మహబూబ్‌నగర్

హరితహారంపై కళాజాత ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దూర్, జూన్ 24: హరితహారం, బండిబాటపై జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని కొత్తపల్లి, కుమ్ముర్ గ్రామాల్లో బడిబాట, హరితహారం కార్యక్రమాలను నిర్వహించారు. కళాకారులు పల్లె జానపదాలతో ఆటపాటల ద్వారా పాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని ఆడుతూ పాడుతూ చదువుకోవాలని, పశువుల, గొర్రెల కాపరులుగా బాలలు కావద్దని తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించి విద్యాబుద్దులు నేర్పించాలని అన్నారు. చదువు సంస్కారాన్ని నేర్పుతుందని విద్య వినయాన్ని కలిగిస్తుందని కళాజాత ప్రదర్శన చేశారు. అలాగే పెద్దలు, యువకులు అందరు కలిసికట్టుగా తమ తమ గ్రామల్లో మొక్కలు నాటాలని అన్నారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, బాల్య వివాహాలు చేయవద్దని తెలిపారు. ప్రదర్శనలో అంజమ్మ, కిరణ్, నరసింహ, బాలమ్మ, అరుణ, గోపి పాల్గొన్నారు.