మహబూబ్‌నగర్

పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్ చార్జీలు తగ్గించాలంటూ... కాంగ్రెస్ నేతల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం హైదరాబాద్ రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై అంబేద్కర్ చౌరస్తాలో మహధర్నాకు దిగారు. అదేవిధంగా రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైటాయించి రాస్తారోకోకు దిగడంతో పోలీసులు కల్పించుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించోద్దని రాస్తారోకోను విరమించాలని పలుమార్లు పోలీసులు సూచించినప్పటికి కాంగ్రెస్ నేతలు ససేమిర అన్నారు. దీంతో పోలీసులు రోడ్డుపై బైటాయించిన కాంగ్రెస్ నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్తూ ఆరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాస్తారోకోలో డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్, ఆర్టీసి చార్జీలు తగ్గించకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని ప్రభుత్వం ఆహంకార దోరణితో వ్యవహరిస్తుందన్నారు. మన పాలన మనకు వస్తే ఎలాంటి చార్జీలు పెంచబోమని ఉద్యమ సమయంలో కెసి ఆర్ ప్రజల్లో ఆశలు కల్పించారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని మరిచిపోయారన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే లాభాల్లో తీసుకురావడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికిని అలాంటి చర్యలకు పూనుకోకుండా ప్రజలపై భారం పడే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టీసీలో ఎన్నికలు ఉన్నందున ఇక్కడ కూడా కార్మికుల ఓట్ల కోసమే ఇలాంటి నాటకాలకు తెర లేపారని విమర్శించారు. విద్యుత్ చార్జిల బారం ప్రజలపై తీవ్రంగా పడబోతుందని ఈ విషయంపై ముఖ్యమంత్రి తప్పకుండా ఆలోచించాలని హితవు పలికారు. విద్యుత్ చార్జిలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ మాట్లాడుతూ ఆయా సంస్థలు నష్టాల్లో ఉంటే వాటిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం భాద్యతల నుండి తప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల తరపున పోరాటలు చేస్తుంటే పోలీసులు ఆరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో డిసిసి నాయకులు ముత్యాల ప్రకాష్, రంగారావు, పటేల్ వెంకటేష్, వినోద్‌కుమార్, బ్రహ్మయ్య, అనిఫ్, ఆమరేందర్, నరసింహరావు, హుస్మాన్‌ఖాద్రి, రవికిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, విఠల్‌రెడ్డి, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బడుగుల సౌలభ్యానికే 108 అంబులెన్స్ సేవలు
* ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
మక్తల్, జూన్ 25: మక్తల్, మాగనూర్ మండలాలకు చెందిన ప్రజలు 108 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం మక్తల్‌లో నూతన 108 వాహనానికి ఎమ్మెల్యే చిట్టెం పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించి ఆధుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎక్కడ ఏప్రమాదం సంబవించిన ఇచ్చిన 10 నిమిషాల సమయంలో 108 అంబులెన్స్ వాహనం అక్కడకు చేరుకొని వారి ప్రాణాలను రక్షించే విదంగా ముందస్తు ప్రథమ చికిత్స నిర్వహించి తదుపరి రోగులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించటం జరుగుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో 108 పైలెట్ కురుమూర్తి, టిఆర్‌ఎస్ నాయకులు రవిశంకర్‌రెడ్డి, హన్మంతు, గోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజమహేందర్‌రెడ్డి, రహీం పాటెల్ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
* పేదలకు రంజాన్ దుస్తుల పంపిణీ * జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్
గద్వాల, జూన్ 25: రంజాన్ పండుగను ప్రతి పేద ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఇందుకు తెలంగాణ ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. గద్వాల పట్టణంలోని నల్లకుంట షాదిఖానా మజీదులో శనివారం వెయ్యిమంది ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రతి పేద ముస్లింకు దుస్తులు పంపిణీ చేయాలనే ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గ ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ముస్లింల అభ్యున్నతికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం షాదిముభారక్ పేరున పేద ముస్లిం కుటుంబాలలో వివాహం జరిగితే పెళ్లికూతురుకు రూ.51వేలు మంజూరు చేస్తుందన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలలో ఉండే ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఉదయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ బండల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, ఎంపిపి సుభాన్, వార్డు కౌన్సిలర్లు నెమలికంటి జయమ్మ, ఇసాక్, అన్వర్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

2013 భూసేకరణ చట్టం నిర్వాసితులకు నష్టం
* 123 జిఓతోనే అధిక పరిహారం * రేవంత్‌రెడ్డిది దొంగదీక్ష
* నిరాధార ఆరోపణలు చేస్తే ప్రాసిక్యూట్ చేస్తాం * శ్రీశైలం నిర్వాసితుల బాధలకు కారణం కాంగ్రెస్, టిడిపిలే
