మహబూబ్‌నగర్

లోకకల్యాణార్థమే శ్రీరామపాదుకల పట్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 30: లోక కల్యాణార్థం ప్రజలకు మేలు జరగాలని సంకల్పంతో శ్రీరామపాదుకల పట్ట్భాషేకం కార్యక్రమాన్ని గ్రామగ్రామాన, ఇంటింటికి చేరాలని లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు బార్ కౌన్సిల్ చైర్మన్, శ్రీరామపాదుకల పట్ట్భాషేకం ఉత్సవాల చైర్మన్ అనంత నర్సింహ్మారెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు, ప్రశాంతతలోపించిన పరిస్థితులను అధికమిస్తూ ప్రజలకు కొంత ఊరట కలిగించేందుకోసం రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఆధ్యాత్మకంగా ప్రజలను చైతన్యపర్చి శ్రీరామపాదుకల పట్ట్భాషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత నెలరోజుల నుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి తదితర ప్రాంతాలలో పర్యటించి కార్యక్రమం అవశ్యకత గురించి వివరించినట్లు తెలిపారు. వెయ్యేళ్లక్రితం రామానుజాచార్య కులమతాలకు అతీతంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమతారథాన్ని నిర్వహించారని తెలిపారు. ఆనాటి రామరాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలకు కొదువలేదు, ధర్మానికి ప్రతీకంగా పాలన కొనసాగిందన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసాయి, రైతులంతా పంటలు పండించుకొని సంతృప్తిగా జీవించారని ఆనాటి రామపాలనను మరోసారి గుర్తు చేసుకుంటూ మనసులలో కొంత కరవుబాధను మదిస్తూ రాబోయే రోజులలో మంచి జరుగుతుందనే భావనతో శ్రీరామ పాదుకల పట్ట్భాషేకం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నానారాయణ రామానుజ చిన్నజియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులాలకు అతీతంగా భక్త్భివంతో గ్రామాలలో కమిటిగా ఏర్పడి శ్రీరామపాదుకలను వారం రోజుల పాటు ఇళ్లలో పూజించి భక్తమండలికి అందచేయాల్సి ఉంటుందని, ఆ తరువాత వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో నాగర్‌కర్నూల్ పట్టణంలో భారీ ఎత్తున శ్రీరామ పాదులకలను స్వామిజీ ఆధ్వర్యంలో ఊరేగిస్తూ శోభయాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు చేపట్టే కార్యక్రమాలను చర్చించేందుకు, శ్రీరామపాదుకుల పట్ట్భాషేకం కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 12న శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నానారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వట్టెంకు వస్తున్నట్లు తెలిపారు. వట్టెం దేవాలయం ఆవరణలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో నగరపంచాయతీ చైర్మన్ వంగ మోహన్‌గౌడ్, వట్టెం దేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త సందడి రంగారెడ్డి, విహెచ్‌పి జిల్లా అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు బండారు రాజశేఖర్, కార్యదర్శి రఘునాథశర్మ, శ్రీనివాసులు, భరత్‌కుమార్, హకీం మురళి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

చిన్నచింతకుంట, నవంబర్ 30: పల్లెప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీకురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11నుండి వైభవంగా ప్రారంభమైనాయి. ఈబ్రహ్మోత్సవాల్లో భాగంగా 16న అలంకారోత్సవం, 18న ఉద్దాల మహోత్సవం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 20రోజులుగా కొనసాగిన బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిసాయి. ముక్కెర వంశ రాజులు చేయించిన అభరణాలను ఆలయ అర్చకులు తొలగించి ఒక్కొక్కటిగా లెక్కించి అభరణాల పెట్టెలో ఉంచారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుండి ఈవో గురురాజ అభరణాల పెట్టెను తలపై ఉంచుకుని భాజాభజంత్రీలతోకొండ పైనుండి దిగువ కొండ వరకు తీసుకువచ్చారు.అక్కడ ప్రత్యేకవాహనంలో సిఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సై నాగేశ్వర్‌రెడ్డి భారీ బందోబస్తు మద్య ఆభరణాలను ఆత్మకూరులోని ఎస్ బి ఐ బ్యాంక్‌లో ప్రత్యేక లాకర్‌లలో ఆభరణాలు భద్రపర్చారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ యతిరాజు, నాయకులు సురేందర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, ఆలయ సిబ్బంది శివానందచారి, భక్తులు పాల్గొన్నారు.

