మహబూబ్‌నగర్

నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 19: నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యమకారులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పార్టీ కోసం పని చేసే వారికి కూడా పెద్దపీఠ వేయడం జరుగుతుందని తెరాస లోక్‌సభా పక్షనేత ఎంపి జితేందర్‌రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే దగ్గర వారే చూసుకుంటారని ఎమ్మెల్యేలు లేని స్థానాల్లో మంత్రులు చూసుకుంటారని నియోజకవర్గ ఇంచార్జిలను భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తామని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జితెందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని క్షేత్రస్థాయిలో తామంత పర్యటించి అధికారులతో సమన్వయం చేసుకుని నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం జిల్లాకు వరద ప్రయినీ అని ఈ ప్రాజెక్టు పనులకు సంబందించి త్వరలోనే అన్ని నిబంధనాలు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో పలు జిల్లాలో కరువు తాండవిస్తుందని కరువుకు సంబందించిన కేంద్రం రూ.780కోట్లు పరిహారం అందించడానికి నిర్ణయం తీసుకుని నిధులు కేటాయించిందన్నారు. త్వరలోనే రైతులకు పంటనష్టపరిహారం అందుతుందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణలో రైతు యూనిట్‌గా పంటనష్ట పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం ముందు ఉంచామని తెలిపారు. ఈ విషయంపై ఇటివల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధమోహన్‌తో సంప్రదించడం జరిగిందని కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నందున త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌కు మెట్రో వాటర్ అంధిస్తామని కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని వాటిని ఇటివల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లు పరిశీలించి సంబందిత అధికారులతో చర్చించారన్నారు. కగ్నా నుండి కొడంగల్‌కు తాగునీరు అందించే విషయంలో కొంత ఇబ్బంది ఉందని పైపులైన్లు నాసిరకంగా ఉండడంతో ఇబ్బందులు ఉన్నట్లు తనకు సమాచారం వచ్చిందని త్వరలోనే అక్కడ పర్యటిస్తాన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను జిల్లాలో ఆగస్టు మాసంలో పర్యటిస్తే జిల్లాకు లాభం ఉంటుందనే భావన ఉందని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆగస్టులో కృష్ణా పుష్కరాలు ఉన్నందున నది తీరాన పర్యటిస్తూ మూడు నాలుగు రోజులు ఇక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఐదవ శక్తిపీఠం జోగులాంబ దేవిని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దర్శించుకోవాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో కృష్ణా పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తామని అందుకు ఇప్పటి నుండే జిల్లా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అంతేకాకుండా సాగు, తాగునీటికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ప్రాజెక్టులను పూర్తి చేసి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తామందరి ముందున్న లక్ష్యమన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలకు రెండేళ్లలో వాటర్‌గ్రీడ్ ద్వారా మంచినీరు అందిస్తామని ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో మాజి ఎమ్మెల్సీ జగధీశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు బెక్కెం జనార్థన్, కోట్ల కిషోర్, సురేందర్‌రెడ్డి, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువత స్థిరపడేలా శిక్షణ ఇవ్వాలి
