మహబూబ్‌నగర్

మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 18: మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని దినిని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం గత రెండు సంవత్సరాల నుండి విస్తృతంగా డ్రక్ అండ్ డ్రైవ్ దాడులు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే అంశంపై జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో విషాదాన్ని నింపుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాలు ప్రధానమైనని వీటిలో మధ్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ప్రధాన లక్ష్యంతో జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనార్థలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తూ కరపత్రాలు, పోస్టర్లు ప్రసార మాద్యామాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశామని ఆయన తెలిపారు. అనంతరం పోలీసుశాఖ చట్టపరమైన చర్యలు చేపట్టిందని మండల స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు నిరంతరం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై జరిమానాలు విధిస్తూ తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హజరుపర్చడం జరిగిందని ఎస్పీ వివరించారు. 2014-16 సంవత్సరాలకు గాను 2127 కేసులు నమోదు కావడం జరిగిందని తెలిపారు. జరిమానా రూ.14 లక్షలు విధించడం జరిగిందని ఎస్పీ వివరించారు.