మహబూబ్‌నగర్

పింఛన్ల కోసం వృద్ధుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, మార్చి 21: వివిధ గ్రామాల్లో గడచిన రెండు నెలలుగా పింఛన్లు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూర్ పట్టణంలోని గాంధీచౌరస్తాలో రాస్తారోకో నిర్వహించిన అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయింపు జరిపారు. ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆసరా ప థకాన్ని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ చేయకపోవడం మూలంగా వృద్దులు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్ప ందించి పింఛన్లు పంపిణీ చేసే వరకు ఇక్కడే బైఠాయింపు కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చోవడంతో కార్యాలయంలో పనులు కొంతసేపు స్థం బించి పోయాయి. ఎట్టకేలకు ఆత్మకూర్ తహశీల్దార్ ప్రేమ్‌రాజ్ ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో తమకు వారం రోజుల సమయం ఇవ్వాలని, ఏప్రిల్ మొదటి వారంలో అందరికి పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో శాంతించారు.
మల్దకల్‌లో...
మల్దకల్: మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు సోమవారం వృద్దులు పింఛన్ల కోసం ఆందోళన చేపట్టారు. మండల కేంద్రానికి చెం దిన దాదాపు 20 మందికి పైగా వితంతువులు, వృ ద్ధ్దులు పింఛన్లు రాక 20 రోజులు కావస్తున్నా నేటి వరకు పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆరోపించారు. ప్రతి నెల 5వ తేదిలోపు పింఛన్లు పంపిణీ చేసేవారని, గత మూడు నెలల నుంచి పింఛన్లు 20వ తేది దాటినా గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేయకపోవడం వల్ల అనేక మంది వృద్దులు పస్తులుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పింఛన్లను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.