మహబూబ్‌నగర్

రికార్డు స్థాయిలో పాలమూరు ఎత్తిపోతల భూ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ వేగవంతంగా జరుగుతుందని, గతంలోదేశంలోనే ఎక్కడా చెల్లించని విధంగా రికార్డుస్థాయిలో 5.5లక్షల రూపాయలు ఎకరాకు చెల్లిస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డిలో అంతర్భాగమైన వీరాంజనేయ స్వామి ఏదుల రిజర్వాయర్‌కు 4500 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇప్పటికీ వెయ్యి ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. 4500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులను ఒప్పించడం జరిగిందన్నారు. పథకంలో భూ సేకరణలో వనపర్తి నియోజకవర్గం ముందుందని, అందుకు రైతులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుచెప్పారు. ప్రతిపక్షాలు కుటిల యత్నాలుచేసి భూ సేకరణను అడ్డుకునేందుకు ప్రయత్నించినా అధికారులు, పార్టీ నాయకులు రైతులను ఒప్పించి భూసేకరణకు అనుమతి తీసుకున్నారని ఆయన చెప్పారు. పరిహారం మూడు విభాగాలుగాచేసి ఎకరాకు 3.5లక్షలు, 4.5లక్షలు, 5.5లక్షలు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోనంబరు123 అమలుచేసి కేవలం మూడు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున వెయ్యి ఎకరాలు రిజిష్ట్రేషన్ చేయించుకోవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని చాటుతుందన్నారు. మరోమూడు వారాల్లో 4500 ఎకరాలను రిజిష్ట్రేషన్ చేయించుకుని భూ సేకరణను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే రైతుల సమ్మతి వచ్చినందున ఇకనుండి భూసేకరణ వేగం పెరుగుతుందన్నారు. ఆలాగే కొంకపల్లి, బండరావిపాకుల గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయని, బండరావిపాకుల చుట్టూ గోడను నిర్మించాలని భావించినప్పటికీ ఎప్పటికైనా గ్రామానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఆ రెండు గ్రామాల ప్రజల సమ్మతి తీసుకోవడం జరిగిందన్నారు. వారికి వెంటనే పరిహారంతోపాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిచేసి గ్రామాలను త్వరలోఖాళీ చేయిస్తామని, ఇప్పటికే సర్వేచేసి విలువ కూడా నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటగా మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తిచేయాలన్నదే కేసి ఆర్ ఉద్దేశ్యమని, ఆయన చిత్తశుద్దికి వేగంగా భూసేకరణ జరుగడమే నిదర్శనమన్నారు. ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుండి మూడు సంవత్సరాల్లో పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామని ఆయన చెప్పారు. నియోజకవర్గానికి ఏదుల రిజర్వాయర్ ద్వారా 35వేల ఎకరాలు, బ్రాంచి కెనాల్ ద్వారా ఖిల్లాగనపురం మండలానికి 25వేల ఎకరాలు, బుద్దారం రిజర్వాయర్ ద్వారా 24వేల ఎకరాలు, భీమాద్వారా 20వేల ఎకరాలకు సాగునీందిస్తామని ఆయన చెప్పారు. అధికారంలోకివచ్చిన అనతి కాలంలోనే అభివృద్ధి సాధించామనేందుకు ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు భూ సేకరణకు సహకరించేదిపోయి రైతులను రెచ్చగొట్టి అడ్డుకునేందుకుయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతరరాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తే నోరు మెదపని స్థానిక నేతలు ఈ ప్రాంతానికి సాగునీరందిస్తుంటే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి ప్రజలే బుద్దిచెబుతారని ఆయన అన్నారు. ఇప్పటికైనా శిఖండి రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో 1500పైచిలుకు ఆవాసాల్లో సారాను పారద్రోలి పాలమూరు జిల్లా పేదలకుటుంబాల్లో ఆనందాన్ని చూస్తున్నామని, అందుకు సహకరించిన అధికారులను ఆయన అభినందించారు. ఇతర రంగాల్లోకూడా జిల్లాను ముందుకు నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.