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జూన్ 25: 2013 భూసేకరణ చట్టాన్ని తెలంగాణలో ప్రాజెక్టుల కింద నిర్వాసితులవుతున్న బాధితులకు ఆమలు చేస్తే తీవ్రంగా నష్టం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి హితవు పలికారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి నేతలు నిర్వాసితులను, ముంపు బాధితులను తప్పుదొవపట్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 123 జిఓ ప్రకారంగానే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్, టిడిపి నేతలు 123 జిఓను వ్యతిరేకిస్తున్నారని ఆసలు ఆ సన్యాసులకు జిఓ గురించి తెలియదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఏ నిర్వాసితులైతే తమకు ఆమలు చేయాలని ముందుకువస్తే అలాంటి వారికి అవగాహన కల్పించి పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని, ఆయన మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై చేపట్టిన దీక్ష దొంగ దీక్ష అని చంద్రబాబు, రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ఒక్క వెంట్రుక కూడా పీకలేరని హెచ్చరించారు. ఇకమీదట ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి కెసిఆర్‌పైనే నిరాదరణమైన ఆరోపణలు చేస్తే ప్రాసిక్యూషన్ చేస్తామని నిరంజన్‌రెడ్డి రేవంత్‌రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ఆంధ్రలో చంద్రబాబు రైతులకు ఎక్కువ డబ్బులు ఎందుకు ఇచ్చారో ఆసలు విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలోని కాంగ్రెస్, టిడిపి కొన్ని వామపక్షాలు తెలంగాణ వ్యతిరేకపక్షాలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. 123 జిఓపై, 2013 భూసేకరణ చట్టంపై ఎక్కడ చర్చకు సిద్దమంటే అక్కడికి వస్తానని అధికారికంగా చర్చించుకోవడానికి ఎన్నో వేదికలు ఉన్నాయని ఆ వేదికలకు రావాలని, పౌరసమాజంలో కూడా చర్చించుకునే అవకాశం ఉందని వాటిని కాకుండా ఎదో ఎలగబెడతామని చెబుతూ ప్రభుత్వంపై లేనిపోని అబండాలు వేస్తే చుస్తూ ఊరుకోమని, తమ దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
శాంతినగర్, జూన్ 25: గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కలెక్టర్ శ్రీదేవి అన్నారు. శనివారం వడ్డేపల్లి మండల పరిధిలోని పడమటి గార్లపాడు గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ శ్రీదేవి, ఐజిపి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌పి రెమా రాజేశ్వరి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హాజరయ్యారు. మురుగునీటి నివారణ కొరకై డ్రైనేజీ నిర్మాణం కొరకు భూమిపూజ నిర్వహించారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల సందర్శించి, రికార్డులను పరిశీలించి విద్యాభ్యాసం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామమైన పడమటి గార్లపాడులో పుట్టిపెరిగిన ఐజిపి శ్రీనివాస్‌రెడ్డి గ్రామం అభివృద్ధి బాటలో పయనించేందుకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న కారణంగా ఆమె అభినందించారు. గ్రామంలో బడిబయటి బాలబాలికలను బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. గ్రామంలోని ప్రజలందరు వంద శాతం మరుగుదొడ్లు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించుకొని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామాన్ని, తమ ఇంటి పరిసర ప్రాంతాన్ని స్వచ్చ్భారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్యాలు సంభవించకుండా కాపాడుకోవచ్చని సూచించారు. గ్రామానికి రవాణా సౌకర్యం కోసం బిటి రోడ్లు నిర్మించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి రూ.5లక్షలు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాజోళి గ్రామస్థులు రాజోళి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమానికి సర్పంచ్ మోతిహుసేన్, జడ్పీటిసి వెంకటేశ్వరమ్మ, ఎంపిటిసి సభ్యులు బసన్న, మాజీ సర్పంచ్‌లు గంగిరెడ్డి, శ్రీరామిరెడ్డి, కుర్వ కిష్టన్న, తహశీల్దార్ చంద్రవౌలి, ఎంపిడిఓ నర్సింహులు, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 25: ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం రాయల్ ఫంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్బాన్ని పురస్కరించుకుని ప్రభుత్వపరంగా వచ్చిన దుస్తులను, పండుగ సామాగ్రిని పేదలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని కులాల మాదిరిగా ముస్లిం మైనార్టీలకు షాదిముబారక్ పథకం ద్వారా రూ.51వేల ఆర్థిక సహయం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా పేదల ఇళ్లల్లో కూడా పండుగ వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. మసీదులకు, కబరాస్తన్‌లకు మరమ్మతులు చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు ఇంతియాజ్, మక్బుల్, వాహిద్, కౌన్సిలర్ హది, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ పట్టణంలోని వల్లబ్‌నగర్‌తో పాటు వివిధ వార్డులలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పర్యటించారు. హనుమాన్‌పూర్‌లో కూడా పర్యటించి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థతో పాటు మంచినీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వార్డుల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల్లో దెబ్బతిన్న చోట సిసిరోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలను త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, మున్సిపల్ కమిషనర్ బుక్యా దేవ్‌సింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీరు మనుషులా...జంతువులా?
