మహబూబ్‌నగర్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, జూన్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అండగా ఉంటూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలో రైతు ధర్మయ్య (45) అప్పుల బాధతాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సహయ నిధి కింద రూ.6లక్షల రుపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మేలు కోసం పనిచేసే ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్నటికి మరవలేరని అన్నారు. అదేవిధంగా గోపన్‌పల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రూ.5వేల రుపాయలను ఆర్థిక సహయం అందజేశారు. అనంతరం ఆపద్బాందువు పథకం కింద సహయం పొందే విధం చూస్తానని హామీ ఇచ్చారు. అంతకంటే ముందు దేవరకద్ర పట్టణంలోని పశువైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో రైతులకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో పశువులకు సంబందించిన సామాగ్రి, మందులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా జెడితో ఫోన్‌లో మాట్లాడి దేవరకద్ర మండలంలో పశువులు, గొర్రెలు, మేకలు అధిక మొత్తంలో ఉన్నాయని ఇక్కడ వైద్యులను నియమిస్తూ సంబందించిన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. గోపన్‌పల్లితో పాటు దేవరకద్ర మండలంలోని ఆయా గ్రామాల్లోని పశువైద్యశాలలో ఏ ఏ కొరతలు ఉన్నాయో తెలుసుకుని అక్కడ సరై వసతులు ఏర్పాటు చేయాలని జెడిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. దేవరకద్ర మండలంలో నూతనంగా నిర్మించే మండల పరిషత్ కార్యాలయ పనులను ఆయన పరిశీలించారు. రూ.1.5కోట్లతో చేపట్టే మండల పరిషత్ కార్యాలయాన్ని నాణ్యత పూర్వకంగా నిర్మించాలని ఏఇని ఆదేశించారు. ఏఇ దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇవి గోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, నాయకులు కెవి రాజు, భాస్కర్‌రెడ్డి, కొండాశ్రీను, నరేందర్‌రెడ్డి, అంజనేయులు, అంజన్‌కుమార్‌రెడ్డి , సర్పంచ్ పక్కిరన్న పాల్గొన్నారు.