మహబూబ్‌నగర్

ఊపందుకున్న పుష్కర పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, జూన్ 13: ఆగస్టు నెలలో నిర్వహించే కృష్ణ పుష్కరాల పనులు ఊపందుకున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలైన రాంపూర్, రంగాపురం, మునగమాన్‌దినె్న, తిప్పాయిపల్లి, గుమ్మడం, యాపర్ల పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల పనులకు రోడ్లు, గాట్లు నిర్మించేందుకు 30కోట్లు నిధులు కేటాయించింది. ఈపనులు సకాలంలో పూర్తిచేస్తామని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చేప్రజలకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా పార్కింగ్ సౌకర్యాలు, మరుగుదొడ్లు, తదితర వివరాలు,రైతులకు సంబంధిత పట్టా పొలాలను అధికారులు గుర్తించి పార్కింగ్ స్థలాలుగా ఏర్పాటు చేస్తున్నారు. యాపర్ల గ్రామంలో పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో సిసిరోడ్లను నిర్మించారు. పుష్కర రోడ్లు, ఘాట్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. గుమ్మడం గ్రామంలో సిసిరోడ్లు ఏర్పాటుచేయాలని గ్రామస్థులు అదిధికారులకు తెలుపడంతో ఆ పనులు కొంత జాప్యమైనా త్వరలోనే చేపట్టి పూర్తిచేస్తామన్నారు. మండలంలో అతిపెద్దఘాట్లయిన రంగాపురం, మునగమాన్‌దినె్న పుష్కర ఘాట్ల పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. పార్కింగ్‌కు ఎక్కువ స్థలాన్ని కేటాయించేందుకు తహశీల్దార్ దత్తాద్రి రంగాపురం శివారు ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. జూలై చివరి నాటికి అన్ని ఘాట్లుపూర్తవుతాయని, విద్యుత్ సౌకర్యం తదితరాలు ఏర్పాటుచేస్తామని తహశీల్దార్ చెప్పారు.