మహబూబ్‌నగర్

నాణ్యమైన విద్యతోనే అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 3: నాణ్యమైన విద్యతోనే అన్ని రంగాల్లో దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి కార్యాలయం నుండి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు విద్యాశాఖ సెక్రెటరీలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కలెక్టర్లతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి స్మతి ఇరానీ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. నేటి ఆధునీక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనడానికి అన్నింటికి ఉదాహరణలు కలవని మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరు చేయూతను ఇవ్వాలని తెలిపారు. ఈ పైలేట్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని మహిళల స్థితిగతులు, విద్యా వ్యవస్థ వంటి సమగ్ర వివరాలు పొందుపర్చడం జరిగిందని తెలిపారు. రూసా ద్వారా కొత్త భవనాలు ఏర్పాటు, పాత డి6గీ కళాశాలల మరమ్మత్తు వౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రూసా నుండి లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి 40శాతం నిధులు కేటాయిస్తే మిగిలిన 60శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. విదేశాల నుండి కూడా యూనివర్సిటీల్లో శిక్షణ నైపుణ్యాల కోరకు ప్రోఫెసర్లను నియమిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి ఉపాద్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో మహిళల అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యత కంటే తక్కువగా ఉందని మహిళ అక్షరాస్యతను పెంచడానికి అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసి రాజబహదూర్ వెంకటరాంరెడ్డి మహిళ అక్షరాస్యతను పెంచడానికి 1949లోనే మహిళ హస్టల్‌ను ఏర్పాటు చేశారని వివరించారు. జిల్లాలో ఐదు కళాశాలలు రూసా నిదులతో నడపబడుతున్నాయని అందులో ఓ మహిళ కళాశాల ఉందని, మరోక మాడల్ కళాశాల శంకుస్థాపనకు సిద్దంగా ఉందని తెలిపారు. ఎంవి ఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన హరిక మాట్లాడుతూ జిల్లాలో 21 డిగ్రీ కళాశాలలు మాత్రమే ఉన్నాయని, మరిన్ని మంజూరు చేయాలని, మరో విద్యార్థి సాహితి మాట్లాడుతూ ఐటిని అనుసందానం చేస్తూ శిక్షణ నైపుణ్య కార్యక్రమాలను విలైనన్ని ఎక్కువగా నిర్వహించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఫాతిమా అనే మరో విద్యార్థిని మాట్లాడుతూ రోల్ మాడల్‌గా ఎవరున్నారని కేంద్ర మంత్రిని ఆసక్తిగా ప్రశ్నించారు. మంత్రి సమాధానం ఇస్తూ తనకు ప్రత్యేకంగా రోల్‌మాడల్ అంటూ ఎవరు లేరని ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రులే రోల్ మాడల్ అని తల్లిదండ్రులు కన్న కలలను విద్యార్థులు నిజం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెఎన్‌టియు యూనివర్సిటీ నుండి విద్యాశాఖ కమీషనర్ వాణిప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజిత్ ఆచార్య, జిల్లా ఎన్‌ఐసి కేంద్రం నుండి పాలమూరు యూనివర్సిటీ విసి భాగ్యనారాయణ, రూసా మాడల్ అధికారి సంబశివరావు పాల్గొన్నారు.