ఈసమావేశంలో టి ఆర్ ఎస్ నాయకులు లక్ష్మయ్య, పురుషోత్తంరెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, గట్టుయాదవ్, వాటికి శ్రీ్ధర్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, జానకిరాంరెడ్డి, ప్రమీల, రమేష్, మహేష్,విష్ణు, జాతృనాయక్, సతీష్, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడివో కార్యాలయంలో వాచ్‌మెన్ ఆత్మహత్య
ప్రతిపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా
పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 2: స్థానిక ఎంపిడివో కార్యాలయంలో పనిచేసే వాచ్‌మెన్ కట్టా నర్సింహ్మాగౌడ్(55) బుధవారం తెల్లవారుజామున కార్యాలయంలోని ఫ్యాన్‌కు కంప్యూటర్ వైర్లతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని చావుకు ప్రజాప్రతినిధులు, మండల అధికారులే కారణమని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సైదయ్య సంఘటన స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై మూడు గంటల పాటు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ వాచ్‌మెన్ నర్సింహ్మా మృతికి యాపట్ల గ్రామానికి చెందిన రాజకీయ పార్టీ నాయకుడు, పోలీసులు, అధికారులు బాధ్యత వహించాలన్నారు. గత కొన్ని నెలల క్రితం రాజకీయ నాయకుడు పోలీసులతో మృతి చెందిన నర్సింహ్మాగౌడ్‌ను కొట్టించాడని ఆరోపించగా, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదేవిధంగా ఆరోపించారు. సంఘటన స్థలానికి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి చేరుకొని సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ పార్టీల నాయకులు ఏసయ్య, కాశన్న, విజేయుడు, అరవిందు తదితరులు మాట్లాడుతూ మృతునికి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని, ఐదు ఎకరాల భూమి ఇచ్చి, ఇంట్లోఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన నర్సింహ్మాగౌడ్ ప్రభుత్వ ఉద్యోగపరంగా మేమంతా ఒక కుటుంబానికి చెందిన వారమని, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్దిని ఆ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. మృతుని అంత్యక్రియలకు ఎంపిడివో వెంకటేశ్వరరావు రూ.10వేలు కుటుంబ సభ్యులకు అందించారు.
మృతుని భార్య ఊశమ్మ, కుమారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపిడివో కార్యాలయంలో మృతి చెందిన నర్సింహ్మాగౌడ్ కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని జడ్పీటిసి వెంకటయ్య, ఎంపిపి వెంకటేశ్వరరావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు విష్ణు, సర్పంచ్ ప్రతాప్‌గౌడ్‌లు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మృతి చెందిన నర్సింహ్మాగౌడ్ సాయంత్రం ఆరుగంటలకు వచ్చి ఉదయం 7గంటలకు వెళ్లిపోయేవాడని, ఆయన మృతికి ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయిన వారే రాజకీయ లబ్దికోసమే ధర్నా చేశారని ఆరోపించారు.

పశువుల ఆసుపత్రికి రైతుల తాళం

కల్వకుర్తి, డిసెంబర్ 2: కల్వకుర్తి పట్టణంలోని వెటర్నటి ఎడి శ్రీనివాసురావును తొలగించాలని రైతులు బుధవారం వెటర్నటి అసుపత్రికి తాళం వేశారు. ఈ సందర్భంగా రైతులు సుదర్శన్‌రెడ్డి,దామోదర్‌రెడ్డి, మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి లు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి వెటర్నటి అసుపత్రి ఎడి అందుబాటులో ఉండటం లేదని గత మాసంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అకస్మీకంగా తనిఖీ నిర్వహించిన ఎడి అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు, జెడి లకు పిర్యాదు చేసిన అతనిలో ఎలాంటి మార్పు లేదని అలాగే ఇక్కడికి ఇతరులను కేటాయించక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, పాండు,కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.