బీమా పునరుద్ధరణ జాడేదీ?

దౌల్తాబాద్, నవంబర్ 30: స్వయం సహయక సంఘం సభ్యులకు భీమా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వ హయంలో ఎస్‌హెచ్‌జి సభ్యులకు ఆమ్‌ఆద్మి భీమా యోజన, అభయహస్తం, ప్రమాదభీమా తదితర భీమాల పథకాలను ఆమలు చేసింది. కానీ ఇందిరాక్రాంతిపథం అధికారుల నిర్లక్ష్యం కారణంగా భీమా పునరుద్దరణకు నోచుకోవడం లేదు. అభయహస్తం పథకంలో ఒక మహిళ ప్రతి సంవత్సరం రూ.365 చెల్లిస్తే ప్రభుత్వం ఆ సభ్యురాలి పేరుపై రూ.365 చెల్లిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వయస్సు తగ్గట్టు పించన్ సౌకర్యం వర్తిస్తుంది. అదే సభ్యురాలి కుటుంబంలో పిల్లలు, 9,10, ఇంటర్ చదువుతుంటే ప్రతి నెల రూ.100 చోప్పున సంవత్సరానికి రూ.1200 చోప్పున స్కాలర్ షిప్ వస్తుంది. సభ్యురాలు సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వితంగా అంగవైకల్యం చెందితే రూ.75 వేలు, తాత్కలిక అంగవైకల్యం చెందితే రూ.37500 భీమ వర్తిస్తుంది. ప్రస్తుతం సంవత్సరం అయిన కూడా పునరుద్దరణ చేయడం అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ పథకం ఆమలులో ఉందో లేదోనని మహిళలు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై ఐకెపి సిబ్బందిని సంప్రదిస్తే ప్రాజెక్టు ఆదేశానుసారంగా తాము పని చేస్తున్నామని సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు. కొందరు మహిళలు మాత్రం టిసిల పనితీరు సరిగ్గా లేని కారణంగానే తమకు అందాల్సిన భీమ పథకం రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన డి ఆర్‌డి ఏ అధికారులు స్పందించి స్వయం సహయక సంఘం సభ్యులకు భీమ పథకం పునరుద్దరణ చర్యలు చేపట్టి మహిళ సంఘం సభ్యుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఎంతైన ఉందని మండలంలోని వివిధ గ్రామాల స్వయం సహయక సభ్యులు కోరుతున్నారు.