* సిగ్గుమాలిన రాజకీయాలు మానండి * ప్రాజెక్టుల నిర్మాణం...జిల్లాల ఏర్పాటుపై ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దు
* కాంగ్రెస్, టిడిపి నేతలపై ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఫైర్
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జూన్ 25: మీరు మనుషులా లేకుంటే జంతువులా? అసలు మీకు సిగ్గుసైం ఉందా...సిగ్గుమాలిన రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తారంటూ కాంగ్రెస్, టిడిపి నాయకులపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై చేపట్టిన దీక్షతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ గద్వాల జిల్లా కోసం చేస్తున్న డిమాండ్లను నిరంజన్‌రెడ్డి తప్పుపట్టారు. భార్య గద్వాల జిల్లా కావాలని ఏక పక్షంగా డిమాండ్ చేయడం, ఆమె భర్త తమను కర్ణాటకలో కలపాలని చెప్పడం, భావనేమో ఆత్మకూర్ దగ్గర ఓ బ్రిడ్జి నిర్మించి అత్మకూరు కలిపి నడ్డిగడ్డ జిల్లా చేయోచ్చని చెప్పడం అసలు ఒకే కుటుంబానికి పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేయడం ఏమిటన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జిల్లాలో పుట్టి జిల్లా ప్రజలకు తలవంపు తెచ్చారన్నారు. జిల్లా వాడని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. అసలు కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రాజెక్టుల నిర్మాణాలపై, జిల్లాల ఏర్పాటుపై ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించే ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాన్ని జిల్లాలుగా చేయమనడంలో తప్పులేదని అయితే ఒక్కో జిల్లాలో 25 మండలాలతో కూడిన జిల్లాను చేయాలని భావనతో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మండలాల ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోకుండా గద్వాల జిల్లా కావాలని ఎమ్మెల్యే డికె అరుణ ఏకపక్షంగా ఉద్యమం చేస్తాననడం తాను తప్పు పడుతున్నానని తెలిపారు. ప్రజలను మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించడం మానుకోవాలని హితవుపలికారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాత్రం ఉదయం ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి వనపర్తి జిల్లా కావాలంటారు. సాయంత్రం గద్వాల జిల్లా కావాలంటూ ఎమ్మెల్యే డికె అరుణతో కలిసి డిమాండ్ చేయడం మంచిపద్దతి కాదన్నారు. జిల్లాల విషయంపై సుదీర్ఘంగా ప్రజాభిప్రాయం తప్పకుండా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు మనుషుల మాదిరి వ్యవహరించాలని, జంతువుల మాదిరిగా వ్యవహరించొద్దని హితవుపలికారు. రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయని దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతిపక్షాలు తమ పాత్ర పోషించకుండా తెలంగాణ వ్యతిరేక పక్షంగా మారాయని ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని కుట్రలు చేసిన ఎన్ని దొంగదీక్షలు చేపట్టిన, కాంగ్రెస్ నాయకులు ఎన్ని నాటకాలు వేసిన తెలంగాణలో ప్రాజెక్టులను అనుకున్న రీతిలో కట్టితీరుతామని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం విషయంలో నష్టం జరగనుందని అదే ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొచ్చిన 123 జిఓ ప్రకారం భూ నిర్వాసితులకు మేలు జరగనుందని ఈ విషయాన్ని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని నిరంజన్‌రెడ్డి హితవుపలికారు.