ఆంద్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 19: జీవితంలో స్థిరపడేలా ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి సూచించారు. ముఖ్యంగా స్థానిక డిమాండ్‌ను, అవకాశాలను దృష్టిలో ఉంచుకుని శిక్షణను ఇస్తే యువత శాశ్వితంగా ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని అన్నారు. జిల్లాలో షాద్‌నగర్, కొత్తూర్, పొలేపల్లి, పారిశ్రామిక వాడ, అడ్డాకుల తదితర మండలాల్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో డిమాండ్ ఉన్న ఉద్యోగాలను గుర్తించి అలాంటి శిక్షణను జిల్లా యువతకు ఇస్తే సులభంగా వారికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఇందుకుగాను ముందుగా ఇండిస్ట్రియల్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్దిపై వివిధ శాఖలతో సమ్మిళిత సమావేశం నిర్వహించారు. జిల్లాలో పదవ తరగతి తర్వాత ఇంటర్మిడియేట్ విద్యాకు వెళ్లే వారి సంఖ్య బాగా తక్కువగా ఉందని సుమారు 60 శాతం మంది విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ఇలాంటి వారందరికి వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తే వారు ఉపాధి పొందేందుకు అస్కారం ఉందన్నారు ప్రస్తుతం డి ఆర్ డి ఏ, మెప్మా, పరిశ్రమల శాఖ, డ్వామా తదితర శాఖల ద్వారా ఇస్తున్న శిక్షణను కొనసాగించడంతో పాటు నిరుద్యోగ యువత వైఖరిలో మూర్తిమత్వంలో మార్పులు తీసుకువచ్చేలా శిక్షణను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత మంది ఆడపిల్లలు వివిధ కారణాల వల్ల ఉన్నత విద్యకు దూరంగా ఉంటున్నారని ఈ సంవత్సరం సభల కార్యక్రమం కింద 18 వేల మంది ఆడపిల్లలకు డిస్టెస్ విధానంలో పదవ తరగతి పరీక్షలు రాసే ఏర్పాట్లు చేశామని ఇలాంటి కార్యక్రమాలను అధికారులు ప్రొత్సహించాలని తెలిపారు. జిల్లాలో పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అస్కారం ఉన్నందున ఆయా రంగాల్లో శిక్షణను ఇవ్వాలని సూచించారు. ఆయా రంగాల్లో శిక్షణను ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనలో ముందుగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకునే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పెర్కోన్నారు. ఈ నెల 26న మహబూబ్‌నగర్‌లో, 30న షాద్‌నగర్‌లో జాబ్‌మేళ నిర్వహిస్తున్నామని ఈ జాబ్‌మేళల ద్వారా నిరుద్యోగ యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెప్మా, డిఆర్‌డిఏ పిడి లింగ్యానాయక్ వివరించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం రవీందర్, సెట్మా సిఇఓ హన్మంతురావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ, జిల్లా జాబ్స్ మేనేజర్ దివాకర్, మెప్మా డిఎల్‌హెచ్‌ఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం కెసిఆర్ ప్రకటనతో టిఆర్‌ఎస్‌లో జోష్
*మార్కెట్ చైర్మన్ పదవిపై చిగురిస్తున్న ఆశలు
నారాయణపేటటౌన్, మార్చి 19: రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంగా ఎదో ఒక ఎన్నిక జరుగుతుండటంతో నామినేటెడ్ పోస్తుల భర్తీకి ఆటంకాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల ఎన్నికలు ఒకదాని తరువాత వరసగా జరగడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం కొండెక్కిపోయింది. అప్పట్లో మార్కెట్ కమిటీల నియామకాలకు ప్రభుత్వం మొదటి సారిగా రిజర్వేషన్లు ప్రకటించింది. నియామకాలు జరుపుదామన్న తరుణంలోనే ఎన్నికలు రావడం ఎన్నికల కోడ్ ఉండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. అయితే అన్నీ ఎన్నికలు జరిగిపోవడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి నిన్న జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఇక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేద్దామని, అందుకు ఎమ్మెల్యేలకే పూర్తి అధికారం ఇస్తున్నట్లు జాబితాలు సమర్పించాలని ప్రకటించడంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా గతంలో ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారమే భర్తీ చేస్తారా లేక తాజాగా రిజర్వేషన్లు ప్రకటిస్తారా అన్న విషయాన్ని స్పష్టం చేయకపోవడం పూర్తి అధికారం ఎమ్మెల్యేలకే ఇవ్వడంతో అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇది వరలో పలు నియోజకవర్గాల్లో ఓటమి చెందిన నాయకులే నియోజకవర్గ ఇంచార్జిలుగా ఉన్నారు. అప్పట్లో జాబితాలు సైతం సమర్పించడం జరిగింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామామల్లో పలువురు విపక్ష ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరి అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. సిఎం కెసిఆర్ ఆయా ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు బాస్‌లని ప్రకటించడంతో పాత ఇంచార్జిలు వారి అనుచరులు ఖంగుతిన్నారు. ముందు సమర్పించిన జాబితాలను పరిగణనలోకి తీసుకుంటారా లేక ఎమ్మెల్యే ఇచ్చే జాబితాను పరిగణనలోకి తీసుకుంటారా అన్న అయోమయానికి గురవుతున్నారు. ఈ అయోమయం నారాయణపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను పట్టిపీడిస్తోంది. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లోకి చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగిన కె.శివకుమార్‌రెడ్డి మొదటి నుండి పార్టీకి అంకితభావంతో పనిచేసిన తన అనుచరులకు న్యాయం చేయాలని నియోజకవర్గంలో ఉన్న ఏకైక మార్కెట్ కమిటీకి తన అనుచరుల పేర్లను సూచిస్తూ ప్రభుత్వానికి జాబితాను పంపించారు. అయితే తాజాగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేలకే భాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి వెంట ఉన్న టిడిపి నాయకులు ఎమ్మెల్యేతో పాటు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారిలో కూడా పలువురు నామినేటెడ్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. దాంతో పాత టిఆర్‌ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతుండగా కొత్తగా ఎమ్మెల్యే వెంట పార్టీలో చేరిన టిఆర్‌ఎస్ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తానికి నారాయణపేట మార్కెట్ చైర్మన్, డైరక్టర్ పదవులు ఎవరికి దక్కుతాయోనని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
భూసేకరణ వేగవంతం చేయాలి
* కలెక్టర్ శ్రీదేవి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 19: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వ నిబందనాల ప్రకారం నిర్ధేశించిన కాలపరిమితి లోపు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చిన చోట 123 జిఓ ప్రకారం భూమిని తీసుకోవాలని తెలిపారు. రైతులు ముందుకు రాని చోట భూమిని సేకరించాలని తెలిపారు. భూ సేకరణ పేరిట కాలాన్ని వృధా చేయవద్దని నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరు సాగునీరు పొందాలనుకున్న హక్కును సాధ్యమైనంతవరకు కల్పించాల్సిన భాద్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ల కింద ఆయా మండలాల్లో గ్రామాల వారిగా భూసేకరణ పురోగతిని ఆమె సంబందిత ఆర్డి ఓలు, తహశీల్దార్ల వారిగా సమీక్షించారు. అనుకున్న లక్ష్యం సాధించాలంటే నిరంతరంగా కష్టపడాలని తెలిపారు. రిజర్వాయర్లు నిర్మించే పరిధిలోని మండలాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డిఓలు దేవేందర్‌రెడ్డి, రాంచందర్, హన్మంతురెడ్డి, జిల్లా రిజిస్టార్ ట్వింకిల్ జాయ్, ఇఇలు కోటేశ్వర్ రావు, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాలుగు గంటల పాటు...
నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు
దేవరకద్ర, మార్చి 19: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర రైల్వేస్టేషన్‌లో శనివారం కర్నూల్ - హైదరాబాద్ వెళ్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు దేవరకద్ర రైల్వేస్టేషన్‌లో నాలుగు గంటల పాటు నిలిపివేశారు. హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తున్న గూడ్స్‌రైలు కొటకదిర స్టేషన్ దగ్గర సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దింతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు దేవరకద్రలో నిలుపుకోవాల్సి వచ్చింది. అయితే సాంకేతిక లోపం వల్ల మార్గమధ్యంలో రైలు పట్టాలపై నిలిచిపోయిన గూడ్స్ రైలును అక్కడి నుండి తరలించేందుకు మరో రైలు ఇంజన్‌ను తీసుకువచ్చారు. దాంతో నిలిచిపోయిన గూడ్స్ రైలును మరో రైలు ఇంజన్ సహయంతో కోటకదిర రైల్వే స్టేషన్‌కు తరలించారు. గూడ్స్‌రైలును తప్పించడానికి దాదాపు నాలుగు గంటలు పట్టడంతో దేవరకద్ర స్టేషన్‌లో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోగా మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో కూడా మరో రెండు రైళ్లు గంట పాటు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11 గంటల నుండి రైలు పట్టాలపైనే సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికులు పడిగాపులు కాయల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.