ప్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు
అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 30: జిల్లాలో ప్రెండ్లీ పోలిసింగ్ విధానం ఆమలు చేస్తున్నామని దింతో పోలీసులకు ప్రజల మధ్య మరింత సత్సంబంధాలు పెరిగాయని జిల్లా అడిషనల్ ఎస్పి శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల దినాన్ని పురస్కరించుకుని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు పలువురు బాధితులతో ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులు అడిషనల్ ఎస్పీని కలిసి తమ బాధలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రెండ్లీ పోలిసింగ్ విధానం ఆమలు చేస్తున్నందున జిల్లా పోలీసులకు జిల్లా ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. నేరగాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అడిషనల్ ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేవారిని సహించేది లేదన్నారు. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా పోలీసులు ప్రజల బాగోగుల కోసమే పని చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా చిన్నచిన్న తగాదాలను పెద్దవిగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని సూచించారు. జిల్లాలో ఇటివల భార్యభర్తల తగాదాల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకెళ్లాలని అడిషనల్ ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించుకోవాలని అది తల్లిదండ్రుల భాధ్యత అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధికి సలహాలివ్వండి
మాజీ ఎంపి మంద జగన్నాధం హితవు
కల్వకుర్తి, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి పక్షాలు విమర్శలు మాని రాష్ట్భ్రావృద్దికి సలహాలు ఇవ్వాలని మాజీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మంద జగన్నాధం ప్రతి పక్ష నాయకులకు సూచించారు. సోమవారం పట్టణంలోని టిఆర్‌ఎస్ కౌన్సిలరు నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పక్ష నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదని, ప్రభుత్వంపై విమర్శలు మాని రాష్ట్భ్రావృద్దికి సలహాలు అందించాలని, మొన్న జరిగిన వరంగల్ ఉప ఎన్నికలే కెసిఆర్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ పాలనను చూసి ప్రతి పక్ష నాయకులకు మనుగడ కొల్పోతామనే భయంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఎన్నికలలో ఇచ్చిన హమిలను నేరవేర్చకుంటే ఓట్లు అడుగమని దైర్యంగా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదని, ఎన్నికలలో ఇచ్చిన హామిలను నేరవేర్చకుంటే 2019 సాధారణ ఎన్నికలలో ఓట్లు అడుగాం అని బహిరంగంగా మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన గుర్తు చేశారు. అలాగే సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రధాన దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు యాదగిరిచారి, శ్రీను, రవీందర్‌యాదవ్, భూపతిరెడ్డి, బాల్‌రాజు,గోరటి శ్రీను, బాస్కర్‌రెడ్డి,శ్రీదర్‌రెడ్డి,సంజీవ్‌కుమార్,లక్ష్మారెడ్డి, నయిమ్,శ్రీను,తర్నికల్ శ్రీను, తదితరులు ఉన్నారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన
మహనీయుడు జ్యోతిరావు పూలే
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 30: గత రెండు శతాబ్దాల క్రితమే భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు బాపు జ్యోతిరావుఫూలే అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా బిసి ఐక్య వేదిక ఆధ్వర్యంలో బాపు జ్యోతిరావుఫూలే 125వ వర్ధంతి సభను మున్సిపల్ టౌన్ హల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు బిసి ఐక్య వేదిక నాయకులు జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల చైతన్యం కోసం జ్యోతిరావు ఫూలే ఆలోచనలతో గత రెండు శతాబ్దాల క్రితమే ఆలోచించిన మహనీయులని కొనియాడారు. బడుగుబలహీన వర్గాలలో చదువు ఎంతో అవసరమని భావించి దేశవ్యాప్తంగా బడుగుల చదువుల కోసం పలు చైతన్యవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. దేశంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచించిన మొదటి వ్యక్తి బాపు జ్యోతిరావుఫూలే అని తెలిపారు. ఆ కాలంలోనే కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేవిధంగా ఆనాటి పాలకులపై పోరాటం చేశారని తెలిపారు. అంతేకాకుండా దేశంలోని ప్రతి మహిళ చదువుకుంటేనే కుటుంబాలు అభివృద్ది చెందుతాయని భావించి మహిళల చదువుకోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఆయన రాజ్యాంగ రచనలో ఫూలే ప్రస్తావించిన ఎన్నో అంశాలను పొందుపర్చారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు ఫూలేను గురువుగా భావించాడని తెలిపారు. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అంబేద్కర్ కల్పించి నేడు ప్రతి బడుగుబలహీన వర్గాల గుండెల్లో చిరస్మరనీయంగా నిలిచాడని తెలిపారు. బిసిలు ఇంకా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైన ఉందని రాజ్యాధికారం కోసం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే జ్యోతిరావు ఫూలే కలలు కన్న సమాజం నిర్మాణం అవుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లాలో బడుగుబలహీనవర్గాల సంఖ్యబలం ఎక్కువగా ఉన్నప్పటికిని ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదని ఇందుకు ప్రధాన కారణం చదువులేకపోవడం, ఐక్యత లేకపోవడమే ముఖ్య కారణమని ఆయన అన్నారు. జిల్లాలో బడుగుబలహీన వర్గాలంతా ఏకమై అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక నాయకుడు ప్రభాకర్, చారి, వెంకటయ్య, రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.