పేదలపై భారం మోపుతున్న కెసిఆర్ ప్రభుత్వం
* ధర్నాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసి బస్సు చార్జీలు పెంచి పేదలపై పెను భారాన్ని మోపిందని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. శనివారం పెంచిన చార్జీలకు నిరసిస్తూ వనపర్తి డిపోముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వర్షాలు సరిగా లేక కరువుతో ప్రజలు అల్లాడుతున్న సందర్బంలో ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలు పెంచడం పేదలపై భారాన్ని మోపడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన విద్యుత్, ఆర్టీసి బస్సు చార్జీలను తగ్గించాలని, నిత్యవసర ధరలను తగ్గించాలని, రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడిపై సరఫరా చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని పూర్తిగా చెల్లించి రైతులు తిరిగి బ్యాంక్‌లలో రుణాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిపోముందు కాంగ్రెస్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కల్గింది. పోలీసులు వారిని అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించి బస్సులను పునరుద్దరించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసు స్టేషన్‌లోనే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, మండల కాంగ్రెస్ అద్యక్షులు తిరుపతయ్య, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కృష్ణబాబు, శ్యాంకుమార్, రాధాకృష్ణ, షఫి, చంద్రవౌళి, జనార్థన్, బాబ, వశ్యానాయక్, మనె్నం యాదవ్, అబ్దుల్లా, రాగివేణు, వాల్యానాయక్, శంకర్‌రావు, యాది, జాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఆమనగల్లు, జూన్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డిజిల్, విద్యుత్, బస్సుల చార్జీలను పెంచినందుకు నిరసనగా శనివారం ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్థం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్థం చేసి ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పెట్రోల్, డీజిల్, బస్సు, విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిచ్యానాయక్, దనుంజయ, లక్ష్మయ్య, వెంకటయ్య, మైసయ్య, సాయి, ఖాధర్, ఖలీల్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

భారం మోపడమే బంగారు తెలంగాణ లక్ష్యమా?
-సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
నారాయణపేటటౌన్, జూన్ 25: బంగారు తెలంగాణ అంటే భారాలు మోపే తెలంగాణ కాదు ... ప్రజల బతుకులు బాగు చేసే తెలంగాణ అని, మోయలేని భారం మోపుతూ ప్రజలను నమ్మించి వంచిస్తూ సాగిస్తున్న పాలనే బంగారు తెలంగాణ లక్ష్యమా అని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా నాయకుడు బి.రాము ప్రశ్నించారు. శనివారం సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ, కరెంట్ చార్జీలకు నిరసనగా ర్యాలీ నిర్వహించి సత్యనారాయణ చౌరస్తాలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో అవసరం ఉంటే ఒక మాట అవసరం తీరాక మరోవిధంగా మాట్లాడటం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతోందన్నారు. రైతు రుణమాఫీ కేవలం ఒక పరిహాసంగా మారిందన్నారు. పివైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ పెంచిన ఆర్టీసీ, కరెంట్ చార్జీల మోత ప్రజలకు భారంగా మారుతుందన్నారు. గుళ్లు, గోపురాలు, పండగలు, పబ్బాల పేరిట ప్రభుత్వం కోట్లు తగలేయడం కంటే ఆర్టీసీ, కరెంట్ సంస్థలను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూయించాలన్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే తగిన నిర్ణయం తీసుకోకపోతే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి, ప్రజా సంఘాల నాయకులు ప్రశాంత్, అంజి, సలీం, గణేశ్, చెన్నారెడ్డి, నారాయణ, బాలకృష్ణ, హాజీ మలంగ్, వెంకటయ్య, ఎదురింటి నర్సిములు, నరేశ్, డి.నర్సిములు, బాలు, హనే్మష్ తదితరులు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్, బస్ చార్జీలు తగ్గించాలి
* బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి
ఆమనగల్లు, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి డిమాండ్ చేశారు. శనివారం ఆమనగల్లులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి పేద ప్రజల నడ్డి విరిచే కార్యక్రామానికి పునుకుందన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆమలు పర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన రీతిలో బుద్ద్ధిచెబుతారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఒకే కుటుంబ పాలనల వల్ల అభివృద్ధి కుంటుబడుతుందని మిషన్‌కాకతీయ పథకం వర్షాకాలమైన ప్రారంభమైన పనులు వేగవంతం కావడం లేదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం పథకం ఇంత వరకు ఎ నియోజకవర్గాల్లో ప్రభుత్వం పనులు ప్రారంబించలేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ చెప్పేది ఒకటి చేసేది మరొకటని ఆచారి విమర్శించారు. ఆమనగల్లు మండలంలోని కడ్తాల గ్రామ సమీపంలో ఫార్మాసిటీ కోసం నిరుపేదల భూములను లాక్కోవడం ప్రభుత్వానికి తగదని అన్నారు. దినిని తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి సినియర్ నాయకులు శేఖర్, ఎంపిటిసి ఝూన్సీ తదితరులు పాల్గొన్నారు.