ప్రజలు చైతన్యవంతులు కావడంతోనే
అవినీతిపరులను పట్టుకుంటున్నాం
3 నుండి 9వ తేదీ వరకు ఎసిబిపై ప్రజల్లో అగాహన * ఎసిబి డిఎస్పీ రాందాస్‌తేజ్
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 2: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యవంతం వస్తుందని వారు చైతన్యవంతులు అవుతున్నందువల్లే జిల్లాలో లంచాలకు రుచిమరిగిన అవినీతి పరులను పట్టుకుంటున్నామని మహబూబ్‌నగర్ ఏసిబి డిఎస్పీ రాందాస్‌తేజ్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏసిబి కార్యాలయంలో ఈ నెల 3వ తేది నుండి 9వ తేది వరకు నిర్వహించే ఏసిబి శాఖ పనితీరుపట్ల అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గొడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఏసిబి డిస్పీ రాందాస్‌తేజ్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 9వ తేదిన నిర్వహించబోయే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా నిర్వహిస్తున్నామని అయితే ఏసిబి శాఖపై విద్యార్థుల్లో, ప్రజల్లో, వివిధ వర్గాల్లో అవగాహన కల్పించడానికి వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామని అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు అని పలు అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఈ నెల 3వ తేదిన మహబూబ్‌నగర్, జడ్చర్ల, 4వ తేదిన నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, 5వ తేదిన కొత్తకోట, పెబ్బేర్, 7వ తేదిన గద్వాల, అయిజ, 8వ తేదిన మక్తల్, నారాయణపేట, 9వ తేదిన మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లో కళాజాతలతో విస్తృత అవగాహన ప్రచారం చేస్తామని డిఎస్పీ రాందాస్‌తేజ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలపై గొడపత్రికలను అంటించడం జరుగుతుందని ప్రధాన కూడళ్లల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా ఏసిబికి సంబంధించిన గొడపత్రికలను అంటించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 18 కేసులు నమోదు చేయడం జరిగిందని, పలు కేసులు కోర్టులో ట్రైయల్‌కు కూడా వచ్చాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలనకై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అందుకే ప్రజలు ధైర్యంగా వచ్చి ఏసిబిశాఖను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు, వ్యక్తులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. అవినీతిని ప్రొత్సాహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సినియర్ సిటిజన్ మన్సుర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
త్వరితగతిన తాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ

భారీ సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జోషి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర భారీ సాగునీటిశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌కె జోషి అన్నారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ ఇంజనీయర్లు, భూసేకరణ స్పెషల్ డిప్యూటి కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో బుధవారం ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ జోషి మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన 25 నూతన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యతను ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ పనులు, మిషన్‌కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ పనుల ప్రగతి వేగవంతంగా ఉండాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జి ఓ నంబర్ 123 మార్గదర్శాకాల మేరకు రైతులతో చర్చించి భూసేకరణ జరిపి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జి ఓ 123 ప్రకారం జిల్లా కలెక్టర్ వద్ద ఉన్న నిధులు సద్వినియోగపర్చాలని జిల్లా కలెక్టరే భూసేకరణ విషయంలో తుది నిర్ణయమని ఈ విషయంలో ఎలాంటి అనుమతులు అవసరం లేదని అన్నారు. నిధుల కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని భూసేకరణ విషయంలో అవసరం మేరకు ప్రైవేటు సర్వేయర్లను ఏజెన్సీల ద్వారా నియమించుకోవాలని, రిటైర్డు సర్వేయర్ల సేవలు వినియోగించుకుని భూసేకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆయన కోరారు. సర్వేయర్లు, సర్వే పనులు సకాలంలో పూర్తి చేయనిచో జి ఓ 123 వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు కాలనీల నిర్మాణం, విద్యుత్, రోడ్లు, తాగునీటి వంటి వౌలిక సదుపాయాలు, సహయ పునరావాస పనులు యుద్దప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఆర్టికల్చర్, డ్వామా, వివిధ శాఖలు సమన్వయంతో సమగ్ర సమాచారం సేకరించి ఇరిగేషన్ ప్లాన్ రూపొందించి వెంటనే సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. జిల్లా ఇరిగేషన్ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని దాని ప్రకారం కేంద్ర నిధులు విడుదల చేయనున్నందున జిల్లా ఇరిగేషన్ ప్రణాళిక అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. మిషన్‌కాకతీయ కింద మొదటి విడత చేపట్టిన చెరువులు పూర్తి చేయాలని, రెండవ విడత గుర్తించి పనులను వెంటనే అంచనాలు పూర్తి చేసి గ్రౌండింగ్‌కై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ జిల్లా స్థాయి నీటి పారుదల పథకాన్ని తయారు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ షెడ్యుల్డ్‌ను ఉదండపురం వరకు సమర్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని మిగితా సాగునీటి ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కొలతల ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఎస్‌ఇ కగేధర్, మిషన్‌కాకతీయ అధికారి లింగరాజు, ప్రత్యేక కలెక్టర్లు వనజ, నరసింహరావు పాల్గొన్నారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు
