రత్యేకంగా ఏపిఓలు డ్వామా అధికారులతో సమావేశం నిర్వహించి ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయని అధికారులపై వేటు వేస్తామని కూడా హెచ్చరించారు. పదోన్నతులు నిలిపి వేస్తామని, ఇంక్రిమెంట్లు కూడా కట్ చేస్తామని హెచ్చరించారు. నడిగడ్డ ప్రాంతంలో జనం వలసలు పోతున్నారని ఉపాధి హామీ పథకం పనులకు 20 శాతం కూలీలను కూడా ఎందుకు కూలీ పనులకు రావడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ఎంపిడిఓలు, ఏపిఓలు చిత్తశుద్ధితో పని చేయాలని కూడా ఆదేశించినప్పటికిని జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగడం లేదు. తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే వైశాల్యం, విస్తీర్ణంలో పెద్దదై ఉన్నప్పటికిని 43 లక్షల జనాభా ఉంది. ఇందులో అధిక శాతం రైతులు, వ్యవసాయ కూలీలు, కూలీలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న దుర్భిక్షమైన కరువు పరిస్ధితుల్లో కూలీలకు చేతినిండా పనులు కల్పించాల్సిన అధికారులు చేతులు ఎత్తేయడం ఏమిటని విమర్శలు వెలువడుతున్నాయి. ప్రతి రోజు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, కొడంగల్, కోస్గి, జడ్చర్ల, వనపర్తి బస్టాండ్లలో కూలీలు ముంబాయి బస్సులు ఎక్కి వలసలు వెళ్తున్నారు. ఇదేమిటని కూలీలను ప్రశ్నిస్తే తమకు ఉపాధి కరువై పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంపై ఆరా తీస్తే మాత్రం తమ గ్రామాల్లో ఎవరు పట్టించుకోవడం లేదని గిరిజన తాండ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసలు, కరువు కాటకాలతో అల్లడుతున్న జిల్లా ప్రజానికానికి ఉపాధి హామీ పథకం పనులు కల్పించకపోవడం దురదృష్టకరం.
పనులు జరగకపోవడం కారణం ఏమిటి
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులకు కోట్లాది రుపాయల నిధులు ఉన్నప్పటికిని అధికారుల నిర్లక్ష్యం, ఎంపిడిఓలు, ఏపిఓలు ప్రత్యేకంగా శ్రద్ద కనబర్చకపోవడం ముఖ్యంగా ఫిల్డ్ అసిస్టెంట్లు కూడా కూలీల దగ్గరకు వెళ్లకపోవడంతో వందలాది గ్రామాల్లో పనులు జరపకపోవడం మరికొన్ని గ్రామాల్లో నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. అయితే కూలీలు పని చేద్దామని ముందుకు వస్తే సకాలంలో పనులు చూపకపోవడం, ఒకవేళ కూలీ పని చేసిన వారికి కూలీ డబ్బులు సక్రమంగా అందించకపోవడం కూడా జిల్లాలో ఉపాధి హామీ పథకానికి శరఘాతంగా మారింది. కూలీ చేసిన డబ్బులు రాకపోతే దండగా అనే భావనతో జిల్లాలోని లక్షలాది మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కూలీలు అధికంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా మాత్రం ఉపాధి హామీ పథకంలో వెనుకంజలో ఉండడం అందుకు భిన్నంగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఈ పథకం ఆమలులో ప్రథమ స్థానంలో నిలవడం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఏది ఎమైనప్పటికి 52 రోజుల వ్యవధిలో రూ.270 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అధికారులు ఏ మేరకు పని చేస్తారో వేచి చూడాల్సిందే.