మహబూబ్‌నగర్

జూలై 31 నాటికి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, జూన్ 7: ఖరీఫ్ జూలై 31నాటికి లిప్టు-1, లిప్టు-2, లిప్టు -3ల ద్వారా 4లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జొన్నలబోగుడ రిజర్వాయర్ లిప్టు-2 పనులను పంపుహౌస్, సర్జిపుల్, విద్యుత్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించి పనుల శాతంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పగలు అధికారులు పని చేయించి అనుకున్న నాటికి పనులు పూర్తి చేయడానికి కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు రిజర్వాయర్ కాలువల కింద వరిపంటలు వేయరాదని, వాటికి బదులుగా ఆరుతడి పంటలు పండించి అత్యధికంగా దిగుబడి పొంది అధిక ఆదాయం పొందాలని రైతులకు మంత్రి సూచించారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించి వారు కలలు గన్న కలలను సహకారమయ్యే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఆంధ్ర పార్టీలకు చెందిన కొంత మంది నాయకులు ప్రాజెక్టుల ద్వారా నీరు అందకుండా అడ్డుతగులుతున్నారని అటువంటి తెలంగాణ ద్రోహులకు ఈ రాష్ట్ర ప్రజలు గుణపాఠం నేర్పుతారని వారిని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో ఎస్ ఇ భద్రయ్య, సి ఇ రాజేందర్, ఇ ఇ రాంచంద్రయ్య, ప్రాజెక్టు జనరల్ మేనేజర్ శశిధర్‌రెడ్డి, ఎంపిపి వెంకటేశ్వర్‌రావు, జడ్పీటిసి వెంకటయ్య పాల్గొన్నారు.