ఎన్నికల షెడ్యూల్ విడుదల
* 9వ తేదీ నామినేషన్ల తుది గడువు
* 27న పోలింగ్... 30న ఓట్ల లెక్కింపు
* జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి రాంకిషన్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 2: జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్డ్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యుల్డ్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థిగానీ, అతడి ప్రతిపాధనకుడుగానీ ఈ నెల 2వ తేది నుండి 9వ తేది వరకు ఉదయం 10 గంటల నుండి 3 గంటల మధ్య రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికిగానీ నామీనేషన్ దాఖలు చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాల్లో కాక మిగిత రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 9వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ తుది గడువు అని వెల్లడించారు. 10వ తేదిన పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఉపసంహరణకు నోటిసులకు 12వ తేదివరకు ఉంటుందన్నారు. ఈ నెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఐదు డివిజన్ల పరిధిలో జిల్లాలో 1259 మంది ఓటర్లు ఉన్నారని పెర్కోన్నారు. మహబూబ్‌నగర్ డివిజన్‌లో 392, నాగర్‌కర్నూల్‌లో 205, వనపర్తి డివిజన్‌లో 166, గద్వాల డివిజన్‌లో 212, నారాయణపేట డివిజన్‌లో 284 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎంపిటిసి, జడ్పిటిసి, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపిలు ఓటర్లు అని వీరు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో ఈ నెల 30వ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఆమలులో ఉందని ఎవరైన ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ల సమయంలో ఐదుగురు తప్పా ఎక్కువ మంది ఉండకూడదని తెలిపారు. జిల్లాలో ఎన్నికలను పకడ్భందిగా నిర్వహించడం జరుగుతుందని పెర్కోన్నారు.

టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల్లోని పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలని, సాధించని సంక్షేమ వసతి గృహా అధికారులపై చర్యలు తప్పవని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు ఎంవి రెడ్డి హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ నుండి ఎస్సీ కార్పోరేషన్ డిడి, ఇడిలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండ ఎ-వన్ గ్రేడ్ సాధించేలా సంక్షేమాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్షిక పరీక్షలకు 3నెలల సమయం ఉన్నందున ట్యూటర్ల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి విద్యార్థి భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, అనంతరం పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్‌మెంట్ పై వెళ్లే విధంగా అవగాహాన కల్పించాలన్నారు. గత యేడాది 0 ఫలితాలు సాధించిన వసతి గృహ సంక్షేమాధికారులపై చార్జేస్ ఫ్రేం చేశామని, ఈ యేడాది అలాంటి ఫలితాలు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ కొనుగోలు పథకం పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ జిల్లాలో 720 మంది విద్యార్థులు వివిధ సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ట్యూటర్లను నియమించామని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పోరేషన్ ఇడి చరణ్‌దాస్, డిఎస్‌డబ్ల్యుఓ రామారావు, ఎస్‌డబ్ల్యుఓ, వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

‘త్వరితగతిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు’
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఈ నెల చివరి నాటికి సమర్పించాలని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్‌కె జోషి కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లా కలెక్టర్ వ్యక్తిగత బాధ్యత తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణాల ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారిగా ప్రతిపాదనలను క్రోడికరించి రాష్ట్ర ప్రతిపాదనలు జనవరి 2వ వారంలో కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. జివో 123 ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ జరగాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత ఎజెన్సీల ద్వారా ప్రాజెక్టుల డిజెన్స్‌ను తయారు చేసి సమర్పించాలన్నారు.
