మహబూబ్‌నగర్

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 16: భూగర్భజలాల పెంపుకు దోహదపడే ఇసుకను అక్రమార్కులు ఎలాంటి జంకుబొంకులేకుండా అక్రమంగా రవాణ చేస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇసుక అక్రమ రవాణపై పూర్తిగా నిషేదం ఉన్న అధికారుల చొరవ వల్ల అక్రమార్కుల అగడాలకు హద్దు అదుపులేకుండా పోయింది. దినివల్ల సహజ వనరు అయిన ఇసుక అక్రమ రవాణ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో యదేచ్చగా కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ మండలంలో రాంచంద్రపురం, మాచన్‌పల్లి, కొటకదిర గ్రామాల మధ్య వాగులో నుండి ఇసుకను అక్రమంగా తరలించుకుపోయి విక్రయిస్తున్నారు. వాగులో గల ఇసుకను జేసిబిలతో తొగి దానిని యంత్రాలతో శుద్ది చేసి విక్రయిస్తున్నారు. ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణ యదేచ్చగా కొనసాగుతున్న సంబందిత అధికారులు ప్రజాపతినిధులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న సంబందిత అధికారులు తమకు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించడంతో వారి నిజాయి బయట పడుతుంది. అధికారులు, ప్రజాపతినిధుల అండదండలతోనే అక్రమార్కులు ఇసుకను అక్రమ రవాణను ఎలాంటి భయం లేకుండా కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణ వల్ల వాగు చుట్టూపక్కల ఉన్న వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దినివల్ల పంటలు సాగుచేసుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయిన ఇసుక అక్రమ రవాణను వృత్తిగా చేసుకున్న అక్రమార్కులు వారికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం శోచనీయం. ఈ ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తరిస్తున్న వారు సంబందిత అధికారులు, పోలీసులకు ముడుపులు చెల్లించి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరుకాయలుగా కొనసాగించుకుంటున్నారు. అయమ్యాయాలకు అలవాటు పడిన అధికారులు ఇసుక అక్రమ రవాణ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సత్వర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎంతో హంగామా చేసే పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రతినిత్యం లక్షలాది రుపాయలు ఇసుక అక్రమ రవాణ వ్యాపారం కొనసాగిస్తున్న పట్టించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. అధికారుల అండదండవల్లే తాము ఇసుక అక్రమ రవాణ వ్యాపారాన్ని యదేచ్చగా కొనసాగిస్తున్నామని అక్రమార్కులు బహిరంగంగా పెర్కోంటుండడం విశేషం. ఇప్పటికైన జిల్లా మేజిస్టేట్, కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణను పూర్తి నిర్మూలించి భూగర్భజలాలు అడుగంటిపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైన ఉంది.