మహబూబ్‌నగర్

కళకళలాడుతున్న జములమ్మ రిజర్వాయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 7: గత రెండు నెలలుగా గద్వాల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన జములమ్మ రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై పలుసార్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్యే డికె అరుణ ఇరిగేషన్ అధికారులతో పాటు కలెక్టర్, నీటిపారుదలశాఖ మంత్రికి వివరించారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన జూరాల అధికారులు జములమ్మ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో జములమ్మ రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్‌కు, కమీషనర్‌కు మధ్య జరుగుతున్న వివాదాల కారణంగా డిజీల్ బిల్లులు నిలిపివేయడంతో పాటు అభివృద్ధి బిల్లులు కూడ నిలిచిపోవడంతో ఈ ప్రభావం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు ఆలాం, క్లోరినేషన్, క్లోరిన్ గ్యాస్, బ్లీచింగ్ పౌడర్, శుద్దిపరికరాలు, ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మత్తు, మోటార్ల మరమ్మత్తుకు సంబంధించిన బిల్లులు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన చెల్లించి తాగునీటి కష్టాలు లేకుండా చూడాలని పాలకపక్షానికి, అధికారులకు ప్రజలు కోరుతున్నారు.
జములమ్మ రిజర్వాయర్‌లో
బోట్ల విహారం
జములమ్మ రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చి చేరడంతో సందర్శకుల విహారం కోసం పెడల్ బోట్లను మంగళవారం పర్యాటకశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటకులు బోట్లను వేసుకొని రిజర్వాయర్‌లో చక్కర్లు కొట్టారు. గతంలో ఉన్న పవర్‌బోటు సోమశీల వద్ద జరుగుతున్న పుష్కర పనుల నిమిత్తం తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
పనులు ముగిసిన తరువాత తిరిగి జములమ్మ రిజర్వాయర్‌కు తీసుకురావాలని భక్తుల, ఈ ప్రాంత ప్రజలు పర్యాటకశాఖ అధికారులను కోరారు. రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి జములమ్మ భక్తులతో పాటు పట్టణ ప్రజలకు ఉల్లాసంగా ఉండేందుకు పర్యాటకశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పెడల్‌బోట్ల ప్రారంభానికి పర్యాటకశాఖ మేనేజర్ సైదులు, జములమ్మ ఇఓ పురేంధర్, అధికారులు మురళి, బోటు డ్రైవర్ వెంకట్రాజు పాల్గొన్నారు.