మిషన్ కాకతీయ కింద మొదటి విడతగా చేపట్టిన పనులను మార్చి 2016నాటికి పూర్తి చేయాలన్నారు. చెరువుల పునఃరుద్దరణ పనులను ప్రజల భాగస్వామ్యంతోనే చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ వివరిస్తూ ఎజెన్సీల ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రణాళికలు సిద్ధం చేసి పంపనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో అవగాహాన సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జివో 123 కింద 154 ఎకరాల భూమిని సేకరించామని, మిగితా భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రాజెక్టుల డిజైన్‌లను పూర్తి చేసి అందజేస్తామన్నారు. మొదటి విడత కాకతీయ మిషన్‌లో 1869 చెరువుల పునఃరుద్దరణ పనులను పూర్తి చేస్తామని, రెండవ విడత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి నీటి పారుదల శాఖ ఇఎంసి మురళీధర్, విజయ్‌ప్రకాష్, నాగేందర్, జిల్లా నుండి ట్రైని అసిస్టేంట్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్ర, వ్యవసాయ శాఖ జెడి హుక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఐటి మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యునికేషన్ శాఖకు సంబంధించి జిల్లా మేనేజర్ పోస్టులు రెండు భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎదైన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఎన్‌ఐఇఎల్‌టి కంప్యూటర్స్‌లో ట్రిపుల్-సి స్థాయి సామర్ధ్యం కలిగి ఉండాలని, ఈ నెల 1 నాటికి 24నుండి 35 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని, కనీసం రెండు సంవత్సరాల అనుభవాన్ని ఐటి, ఈ-గవర్నమెంట్, ఐటి సంబంధిత ప్రాజెక్టులో పని చేయడం, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్ట్ఫికేట్లతో ఈ నెల 5లోపు సమీకృత కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08455-276921 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

రూ.138 కోట్లతో గోదాముల నిర్మాణం
మార్కెటింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరత్
మెదక్, డిసెంబర్ 2: జిల్లాలోని 46 మండలాల్లో గోదాముల నిర్మాణం కోసం రూ.138 కోట్లు మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ,రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. బుధవారం మెదక్ మార్కెట్ కమిటీలో జరుగుతున్న నల్లబెల్లం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం 6 వేల క్వింటళ్లు మాత్రమే బెల్లం ఖరీదు చేయాలని డెడ్‌లైన్ ప్రకటించినప్పటికినీ అంతకు మించి నల్లబెల్లం వస్తే ప్రతిపాదిస్తే తాను మంజూరు చేస్తానని డాక్టర్ శరత్ తెలిపారు. 8 సంవత్సరాల తరువాత నల్లబెల్లం కొనుగోలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక వెయ్యి 23 కోట్ల మెట్రిక్ టన్నుల గోదాములను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో అత్యధిక గోధములను నిర్మించబోతున్నట్లు డాక్టర్ శరత్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మెంచు నగేష్, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జడ్పీటిసి లావణ్యరెడ్డి, మార్కెట్ యార్డు ఎడి, మెదక్ జిల్లా మార్క్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జి మేనేజర్ రమేశ్, మెదక్ ఎఓ రెబల్‌సన్, తహశీల్దార్ విజయలక్ష్మీ, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై
విజయం సంతృప్తినిచ్చింది
*ఏ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటను మల్చుకుంటేనే రాణిస్తారు * పట్టుదల, క్రమశిక్షణతోనే క్రికెటర్‌గా ఎదుగుతారు
* గ్రామీణ క్రీడాకారులకు సానపెడితే ఆశాకిరణాలు అవుతారు * భారత మాజీ క్రికెటర్, కోచ్ అబిద్ ఆలీ
