మహబూబ్‌నగర్

టిడిపి, కాంగ్రెస్ నేతలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 30: జిల్లా వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టిడిపి నాయకులే కారకులని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించకుండా కేవలం రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి పబ్బం గడుపుకుని జిల్లా ప్రజలను సర్వనాశనం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ చైర్మన్ గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు కాంగ్రెస్, టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని అడుగులు ముందుకు వేయడం లేదని తెలుగుదేశం పార్టీ మహానాడులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, రమణలు చేసిన వ్యాఖ్యాలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వీరిద్దరిని ఎప్పుడో తెలంగాణ సమాజం ద్రోహులుగా పరిగణించిందని ఘాటైన విమర్శ చేశారు. పక్క రాష్ట్రంలో పోయి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడడం తగదని ఆయనకు మిగిలింది ఒక్కటేనని గ్రామాలకు వస్తే చీపురు దెబ్బలు పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను పదేళ్లపాటు దత్తత తీసుకుని దగా చేసిన ముర్ఖుడని, పాలమూరు ఎత్తిపోతల పథకం నుండి కొడంగల్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం చూస్తుంటే ప్రాజెక్టు వద్దని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా కొంతమంది రైతులతో కేసులు పెట్టించిన దుర్మార్ఘుడని అలాంటి వ్యక్తికి ఈ సన్యాసులు ఒత్తాసు పలుకుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆశయాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దేశంలోని మేధావులు, విద్యావేత్తలు, వివిధ రాష్ట్రాల రాజకీయవేత్తలు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై అభినందనలు వెలుబుచ్చుతుంటే రేవంత్‌రెడ్డి లాంటి ద్రోహికి మాత్రం పచ్చకామెర్లు వచ్చాయని కామెర్లు వచ్చినవారికి అంతా పచ్చగానే కనబడుతుందని ఎద్దెవా చేశారు. ఆర్డి ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ధర్నాలు, దీక్షలకు దిగడం విడ్డురంగా ఉందని పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సోయి రాలేదా అని ప్రశ్నించారు. ఈ జిల్లాను నాశనం పట్టించింది మీ పార్టీలే కదా అని ఆరోపించారు. 2019లో అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్, టిడిపిలను ప్రజలు ఎప్పుడో పాతాళానికి తొక్కారని వారికి అధికారం సంగతి ఎలా ఉన్న ముందు పాతాళం నుండి భూమిపైకి వచ్చే మార్గం ఎంచుకుంటే బాగుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హితవుపలికారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామని తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పారదర్శకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన కొనసాగుతుంటే జీర్ణించుకోలేని కొందరు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ సన్యాసులు, సిగ్గుమాలినవారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయంగా దమ్ము, దైర్యం ఉంటే ఎదుర్కోవాలే తప్పా. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే వాతలు పెడుతారని హెచ్చరించారు. జిల్లా వెనుకబాటుకు కారణం కాంగ్రెస్, టిడిపిలేనని ఆయన ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, తెరాస నాయకులు కృష్ణ, కోట్ల కిషోర్ పాల్గొన్నారు.