సిద్దిపేట, డిసెంబర్ 2: విదేశీ పర్యటనలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తినిచ్చాయని భారత మాజీ క్రికెటర్, కోచ్ అబిద్ ఆలీ వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. 1967 నుంచి 76 వరకు 29 టెస్టులు, 5 వనే్డమ్యాచ్‌లు, 1975 తొలి వరల్డ్‌కప్‌లో తాను ఆడినట్లు తెలిపారు. క్రికెటర్‌గా తనకు జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భారతజట్టులో ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందినట్లు పేర్కొన్నారు. తాను పటౌడి నాయకత్వంలో టెస్టుమ్యాచ్ ఆడినట్లు తెలిపారు. తాను టెస్టుల్లో న్యూజిలాండ్ మీద చేసిన 89 పరుగులు జట్టు విజయానికి ఎంతో దోహదం చేసిందని సంతృప్తి నిచ్చిందన్నారు. తాము ఆడిన క్రికెట్‌కు, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. తాము సీనియర్లు ఆడుతుంటే చూసి ఎంతో నేర్చుకున్నామని, సరైన గైడెన్స్ ఇచ్చేవారు కూడా లేరన్నారు. భారతజట్టు విదేశీ పర్యటకు వెళ్లినా క్రికెట్‌కు సంబంధంలేని వారు, నాన్‌ప్లేయింగ్ వారు మేనేజర్లుగా వచ్చేవారన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిజియోథెరపి ఎంతోమంది గైడెన్స్, సలహాలు, సూచనలతోపాటు ఆటలోని మెళకువలు నేర్పుతున్నారన్నారు. ఐపిఎల్ పుణ్యమా అని క్రికెట్ కోట్లాది రూపాయలకు పడగెత్తిందన్నారు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో మ్యాచ్ ఫీజు సైతం తక్కువగా ఉండేదని, ఇప్పుడు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. క్రికెట్ క్రీడకు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందని, చాలా దేశాలు క్రికెట్ ఆడుతున్నాయన్నారు. తాను టెస్టు నుంచి రిటైర్మెంట్ ఇచ్చాక 1979లో ఇంగ్లాడ్‌లో కోచింగ్ సర్ట్ఫికెట్ పొంది కోచర్‌గా అవతారమెత్తానన్నారు. తాను కోచ్‌గా యుఎఇకి ఐదు సంవత్సరాలు, అమెరికాలో ఏడాది, మాల్దీవులకు ఏడాది, ఆంధ్రా జట్టుకు మూడేళ్లు కోచ్‌గా వ్యవహరించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. ప్రస్తుత క్రికెటర్లు పట్టుదల, క్రమశిక్షణ, నైపుణ్యం, ఫిట్‌నెస్ కలిగి ఉంటేనే రాణిస్తారన్నారు. టెస్టు, వన్‌డే, ట్వంటి 20 ఫార్మాట్లలో సైతం క్రికెటర్లు ఏ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటతీరును మలుచుకోవాలన్నారు. క్రికెటర్ మెంటల్‌గా ఫిట్‌గా ఉంటేనే ఆటకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరన్నారు. ప్రస్తుత క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. టెస్టుల్లో సైతం 5 రోజుల నుంచి 4 రోజులకు మార్చేందుకు చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ గ్రామీణ ఫ్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారన్నారు. వారి నైపుణ్యానికి సానపెడితే భవిష్యత్‌లో భారతజట్టుకు ఆశాకిరణాలు అవుతారన్నారు. క్రికెట్‌లో బెట్టింగ్, అవినీతి పనులకు క్రికెటర్లు దూరంగా ఉండాలని సూచించారు.

మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి
సదాశివపేట, డిసెంబర్ 2: వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృక్పతంతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలువాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. బుధవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన విజయా మల్టి స్పెషాలిటి ఆసుపత్రిని మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించని రోజుల్లో చెట్లతో తయారు చేసే ఔషదాలను అందించి ఆయా రుగ్మతలను నిర్మూలించే వారని, అలాంటి సమయంలో ప్రజలు వైద్యుడిని వైద్యో నారాయణ హరి అంటూ దేవుడితో సమానంగా భావించే వారన్నారు. పెట్టుబడులు పెట్టి నిర్మిస్తున్న వైద్యశాలల్లో ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, అలాంటి దృక్పతాన్ని విడనాడి సాధారణ రుసుముతో మేలైన వైద్యం అందించాలన్నారు. సదాశివపేట లాంటి పట్టణాలకు పల్లె సీమల నుంచి నిరుపేద ప్రజలు వస్తుంటారని వారికి మంచి సేవలు అందించి గుర్తింపు పొందాలన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణానికి చుట్టుప్రక్కల ఉన్న వంద గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారని,వ్యాపార పరంగా పట్టణం విస్తరించిందని, కార్పోరేట్ ఆసుపత్రులు లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఇలాంటి నేపథ్యంలో విజయా మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో ప్రజలకు సత్వర వైద్య సేవలు అందనున్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్నం విజయలక్ష్ని, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తగొల్ల కృష్ణ, కౌన్సిలర్లు చింతా గోపాల్, కుద్దూస్, డాక్టర్లు భరత్‌గౌడ్, కల్యాణ్ చక్రవర్తి, భావన, సీనియర్ సివిల్ కాంట్రాక్టర్ పిల్లిగుండ్ల నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

* డ్రైవరుతో సహా ఎనిమిది మందికి గాయాలు
పటన్‌చెరు, డిసెంబర్ 2: బస్టాండు నుండి బయటికి వస్తున్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన సంఘటన పటన్‌చెరు పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరుతో సహా ఎనమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయ. పట్టణంలోని ఆసుపత్రికి తరలించి గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు అందించిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు ఎపి 29 జెడ్ 1504 నంబరు గలది బుధవారం ఉదయం స్థానిక బస్‌స్టేషన్‌కు చేరకుంది. నారాయణఖేడ్ నుండి హైద్రాబాద్ వెళుతున్న బస్సు పటన్‌చెరులో ప్రయాణికులను ఎక్కించుకున్న తరువాత తిరిగి రాజధాని వెళ్లడానికి బస్టాండు ఔట్‌గేట్ నుండి బయటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన హైద్రాబాద్ నుండి సంగారెడ్డి వైపు వెలుతున్న కెఎ 56 0795 నంబరు గల లారీ అతివేగంగా వచ్చి బస్సు మధ్య భాగంలో కుడివైపు డీ కొట్టింది. దీనితో బస్సు కొద్ది దూరం వరకు వెనక్కి వెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రమైన కుదుపుకు గురయ్యారు. బస్సులోని దాదాపు ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయ. జోగిపేట పట్టణానికి చెందిన చిన్నారి దేవీ ప్రియ (5), ఆమె సోదరుడు హర్షిద్ (8) గాయాల పాలయ్యారు. వీరితో పాటు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సమ్మ (45), శ్రీనివాస్ (43), అక్షయ్ (13), విట్టమ్మ(34) తదితరులు గాయపడ్డారు. బస్సు డ్రైవరు రాజనర్సయ్య (49)కు తీవ్రమైన గాయాలు కాగా కండక్టర్ రాములు తలకు గాయమైంది. ప్రస్తుతం వీరందరూ పట్టణంలోని అంజయ్య స్మారక వందపడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పటన్‌చెరు సిఐ లింగేశ్వర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.

క్రీడాకారులు ఆటపై ప్రత్యేక దృష్టి సారించాలి
* సమష్టి కృషితోనే విజయాలు దక్కుతాయి * భారత మాజీ క్రికెటర్ అబీద్‌అలీ
సిద్దిపేట, డిసెంబర్ 2 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్, కోచ్ అబీద్ అలీ అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట మినీస్టేడియంలో బుధవారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు ఆటపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రీడాకారులు జట్టుగా, సమష్టిగా కృషిచేస్తేనే విజయాలు దరిచేరుతాయన్నారు. క్రీడలు స్నేహపూర్వకమైన వాతావరణంలో జరగాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషిచేస్తుండడం అభినందనీయమన్నారు. ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ షాబోద్దీన్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలను ఎప్పుడు మొక్కుబడిగా ఆడవద్దని, వందశాతం మనస్సును లగ్నం చేసి ఆడాలన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిస్తేనే రాష్ట స్థాయి పోటీలకు ఎంపికకు మార్గం సుగమం అవుతుందన్నారు. క్రీడల్లో ప్రతిభ వున్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు మంచి ఫిట్‌నెస్‌తో వుంటారని, వారి నైపుణ్యాన్ని వెలికితీస్తే భవిష్యత్తులో మంచి క్రీడకారులుగా ఎదుగుతారన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలాంటి క్రీడాకారులను వెలికితీయడమే టిసిఎస్ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను పదునుపెట్టేందుకు టిసిఎస్ పక్షాన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చక్కని ప్రతిభ కనబర్చిన క్రీడారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో టిసిఎస్ పక్షాన పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు అవ